గంటకు 350 కిమీ టాప్ స్పీడ్‌తో వెళ్లే ఎలక్ట్రిక్ హైపర్‌కార్, ఇది మహీంద్రా గ్రూపుకి చెందినదే!

ఇటాలియన్ సూపర్ కార్ బ్రాండ్ పినిన్‌ఫరీనా ఓ అధునాతన ఎలక్ట్రిక్ హైపర్ కారుని ఆవిష్కరించింది. 'పినిన్‌ఫరీనా బాటిస్టా' అనే పేరుతో తయారు చేసిన ఈ కారు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే ఎలక్ట్రిక్ కారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ లిమిటెడ్ ఎడిషన్ కారును 150 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయనున్నారు.

గంటకు 350 కిమీ టాప్ స్పీడ్‌తో వెళ్లే ఎలక్ట్రిక్ హైపర్‌కార్, ఇది మహీంద్రా గ్రూపుకి చెందినదే!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఈ ఇటాలియన్ బ్రాండ్ మన దేశీయ బ్రాండ్ అయిన మహీంద్రా యాజమాన్యంలో ఉంది. పినిన్‌ఫరీనా బ్రాండ్ మహీంద్రా యాజమాన్యంలో ఉన్నప్పటికీ, కొత్త యజమానులు సదరు ఇటాలియన్ బ్రాండ్ యొక్క వారసత్వాన్ని స్పష్టంగా గౌరవించారు మరియు దాని వ్యవస్థాపకుడు బాటిస్టా పినిన్‌ఫరీనా పేరు మీదనే ఈ మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైపర్‌కారును రూపొందించారు.

గంటకు 350 కిమీ టాప్ స్పీడ్‌తో వెళ్లే ఎలక్ట్రిక్ హైపర్‌కార్, ఇది మహీంద్రా గ్రూపుకి చెందినదే!

పినిన్‌ఫరీనా బాటిస్టా హైపర్ కారును ప్రపంచ వ్యాప్తంగా కేవలం 150 మోడళ్లను మాత్రమే విక్రయించనున్నారు. ఈ హైపర్ కారులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్టంగా 1900 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ పవర్‌ట్రైన్‌ను క్రొయేషియన్ ఈవీ తయారీదారైన రిమాక్ ఆటోమొబిలి నుండి సేకరించారు.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

గంటకు 350 కిమీ టాప్ స్పీడ్‌తో వెళ్లే ఎలక్ట్రిక్ హైపర్‌కార్, ఇది మహీంద్రా గ్రూపుకి చెందినదే!

రిమాక్ ఆటోమొబిలికితో పినిన్‌ఫరీనా సహకారం కేవలం ఈ ఎలక్ట్రిక్ మోటార్‌తోనే ముగియదు. ఈ క్రొయేషియన్ కంపెనీ నిర్మించిన 'రిమాక్ సి టూ' అనే ఎలక్ట్రిక్ హైపర్‌కార్ యొక్క ప్రొడక్షన్ లైన్ మరియు ప్లాట్‌ఫామ్‌ను కూడా ఈ పినిన్‌ఫరీనా బాటిస్టా పంచుకుంటుంది.

గంటకు 350 కిమీ టాప్ స్పీడ్‌తో వెళ్లే ఎలక్ట్రిక్ హైపర్‌కార్, ఇది మహీంద్రా గ్రూపుకి చెందినదే!

పినిన్‌ఫరీనా బాటిస్టా ఎలక్ట్రిక్ కారులో ప్రతి యాక్సిల్‌లో రెండేసి మోటార్ల చొప్పున మొత్తం నాలుగు మోటార్లు ఉంటాయి. ఈ నాలుగు మోటార్లు కారులో అమర్చిన 120 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తాయి. రిమాక్ సి టూ మాదిరిగానే ఇది కూడా ఒకేరకమైన పవర్‌ట్రెయిన్‌ను మరియు పెర్ఫార్మెన్స్ గణాంకాలను కలిగి ఉంటుంది.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

గంటకు 350 కిమీ టాప్ స్పీడ్‌తో వెళ్లే ఎలక్ట్రిక్ హైపర్‌కార్, ఇది మహీంద్రా గ్రూపుకి చెందినదే!

పినిన్‌ఫరీనా బాటిస్టా కేవలం 1.9 సెకన్లలోనే గంటకు గరిష్టంగా 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు ఈ కారు గరిష్ట వేగం 350 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ ఇటాలియన్ ఎలక్ట్రిక్ హైపర్‌కార్ పూర్తి ఛార్జీపై గరిష్టంగా 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.

గంటకు 350 కిమీ టాప్ స్పీడ్‌తో వెళ్లే ఎలక్ట్రిక్ హైపర్‌కార్, ఇది మహీంద్రా గ్రూపుకి చెందినదే!

ఈ కారును మోనోకాక్ ఛాస్సిస్‌పై నిర్మించారు మరియు దీని తయారీలో ఎక్కువ భాగం కార్బన్ ఫైబర్ పదార్థాలను ఉపయోగించారు. అయినప్పటికీ, ఇది ఎలక్ట్రిక్ వెర్షన్ కావటంతో బ్యాటరీల కారణంగా ఈ కారు మొత్తం బరువు కూడా భారీగానే ఉంటుంది. ఇది దాదాపు 1.95 టన్నుల బరువును కలిగి ఉంటుంది.

MOST READ:ప్రజల కోసం తన కారును అంబులెన్సుగా మార్చిన కాంగ్రెస్ నాయకుడు, ఎవరో తెలుసా?

గంటకు 350 కిమీ టాప్ స్పీడ్‌తో వెళ్లే ఎలక్ట్రిక్ హైపర్‌కార్, ఇది మహీంద్రా గ్రూపుకి చెందినదే!

బాటిస్టా ఎలక్ట్రిక్ హైపర్ కారులోని నాలుగు చక్రాలలో 6-పాట్ బ్రేక్ కాలిపర్‌లతో కూడిన 390 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇందులో రెండు టైర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. వీటిలో మొదటిది పిరెల్లి పి జీరో కోర్సా టైర్లు, ఇవి రెగ్యులర్ వాడకానికి అనువుగా ఉంటాయి. అయితే, మరింత స్పోర్టీ టైర్లు కావాలనుకునే వారి కోసం మిష్లిన్ పైలట్ స్పోర్ట్ కప్ 2 ఆర్ ట్రాక్ టైర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

గంటకు 350 కిమీ టాప్ స్పీడ్‌తో వెళ్లే ఎలక్ట్రిక్ హైపర్‌కార్, ఇది మహీంద్రా గ్రూపుకి చెందినదే!

ఈ కారు యొక్క రేస్ ట్రాక్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, దీనిని ఫార్ములా 1 మరియు ఫార్ములా ఈ డ్రైవర్ నిక్ హీడ్‌ఫెల్డ్ సహాయంతో ఫైన్-ట్యూనింగ్ చేశారు. పినిన్‌ఫరీనా బాటిస్టా ఒక పర్యావరణ అనుకూలమైన ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ కారు. ఈ బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ హైపర్‌కార్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది.

MOST READ:పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

Most Read Articles

English summary
Pininfarina's First All-electric Hypercar Battista To Be Launched Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X