ధర అధికంగా ఉన్నా పెట్రోల్ కార్లకే ఎక్కువ డిమాండ్; భారీగా తగ్గిన డీజిల్ కార్లు

భారతదేశంలో బిఎస్6 ఉద్గార నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, దేశంలో డీజిల్ కార్లకు డిమాండ్ భారీగా పడిపోయింది. అదే సమయంలో పెట్రోల్ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ కార్ల వాటా 83 శాతం ఉంది.

ధర అధికంగా ఉన్నా పెట్రోల్ కార్లకే ఎక్కువ డిమాండ్; భారీగా తగ్గిన డీజిల్ కార్లు

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, ఇప్పుడు కేవలం పెట్రోల్ కార్లను మాత్రమే విక్రయిస్తోంది. గత నెలలో ఈ కంపెనీ ఒక్క డీజిల్ మోడల్‌ను విక్రయించలేదు. గత నెలలో మహీంద్రా అత్యధికంగా డీజిల్ కార్లను విక్రయించింది. ఆ తర్వాతి స్థానాల్లో హ్యుందాయ్, టొయోటా, కియా మరియు టాటా కంపెనీలు ఉన్నాయి.

ధర అధికంగా ఉన్నా పెట్రోల్ కార్లకే ఎక్కువ డిమాండ్; భారీగా తగ్గిన డీజిల్ కార్లు

మారుతి సుజుకి గత నెలలో 1.44 లక్షల పెట్రోల్ కార్లను విక్రయించింది, ఈ సమయంలో కంపెనీ డీజిల్ కార్ల అమ్మకాలు సున్నాగా ఉన్నాయి. మారుతి ప్రస్తుతం కేవలం పెట్రోల్ కార్లను మాత్రమే విక్రయిస్తోంది. అయితే, రానున్న రోజుల్లో కంపెనీ తమ పెద్ద మోడళ్లలో డీజిల్ ఇంజన్లను ప్రవేశపెట్టవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

MOST READ:ఒక ఏడాదిలో టోల్ బూత్‌లన్నీ మాయం; జిపిఎస్ ఆధారంగా టోల్ వసూలు!

ధర అధికంగా ఉన్నా పెట్రోల్ కార్లకే ఎక్కువ డిమాండ్; భారీగా తగ్గిన డీజిల్ కార్లు

హ్యుందాయ్ గత నెలలో 39,956 యూనిట్ల పెట్రోల్ మోడళ్లను విక్రయించగా, 11,634 యూనిట్ల డీజిల్ కార్లను విక్రయించింది. హ్యుందాయ్ మొత్తం అమ్మకాలలో పెట్రోల్ కార్ల అమ్మకాలు 77 శాతం ఉండగా, డీజిల్ కార్ల అమ్మకాలు 23 శాతం ఉన్నాయి. హ్యుందాయ్ ఇప్పటికీ తమ చిన్న కార్లలో కూడా డీజిల్ ఇంజన్లను విక్రయిస్తుంది.

Rank Brand Petrol Diesel Petrol % Diesel %
1 Maruti Suzuki 1,44,761 0 100.0 0.0
2 Hyundai 39,956 11,634 77.4 22.6
3 Tata 20,810 5,922 77.8 22.2
4 Kia 9,755 6,947 58.4 41.6
5 Mahindra 1,935 13,445 12.6 87.4
6 Toyota 6,104 7,950 43.4 56.6
7 Renault 11,043 0 100.0 0.0
8 Honda 8,097 1,227 86.8 13.2
9 Ford 2,958 2,817 51.2 48.8
10 MG 2,887 1,238 70.0 30.0
11 Nissan 4,244 0 100.0 0.0
12 Volkswagen 2,186 0 100.0 0.0
13 FCA 557 546 50.5 49.5
14 Skoda 853 0 100.0 0.0
ధర అధికంగా ఉన్నా పెట్రోల్ కార్లకే ఎక్కువ డిమాండ్; భారీగా తగ్గిన డీజిల్ కార్లు

టాటా మోటార్స్ గడచిన నెలలో 20,810 యూనిట్ల పెట్రోల్ కార్లను విక్రయించగా, 5922 యూనిట్ల డీజిల్ కార్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ మొత్తం పెట్రోల్ కార్ల అమ్మకాలు 77 శాతం ఉండగా, డీజిల్ కార్ల అమ్మకాలు 23 శాతం ఉన్నాయి. ప్రస్తుతం, కంపెనీ తమ పెద్ద మోడళ్ల మాత్రమే డీజిల్ ఇంజన్లను విక్రయిస్తోంది, చిన్న మోడళ్లలో డీజిల్ ఎంపిక ఇవ్వబడలేదు.

MOST READ:కేవలం 39,999 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

ధర అధికంగా ఉన్నా పెట్రోల్ కార్లకే ఎక్కువ డిమాండ్; భారీగా తగ్గిన డీజిల్ కార్లు

కియా మోటార్స్ గత నెలలో 9755 యూనిట్ల పెట్రోల్ కార్లను విక్రయించగా, 6947 యూనిట్ల డీజిల్ కార్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ మొత్తం పెట్రోల్ కార్ల అమ్మకాలు 59 శాతం ఉండగా, డీజిల్ కార్ల అమ్మకాలు 41 శాతం ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మూడు మోడళ్లను మాత్రమే విక్రయిస్తుంది మరియు అన్నింటిలో డీజిల్ ఆప్షన్లు ఉన్నాయి.

ధర అధికంగా ఉన్నా పెట్రోల్ కార్లకే ఎక్కువ డిమాండ్; భారీగా తగ్గిన డీజిల్ కార్లు

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా గత నెలలో 1935 యూనిట్ల పెట్రోల్ కార్లను విక్రయించగా, 13,445 యూనిట్ల డీజిల్ కార్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ పెట్రోల్ కార్ల అమ్మకాలు 12 శాతం ఉంటే, డీజిల్ కార్ల అమ్మకాలు 88 శాతంగా ఉన్నాయి. మహీంద్రా విక్రయిస్తున్న దాదాపు అన్ని మోడళ్లలో డీజిల్ కార్లు అందుబాటులో ఉన్నాయి.

MOST READ:బాబూ నీ తెలివికి జోహార్లు: మద్యం అక్రమ రవాణాపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

ధర అధికంగా ఉన్నా పెట్రోల్ కార్లకే ఎక్కువ డిమాండ్; భారీగా తగ్గిన డీజిల్ కార్లు

ఆ తర్వాతి స్థానంలో టొయోటా ఉంది. ఈ సమయంలో టొయోటా 6104 పెట్రోల్ కార్లను విక్రయించగా, 7950 యూనిట్ల డీజిల్ కార్లను విక్రయించింది. ఈ జాబితాలో ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో 7వ స్థానంలో ఉంది, గత నెలలో రెనో 11,043 పెట్రోల్ కార్లను విక్రయించింది. రెనో ప్రస్తుతం కేవలం పెట్రోల్ కార్లను మాత్రమే విక్రయిస్తోంది.

ధర అధికంగా ఉన్నా పెట్రోల్ కార్లకే ఎక్కువ డిమాండ్; భారీగా తగ్గిన డీజిల్ కార్లు

హోండా కార్స్ ఇండియా గత నెలలో 8097 యూనిట్ల పెట్రోల్ కార్లను విక్రయించగా, 1227 యూనిట్ల డీజిల్ కార్లను విక్రయించింది. ఫోర్డ్ గత నెలలో 2958 యూనిట్ల పెట్రోల్ కార్లను విక్రయించగా, 2817 యూనిట్ల డీజిల్ కార్లను విక్రయించింది. ఫోర్డ్ పెట్రోల్ కార్ల అమ్మకాలు 51 శాతం ఉండగా, డీజిల్ కార్ల అమ్మకాలు 49 శాతం ఉన్నాయి.

MOST READ:హైదరాబాద్‌ నగరంలో 40 మందికి పైగా వాహనదారులు అరెస్ట్.. కారణం ఇదే

ధర అధికంగా ఉన్నా పెట్రోల్ కార్లకే ఎక్కువ డిమాండ్; భారీగా తగ్గిన డీజిల్ కార్లు

నిస్సాన్ మరియు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలు సున్నా డీజిల్ కార్లను విక్రయించారు. ఈ రెండు కంపెనీలు వరుసగా 4244 మరియు 2186 యూనిట్ల పెట్రోల్ కార్లను విక్రయించాయి. గత నెలలో స్కొడా కూడా ఎలాంటి డీజిల్ కార్లను విక్రయించలేదు. ఈ సమయంలో కంపెనీ 853 యూనిట్ల పెట్రోల్ కార్లను విక్రయించింది.

Most Read Articles

English summary
Petrol Vs Diesel Cars Sales In February 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X