ఇలా చేస్తే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందటం వెరీ సింపుల్

వాహనదారులు వాహనాన్ని నడపడానికి తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. అప్పుడే అధికారికంగా వాహాన్ని డ్రైవ్ చేయడానికి అర్హులు. కావున చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ పొందటం కోసం నానా తంటాలు పడుతుంటారు. ఇప్పుడు ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందటం కోసం కొన్ని రాష్ట్రాలు డిజిటల్ విధానాన్ని అమలు చేసి చాలా సులభతరం చేశాయి.

ఇలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇప్పుడు వెరీ సింపుల్

భారతదేశంలో ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్ పౌరులు ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారు రవాణా శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా https://parivahan.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇప్పుడు వెరీ సింపుల్

ఈ వెబ్‌సైట్ లో దరఖాస్తుదారుడి చిరునామా మరియు గుర్తింపు సమాచారాన్ని నింపిన తరువాత లైసెన్స్ పొందటానికి అర్హులవుతారు. లర్నర్ లైసెన్స్ దరఖాస్తు ప్రక్రియలో ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా కూడా ప్రశ్నలు అడుగుతారు. దరఖాస్తుదారునికి 10 ప్రశ్నలు అడుగుతారు, అందులో 6 ప్రశ్నలకు సమాధానం ఇచ్చినవారికి లర్నర్ లైసెన్స్ ఇవ్వబడుతుంది.

MOST READ:హైదరాబాద్‌లో మళ్ళీ ప్రారంభం కానున్న డబుల్ డెక్కర్ బస్ సర్వీస్..ఎప్పుడంటే?

ఇలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇప్పుడు వెరీ సింపుల్

లెర్నర్ లైసెన్స్ దరఖాస్తుదారునికి ఇ-మెయిల్ ద్వారా పంపబడుతుంది. లర్నర్ కి ఆన్‌లైన్‌లో లైసెన్స్ ఇవ్వడం వల్ల సమయం మరియు డబ్బు ఆదా అవుతుంది. ఈ ప్రక్రియలో ఆన్‌లైన్ చెల్లింపు చేసిన తరువాత, దరఖాస్తుదారు అందుబాటులో ఉన్న స్లాట్ల నుండి టెస్ట్ డేట్ మరియు టైమ్ ఎంచుకోవచ్చు.

ఇలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇప్పుడు వెరీ సింపుల్

ఈ ప్రక్రియ కోసం ఢిల్లీలో నాలుగు కొత్త ఆర్టీఓ కార్యాలయాలు ప్రారంభించబడ్డాయి. ఢిల్లీలో ఇప్పుడు 13 ఆర్టీఓ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో లెర్నర్ లైసెన్స్, ఇంటర్నేషనల్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, రెన్యూవల్ కోసం దరఖాస్తులు స్వీకరించబడతాయి.

MOST READ:ఇలాంటి రోల్స్ రాయిస్ కారును ఎప్పుడైనా చూశారా? ఇది ఏ సెలబ్రిటీదో తెలుసా?

ఇలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇప్పుడు వెరీ సింపుల్

ఇటీవల ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఢిల్లీ ప్రభుత్వం స్విచ్ ఢిల్లీ ప్రచారాన్ని ప్రారంభించింది. దీని కింద ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీని ప్రకటించారు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

ఇలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇప్పుడు వెరీ సింపుల్

ఛార్జింగ్ స్టేషన్లను ఓపెన్ చేయడానికి అనుబంధ కంపెనీలు టెండర్లను పిలిచాయి. ఆగస్టు 2020 నాటికి ఢిల్లీలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అమలు చేయబడింది. ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 6,000 వాహనాలు నమోదు చేయబడ్డాయి. ఈ ఎలక్ట్రిక్ వాహన విధానంలో భాగంగా, ఢిల్లీ ప్రభుత్వం రోడ్డు టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీని అందిస్తుంది.

MOST READ:అరుదైన లగ్జరీ కార్‌లో కనిపించిన బాలీవుడ్ బాద్షా "షారుఖ్ ఖాన్" [వీడియో]

ఇలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇప్పుడు వెరీ సింపుల్

ఈ పథకం కింద 1,000 ఎలక్ట్రిక్ వాహనాలకు కిలోవాట్ కి 10,000 రూపాయల సబ్సిడీని ప్రకటించారు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలపై గరిష్టంగా రూ. 1.50 లక్షల రాయితీ ఇవ్వబడుతుంది. ఈ రాయితీలన్నీ ఎలక్ట్రిక్ వాహన వాడకాన్ని పెంచడానికి మరియు రాజధాని నగరంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి సహాయపడతాయి.

Most Read Articles

English summary
People Of These States Can Apply For Driving License Through Online. Read in Telugu.
Story first published: Monday, February 8, 2021, 19:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X