దేశంలో 4 కోట్లకు పైగా పాత వాహనాలు; కర్ణాటకలోనే అత్యధికం!

దేశంలో పాత వాహనాల సంఖ్య గణనీయంగా ఉన్నట్లు ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. తాజాగా, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో 15 ఏళ్లకు పైగా వయస్సు నిండిన వాహనాలు 4 కోట్ల పైచిలుకు ఉన్నట్లు పేర్కొంది.

దేశంలో 4 కోట్లకు పైగా పాత వాహనాలు; కర్ణాటకలోనే అత్యధికం!

ఇలాంటి వాహనాలన్నీ గ్రీన్ టాక్స్ వర్గంలోకి వస్తాయి. దేశంలో అత్యధికంగా పాతకాలపు వాహనాలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నట్లు సదరు నివేదికలో తెలిపారు. కర్ణాటకలో 15 ఏళ్లు పైబడిన వాహనాల సంఖ్య 70 లక్షలకు పైగా ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాల రికార్డుల ప్రకారం పాత వాహనాల డేటాను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

దేశంలో 4 కోట్లకు పైగా పాత వాహనాలు; కర్ణాటకలోనే అత్యధికం!

ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ మరియు లక్షద్వీప్ ప్రాంతాల నుండి డేటా అందుబాటులో లేనందున, ఈ జాబితా నుండి సదరు ప్రాంతాలు మినహాయించబడ్డాయి. హరిత పన్నుకు (గ్రీన్ టాక్స్) సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్రాలకు పంపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

MOST READ:భారతమార్కెట్లో 2021 మార్చి నెలలో విడుదలైన కార్లు; పూర్తి వివరాలు

దేశంలో 4 కోట్లకు పైగా పాత వాహనాలు; కర్ణాటకలోనే అత్యధికం!

పాత వాహనాల్లో, గ్రీన్ టాక్స్‌కు వర్తించే వాహనాలు 2 కోట్లకు పైగా ఉంటాయని, వాటి రిజిస్ట్రేషన్ వయస్సు సుమారు 20 ఏళ్ళకు పైగా ఉంటుందని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు.

దేశంలో 4 కోట్లకు పైగా పాత వాహనాలు; కర్ణాటకలోనే అత్యధికం!

పురాతన వాహనాల జాబితాలో రాష్ట్రాల వారీగా చూస్తే, కర్ణాటక తర్వాత 56.54 లక్షల వాహనాలతో ఉత్తర ప్రదేశ్ రెండవ స్థానంలో ఉండగా, 50 లక్షల వాహనాలతో ఢిల్లీలో మూడవ స్థానంలో ఉంది. ఇలాంటి వాహనాలన్నీ నిర్దేశించిన ప్రమాణం కంటే ఎక్కువ కాలుష్యానికి కారణమవుతున్నాయి.

MOST READ:సైకిల్ వాలా దోశకి బలే డిమాండ్ గురూ.. ఎక్కడో తెలుసా?

దేశంలో 4 కోట్లకు పైగా పాత వాహనాలు; కర్ణాటకలోనే అత్యధికం!

దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్లకు పైబడిన వాహనాలు 35.11 లక్షలు ఉన్నాయి. కేరళలో 33.43 లక్షలు, తమిళనాడులో 33.43 లక్షలు, పంజాబ్‌లో 25.38 లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో 22.69 లక్షల వాహనాలు నిర్దేశించిన కాల పరిమితి కంటే పాతవిగా గుర్తించబడ్డాయి. అదే సమయంలో, అనేక ఇతర రాష్ట్రాల్లో, 1 లక్ష నుండి 5 లక్షల మధ్య పాత వాహనాలు నడుస్తున్నాయి.

దేశంలో 4 కోట్లకు పైగా పాత వాహనాలు; కర్ణాటకలోనే అత్యధికం!

పాత వాహనాల జాబితాలో హైబ్రిడ్, సిఎన్‌జి, ఇథనాల్, ఎల్‌పిజి మరియు బ్యాటరీలపై నడిచే వాహనాలను మినహాయించారు. నిర్ణీత పరిమితి కంటే పాత వాహనాలపై ప్రభుత్వం హరిత పన్ను (గ్రీన్ టాక్స్) విధిస్తుందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పాత వాహనాల నుండి విధించే పన్ను మొత్తం స్వచ్ఛమైన శక్తితో నడుస్తున్న ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయనున్నారు.

MOST READ:ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ

దేశంలో 4 కోట్లకు పైగా పాత వాహనాలు; కర్ణాటకలోనే అత్యధికం!

హరిత పన్ను (గ్రీన్ టాక్స్)కు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు పాత వాహనాల నుండి గ్రీన్ టాక్స్ వసూలు చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం, 15 సంవత్సరాల కంటే పాతబడిన వాణిజ్య వాహనాలపై మరియు 20 సంవత్సరాల కంటే పాతబడిన ప్రైవేట్ వాహనాలపై గ్రీన్ టాక్స్ విధించబడుతుంది.

దేశంలో 4 కోట్లకు పైగా పాత వాహనాలు; కర్ణాటకలోనే అత్యధికం!

ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితికి మించి ప్రజలు ఎక్కువ సమయం పాత వాహనాలను ఉపయోగించకుండా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. సాధారణంగా 15 లేదా 20 సంవత్సరాల కంటే పైబడిన పాత వాహనాలు కొత్త వాహనాలతో పోలిస్తే 10-12 రెట్లు ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి, ఇది దేశంలో వాయు కాలుష్య స్థాయిని మరింత పెంచుతుంది.

MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

దేశంలో 4 కోట్లకు పైగా పాత వాహనాలు; కర్ణాటకలోనే అత్యధికం!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం వాణిజ్య మరియు ప్రైవేట్ వాహన యజమానులు తమ పాత వాహనాలను స్వచ్చందంగా స్క్రాప్ చేయవచ్చు. ఇలా స్క్రాప్ చేసిన వారికి ప్రభుత్వం కొత్త వాహనాల కొనుగోలుపై రాయితీలను మరియు పన్నుల్లో తగ్గింపులు వంటి ప్రోత్సాహాకలను అందించనుంది.

దేశంలో 4 కోట్లకు పైగా పాత వాహనాలు; కర్ణాటకలోనే అత్యధికం!

ఈ వెహికల్ స్క్రాపింగ్ విధానం కోసం ప్రభుత్వం రూ.10,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. ఈ విధానం ద్వారా 50,000 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ విధానం ప్రకారం, పాత హెవీ, మీడియం మరియు తేలికపాటి వాహనాలను స్క్రాప్ చేస్తారు. వెహికల్ స్క్రాప్ విధానంతో దేశంలో ఆటోమొబైల్ తయారీదారుల వ్యాపారం కూడా 30 శాతం పెరిగి రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ఇది రూ.4.5 లక్షల కోట్లుగా ఉంది.

Most Read Articles

English summary
Over 4 Crore Old Vehicles Running On Indian Roads, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X