వరుసగా రెండవసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు; ఎన్నికలప్పుడే ఎందుకిలా..?

మనదేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ నాయకులు అనేక జిమ్మిక్కులు చేస్తుంటారు. తాజాగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రకటించడంతో, ప్రభుత్వం ఇప్పుడు ధరలు తగ్గించే పనిలో బిజీగా ఉంది.

వరుసగా రెండవసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు; ఎన్నికలప్పుడే ఎందుకిలా..?

గడచిన సంవత్సరం ఇదే సమయంలో కరోనా నేపథ్యంలో అస్సలు పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు, అదే ఏడాది చివరి నుండి స్లోపాయిజన్ మాదిరిగా నిత్యం పెరుగుతూనే వచ్చాయి. ఈ ధరలు ఎంతలా పెరిగాయంటే ఒక్క ఏడాది కాలంలో లీటరు పెట్రోల్‌పై రూ.21.58 మరియు లీటరు డీజిల్‌పై 19.18 మేర పెరిగాయి.

వరుసగా రెండవసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు; ఎన్నికలప్పుడే ఎందుకిలా..?

పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కేవలం వాహనదారులపై మాత్రమే కాకుండా, మిగిలిన అన్ని వర్గాల ప్రజలపై కూడా అదనపు భారాన్ని మోపుతున్నాయి. పెరిగిన ఇంధన ధరల కారణంగా సరుకు రవాణా ఖర్చులు పెరగాయి. ఫలితంగా, నిత్యావసరాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.

MOST READ:క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

వరుసగా రెండవసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు; ఎన్నికలప్పుడే ఎందుకిలా..?

దేశంలో చముర ధరలపై ప్రభుత్వ నియంత్రణలు ఎత్తివేయటంతో దేశీయ చమురు కంపెనీలు ఇష్టారాజ్యంగా ఇంధన ధరలను పెంచేశాయి. అయితే, తాజాగా ఈ ఏడాది వరుసగా రెండవ సారి పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

వరుసగా రెండవసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు; ఎన్నికలప్పుడే ఎందుకిలా..?

అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది వరుసగా రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారు. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఒఎమ్‌సి) గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై వరుసగా 21 పైసలు, 20 పైసలు చొప్పున తగ్గించాయి.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

వరుసగా రెండవసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు; ఎన్నికలప్పుడే ఎందుకిలా..?

తాజా తగ్గింపు తర్వాత ఐఓసి డేటా ప్రకారం, ఢిల్లీలో ఒక లీటరు పెట్రోల్ ధర రూ.90.99 నుండి రూ.90.78 కి తగ్గింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరను గమనిస్తే, కోల్‌కతాలో రూ.90.98, ముంబైలో రూ.97.19, చెన్నైలో రూ.92.770, బెంగళూరులో రూ.93.28, జైపూర్‌లో రూ.97.31 మరియు హైదరాబాద్‌లో రూ.94.39గా ఉన్నాయి.

వరుసగా రెండవసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు; ఎన్నికలప్పుడే ఎందుకిలా..?

అలాగే, డీజిల్ ధరలను గమనిస్తే, ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.81.30 నుండి రూ.81.10 కి తగ్గింది. కోల్‌కతాలో రూ.83.98, ముంబైలో రూ.88.20, చెన్నై రూ.86.10, జైపూర్‌లో రూ.89.60, బెంగళూరులో రూ.85.99 మరియు హైదరాబాద్‌లో రూ.88.45గా ఉన్నాయి.

MOST READ:సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]

వరుసగా రెండవసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు; ఎన్నికలప్పుడే ఎందుకిలా..?

ఇటీవల పెరిగిన ధరలతో పోలిస్తే తాజాగా తగ్గిన ధరలు అత్యల్పమే అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గిన తరువాత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కూడా దేశీయ మార్కెట్లో రేట్లు తగ్గించడం ఓ సానుకూల పరిణామంగా చెప్పుకోవచ్చు.

వరుసగా రెండవసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు; ఎన్నికలప్పుడే ఎందుకిలా..?

రానున్న రోజుల్లో మరింత ధరల తగ్గుదలను ఇది సూచిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలే ఇంధన ధరల తగ్గింపు వెనుక ఉన్న ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

Most Read Articles

English summary
Petrol, Diesel Prices Slashed For The 2nd Time This Year, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X