నేడు వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

భారత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన జనరల్ బడ్జెట్‌లో వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. ఈ పాలసీ ప్రకారం, 20 ఏళ్లు పైబడిన ప్రైవేట్ వాహనాలను మరియు 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాల పాత వాహనాలుగా పరిగణించి, వాటిని స్క్రాప్ చేయాల్సిందిగా సూచించారు.

నేడు వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

పైన పేర్కొన్నట్లుగా నిర్ధిష్ట వయస్సు దాటిన తర్వాత సదరు వాహన యజమానులు ఆయా వాహనాలను ఉపయోగించాలని చూస్తే, వాటిపై భారీ రోడ్ టాక్సులు, గ్రీన్ టాక్సులు మరియు తరచూ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఈ కొత్త వాహన స్క్రాపేజ్ విధానాన్ని వివిధ రాష్ట్రాలలో ప్రారంభించబోతోంది.

నేడు వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న సమాచారం ప్రకారం, భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ఆయన ఇవాళ (శుక్రవారం) ప్రారంభించబోతున్నారు. గుజరాత్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ఈ పాలసీని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో యువత మరియు స్టార్టప్‌లు పాల్గొనమని ఆయన అభ్యర్థించారు.

నేడు వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

వెహికల్ స్క్రాపేజ్ పాలసీకి సంబంధించి పర్యావరణ అనుకూలమైన రీతిలో, కాలుష్యం ఎక్కువ కలిగించే వాహనాలను దశలవారీగా తొలగించాలని ప్రధాని మోదీ సూచించారు. ఇందుకు కొత్త వాహన స్క్రాపింగ్ విధానం సహాయపడుతుందని ఆయన అన్నారు. ఆచరణీయమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడమే భారత ప్రభుత్వ లక్ష్యం అని ప్రధాని మోదీ చెప్పారు.

నేడు వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

"ఈ రోజు వాహన స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించడం భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన విజయం." అని ప్రధానమంత్రి నరేంద్ర తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. గుజరాత్‌లో వెహికల్ స్క్రాపింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం ఇన్వెస్టర్ సమ్మిట్ సరికొత్త అవకాశాలను తీసుకువస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

నేడు వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

పర్యావరణ బాధ్యత వహించడం అనేది వాటాదారులందరికీ విలువను తీసుకురావాలని, యువత మరియు స్టార్టప్‌లు ఈ కార్యక్రమంలో చేరాలని తాను అభ్యర్థిస్తున్నానని అన్నారు. మరోవైపు, వెహికల్ స్క్రాపేజ్ విధానం మెటల్ రీసైక్లింగ్ వ్యాపారానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి.

నేడు వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఈ స్క్రాపేజ్ విధానం భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో పెను మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉందని, ఇది కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం, కాలుష్యాన్ని తగ్గించడం లేదా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను వేగవంతం చేయడం చేస్తుంది. ఈ విధానం ఆటో పరిశ్రమ మరియు ఇతర వాటాదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

నేడు వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

సాధారణ బడ్జెట్‌లో ఈ పాలసీని ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త వాహన స్క్రాపేజ్ పాలసీ కింద, ప్రైవేట్ వాహనాల జీవితకాలాన్ని 20 సంవత్సరాలు మరియు వాణిజ్య వాహనాల జీవితకాలాన్ని 15 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ జీవితకాలం ముగిసిన తరువాత, సదరు వాహనాలకు తరచూ ఫిట్‌నెస్ పరీక్షలు జరుగుతాయని వివరించారు.

నేడు వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

అంతేకాకుండా, ఈ వెహికల్ స్క్రాపేజ్ విధానం వలన పాత కార్ల వినియోగం తగ్గి కొత్త కార్ల అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా, ఇది భారతీయ ఆటో రంగానికి మరిన్ని అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. కాగా, ఇప్పటికే 15 ఏళ్లు నిండిన పురాతన ప్రభుత్వ వాహనాల కోసం స్క్రాపింగ్ విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది.

నేడు వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

పర్యావరణానికి మరియు ప్రజలు హాని కలిగించే పాత వాహనాలను రోడ్లపై తిరగకుండా చేసేందుకు తద్వారా రహదారుల భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని పరిచయం చేసింది. పాత వాహనాలను స్క్రాప్ చేసే వాహన యజమానులకు ఇటు ప్రభుత్వం మరియు అటు ఆటోమొబైల్ కంపెనీలు కూడా పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

నేడు వెహికల్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

పాత వాహన యజమానులు తమ వాహనాన్ని స్క్రాప్ చేయటానికి సిద్ధమైనట్లయితే, వారు కొత్తగా కొనుగోలు చేయబోయే వాహనంపై 4 నుండి 6 శాతం వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా, ఇలా పాత వాహనాలను స్క్రాప్ చేసిన కస్టమర్లకు, తమ కొత్త వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం 25 శాతం వరకు రోడ్డు పన్నులో మినహాయింపు ఇవ్వనుంది.

వెహికల్ స్క్రాప్ వల్ల భారతదేశంలోని పాత వాహనాల సంఖ్య తగ్గుతుంది. అంతే కాకుండా కొత్త వాహనాల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం కేద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ప్రోత్సహిస్తోంది. డీఐ కోసం ఏక రాయితీలు కూడా కల్పిస్తోంది. ఇప్పుడు కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికీ చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇప్పుడు కొనుగోలు దారులకు వెహికల్ స్క్రాప్ కూడా ధరలు తగ్గించుకోవడానికి ఒక రకంగా ఉపయోగపడుతుంది.

Most Read Articles

English summary
Pm modi to launch vehicle scrappage policy in india today in gujarat details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X