భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

భారతదేశంలో వాహనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వాహనాలు పెరుగుతున్న కారణంగా వాటికి ఇంధన డిమాండ్ కూడా బాగా పెరిగింది. కావున ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం మనం గమనించి ఉంటాము. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

పెట్రోల్ ధర మునుపటి కంటే గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పుడు పెట్రోల్ పై 25 పైసల పెరుగుదల కారణంగా 2021 జనవరి 18 న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 84.95 కు చేరుకుంది. ఇది నిజంగా రికార్డ్ ధర అనే చెప్పాలి. ఇంతలకు ముందు లీటర్ పెట్రోల్ ధర రూ. 84.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

కరోనా లాక్ డౌన్ తరువాత ప్రతిరోజూ పెరుగుతున్న ఇంధన ధరలను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రభుత్వ నిబంధనల తర్వాత దాదాపు ఒక నెల వరకు ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. కాని ఇప్పుడు మళ్ళీ ఇంధన ధరలు ప్రతిరోజూ పెరుగుదల దారి పట్టాయి. ఈ పెరుగుదల సామాన్యుడికి నిజంగా పెనుభారమనే చెప్పాలి.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

భారత రాజధాని నగరం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 84.95 కు కాగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 91.56 కు చేరుకుంది. ఇది దేశంలోనే అత్యంత గరిష్ట ధర. ధరల పెరుగుదల ప్రస్తుతం ఒక్క పెట్రోల్ కి మాత్రమే కాదు డీజిల్ కి కూడా వర్తిస్తుంది. కావున డీజిల్ ధరలు కూడా పెరిగాయి.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

ఢిల్లీలో లీటరు డీజిల్ ధర ఇప్పుడు రూ. 71.13, ముంబైలో రూ. 81.87 కు చేరుకుంది. అంతకుముందు జనవరి 7 న పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా 23 పైసలు, 26 పైసలు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. చమురు కంపెనీలు జనవరి 6 నుండి ప్రతిరోజూ పెంచడం ప్రారంభించాయి.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

2018 అక్టోబర్ 4 న ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 84 రూపాయలు. అదే రోజు లీటరు డీజిల్ ధర 75.45 రూపాయలు. ఈ ధరలు అమాంతం 2020 చివరి నాటికి పెరగడం ప్రారంభించాయి, అప్పటి నుంచి చాపకింద నీరులా పెరుగుతూనేపోతుంది.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

ఇక బెంగళూరు యొక్క ఇంధన ధరల విషయానికి వస్తే 2021 జనవరి 18 న లీటర్ పెట్రోల్ ధర 87.82 రూపాయలు కాగా, లీటర్ డీజిల్ ధర 79.67 రూపాయలు. అదేవిధంగా చెన్నైలో లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా రూ .87.63, రూ .80.40 కు చేరాయి.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

కరోనా మహమ్మారి కారణంగా చమురు కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్ ధరల సవరణను నిలిపివేసాయి. ప్రధాన చమురు కంపెనీలైన భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం రోజువారీ ఇంధన ధరల సవరణ అంతర్జాతీయ ధర మరియు విదేశీ మారకపు రేటుపై ఆధారపడి ఉంటుంది.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉదయం 6 గంటల నుండి చమురు ధరలలో మార్పులను అమలు చేస్తుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడానికి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నారు. కావున ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించడం కోసం దేశంలోని మొత్తం 69,000 పెట్రోల్ పంపుల వద్ద ఛార్జింగ్ స్టేషన్ నిర్మించే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఏది ఏమైనా రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఎక్కువవుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 18, 2021, 14:35 [IST]
English summary
Petrol Price Touches Record High In Delhi At Rs. 84.95/Litre. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+