2021 ఆగష్టు కార్ సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది; టాప్‌లో Maruti Suzuki
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా ఉదృతంగా వ్యాపించి ప్రజలకు మాత్రమే కాకూండా ఆటో ఆటో పరిశ్రమలకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. అయితే కరోనా వైరస్ కొంత తక్కుముఖం పట్టిన తర్వాత ప్రజలు మరియు ఆటో మొబైల్ పరిశ్రమలు మెల్లమెల్లగా శ్వాసతీసుకోగలుగుతున్నాయి.

కరోనా కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమల అమ్మకాలు బాగా దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతం ఈ అమ్మకాలు కొంత పెరుగుదలవైపు సాగుతున్నాయి. వెల్లడైన నివేదికల ప్రకారం 2021 ఆగష్టు నెలలో దేశీయ మార్కెట్లో మొత్తం 2,59,555 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది. ఆంటే ఈ అమ్మకాలు మునుపటికంటే కూడా 10.9 శాతం ఎక్కువ.

అదేవిధంగా నెలవారీ అమ్మకాల నివేదికలను పరిశీలిస్తే, గత జులై 2021 కంటే కూడా 11.8 శాతం క్షీణతను నమోదు చేసినట్లు తెలుస్తుంది. గత నెలలో, ఆటోమొబైల్ పరిశ్రమ సెమీకండక్టర్ (చిప్) కొరత వల్ల కార్ల ఉత్పత్తి మరియు సరఫరా మొత్తం తగ్గింది. ఇప్పుడు కూడా దేశీయ కార్ల తయారు సంస్థలు సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి.

భారతీయ మార్కెట్లో Maruti Suzuki (మారుతి సుజుకి), Hyundai (హ్యుందాయ్) మరియు Tata Motors (టాటా మోటార్స్) తో సహా 15 కార్ కంపెనీలు 2021 ఆగస్టు నెలలో మొత్తం 2,59,555 యూనిట్ల ప్యాసింజర్ కార్లను విక్రయించాయి.

ఇందులో, Maruti Suzuki (మారుతి సుజుకి) అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. Maruti Suzuki ఆగష్టు నెలలో మొత్తం 1,03,187 యూనిట్ల కార్లను విక్రయించి ఈ జాబితాలో మొదటి స్థానాన్ని పొందింది. ఇందులో కంపెనీ మార్కెట్ వాటాను 38.9%కి చేరింది. అదే సమయంలో, Hyundai (హ్యుందాయ్) కంపెనీ 46,866 యూనిట్లను విక్రయించింది. Hyundai (హ్యుందాయ్) యొక్క మార్కెట్ శాతం 18.1% ఉంది.

ఇక దేశీయ కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ గత నెలలో 28,017 యూనిట్ల కార్లను విక్రయించగలిగింది, కంపెనీ మార్కెట్ వాటా 10.8 శాతానికి చేరుకుంది. ఇతర ప్రధాన కార్ కంపెనీలయిన Mahindra And Mahindra (మహీంద్రా అండ్ మహీంద్రా) 15,886 యూనిట్లు, Toyota (టయోటా) 12,769 యూనిట్లు, Honda (హోండా) 11,177 యూనిట్లు, Renault (రెనాల్ట్) 9,703 యూనిట్లు, MG Motors (ఎంజి మోటార్స్) 3,900 యూనిట్లు, Skoda (స్కోడా) 3,829 యూనిట్లు, Nissan (నిస్సాన్) 3,209 యూనిట్లు, Volkswagen (ఫోక్స్‌వ్యాగన్) 1,631 యూనిట్లు, Ford Motors (ఫోర్డ్ మోటార్స్) 1,508 యూనిట్లు, ఎఫ్‌సిఎ 1,173 యూనిట్లు మరియు సిట్రోయెన్ 50 యూనిట్ల కార్లను విక్రయించాయి.

| Rank | Brand | Aug'21 | Aug'20 | Growth (%) |
| 1 | Maruti Suzuki | 1,03,187 | 1,13,033 | -8.7 |
| 2 | Hyundai | 46,866 | 45,809 | 2.3 |
| 3 | Tata Motors | 28,017 | 18,583 | 50.8 |
| 4 | Kia | 16,750 | 10,853 | 54.3 |
| 5 | Mahindra | 15,786 | 13,407 | 17.7 |
| 6 | Toyota | 12,769 | 5,555 | 129.9 |
| 7 | Honda | 11,177 | 7,509 | 48.8 |
| 8 | Renault | 9,703 | 8,060 | 20.4 |
| 9 | MG | 3,900 | 2,851 | 36.8 |
| 10 | Skoda | 3,829 | 1,003 | 281.8 |
| 11 | Nissan | 3,209 | 810 | 296.2 |
| 12 | Volkswagen | 1,631 | 1,407 | 15.9 |
| 13 | Ford | 1,508 | 4,731 | -68.1 |
| 14 | FCA | 1,173 | 468 | 150.6 |
| 15 | Citroen | 30 | 0 | - |

అమ్మకాల పరంగా నిస్సాన్ మరియు స్కోడా వరుసగా అత్యధికంగా 296.2% మరియు 281.8% వృద్ధిని నమోదు చేశాయి. జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా కూడా అమ్మకాలను వృద్ధి చేసుకోగలిగింది. టయోటా మోటార్స్ యొక్క వార్షిక కార్ల అమ్మకాలు 127% వృద్ధి చెందాయి, ఆగస్టు 2021 లో 12,769 యూనిట్లు అమ్ముడయ్యాయి.

కార్ల మొత్తం అమ్మకాల విషయానికి వస్తే, గత సంవత్సరం ఇదే కాలంలో, ఈ 15 కంపెనీలు మొత్తం 2,34,079 యూనిట్ల ప్యాసింజర్ కార్లను విక్రయించగా, ప్రస్తుతం 2,59,555 యూనిట్ల ప్యాసింజర్ కార్లను విక్రయించి 10.9% వృద్ధిని నమోదు చేసి, మునుపటి సంవత్సరం కంటే కూడా ముందంజలో చేరింది.

అయితే నెలవారీ అమ్మకాలలో జూలై 2021 అమ్మకాలతో పోలిస్తే, ఆగస్టు 2021 అమ్మకాలలో 11.8 శాతం క్షీణత ఉంది. అంటే జూలై 2021 లో 2,943,30 యూనిట్ల ప్యాసింజర్ కార్లు విక్రయించగా, ఆగస్టు 2021 లో 2,59,555 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. కావున మునుపటి నెలకంటే కూడా తక్కువ వృద్ధి నమోదు చేసింది.
Source: Autopunditz


Click it and Unblock the Notifications








