భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

భారతదేశంలో బిఎస్ 6 ఉద్గార నిబంధనలు అమలు చేసిన తర్వాత పెట్రోల్ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. అంతే కాదు బిఎస్ 6 కాలుష్య చట్టం అమల్లోకి రాకముందే పెట్రోల్ కార్ల అమ్మకాలు దినదినాభివృద్ధి సాగించాయి. 2012 నుండి డీజిల్ కార్ల అమ్మకాలు బాగా తగ్గుముఖం పట్టాయి. 2020 లో విక్రయించిన మొత్తం కార్లలో దాదాపు 83% పెట్రోల్ కార్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

బిఎస్ 6 కాలుష్య చట్టం ఆమోదించిన తరువాత వినియోగదారులు పెట్రోల్ కార్ల కొనుగోలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక వైపు, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు గణనీయంగా పెరిగి దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. బీఎస్ 6 అప్‌డేట్ తర్వాత డీజిల్ కార్లు మరింత ఖరీదైనవిగా మారాయి.

భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

కొత్తగా కార్లను కొనాలనుకునే కస్టమర్లు ఈ కారణంగా పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేయడానికే సుముఖత చూపిస్తున్నారు. 2012 లో డీజిల్ కార్లకు బాగా డిమాండ్ ఉన్నప్పుడు, డీజిల్ అమ్మకాలు దాదాపు 54% పెరిగాయి. ఇదే విధంగా డీజిల్ కార్ల అమ్మకాలు 2013 లో 52%, 2014 లో 48%, 2015 లో 44% మరియు 2016 లో 40% కి పెరిగింది.

MOST READ:మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో

భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

అయితే 2020 ఏప్రిల్ మరియు డిసెంబర్ మధ్య కాలంలో డీజిల్ కార్ల అమ్మకాలు 17%, 2017 లో 39%, 2018 లో 37% మరియు 2019 లో 33% తగ్గాయి. బిఎస్ 6 నిబంధనలకు అప్డేట్ చేయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉన్నందువల్ల మారుతి సుజుకితో సహా చాలా కంపెనీలు డీజిల్ కార్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేసాయి.

భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

దేశీయ మార్కెట్లో మారుతి సుజుకితో పాటు, ఫోక్స్ వ్యాగన్, స్కోడా, డాట్సన్ మరియు నిస్సాన్ పెట్రోల్ కార్లను మాత్రమే విక్రయిస్తున్నాయి. టాటా మోటార్స్ కంపెనీ ఇప్పుడు తన చిన్న డీజిల్ ఇంజిన్ కార్ల అమ్మకాలను కూడా నిలిపివేసింది. కంపెనీ ఎస్‌యూవీ విభాగంలో డీజిల్ ఇంజన్ కార్లను మాత్రమే విక్రయిస్తుంది.

MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

భారత మార్కెట్లో ప్రస్తుతం, ఎస్‌యూవీలు, ఎంయువిలలో అధిక భాగం డీజిల్ ఇంజన్ కార్లకె ఎక్కువ డిమాండ్ ఉంది. మహీంద్రా కంపెనీ తన డీజిల్ ఇంజన్ వాహనాలలో 88% విక్రయించడానికి ఇదే ప్రధాన కారణం. మహీంద్రా కంపెనీతో పాటు, ఫోర్డ్ 62%, జీప్ 60%, టయోటా 53%, ఎంజి మోటార్ 45%, కియా మోటార్స్ 41% డీజిల్ ఇంజన్ వాహనాలను విక్రయించాయి.

భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

హ్యుందాయ్ ఇప్పుడు 24%, టాటా మోటార్స్ 17%, హోండా 13% డీజిల్ ఇంజన్ వాహనాలను విక్రయించినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసాయి. ఇప్పుడు డీజిల్ ధరల పెరుగుదలతో, డీజిల్ కార్ల డిమాండ్ మరింత తగ్గే అవకాశం ఉంది.

MOST READ:కారులో ఆహారపదార్థాలు నిల్వచేస్తే వచ్చే సమస్యలేంటో మీకు తెలుసా.. అయితే ఇది చూడండి

భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

డీజిల్ మాత్రమే కాదు, పెట్రోల్ ధరలు కూడా పెరుగుతున్నాయి మరియు అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు 100 రూపాయలను దాటాయి. ఈ కారణంగా, సిఎన్‌జి, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వంటి ప్రత్యామ్నాయ వాహనాల డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ వాహనాల కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాయితీలు ఇస్తున్నాయి.

Most Read Articles

English summary
Petrol Car Sales Increases After BS 6 Norms. Read in Telugu.
Story first published: Thursday, February 25, 2021, 12:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X