బాలెనో, ఆల్ట్రోజ్, ఐ20, గ్లాంజా.. మార్కెట్లో బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఏది..?

భారత మార్కెట్లో ఇప్పుడు అనేక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లతో పోల్చినప్పుడు, ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు మరిన్ని ఎక్కువ కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్లను మరియు ప్రీమియం ఇంటీరియర్ ను కలిగి ఉంటాయి. ఈ విభాగంలో లభిస్తున్న మోడళ్లలో మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్, టొయోటా గ్లాంజా, ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి పలు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.

బాలెనో, ఆల్ట్రోజ్, ఐ20, గ్లాంజా.. మార్కెట్లో బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఏది..?

మరి వీటిలో ఏది బెస్ట్ గా అమ్ముడవుతుందో తెలుసుకుందాం రండి. గడచిన నెలలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ అమ్మకాల వివరాలు వెల్లడయ్యాయి. ఈ విభాగంలో మారుతి సుజుకి తమ నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న బాలెనో హ్యాచ్‌బ్యాక్ మొదటి స్థానంలో ఉంది. కాగా, ఆ తర్వాతి స్థానాల్లో టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20 తదితర మోడళ్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే, సెప్టెంబర్ 2021లో ఈ విభాగం అమ్మకాలు 46 శాతం క్షీణతను నమోదు చేశాయి.

బాలెనో, ఆల్ట్రోజ్, ఐ20, గ్లాంజా.. మార్కెట్లో బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఏది..?

1. మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)

గత నెలలో (సెప్టెంబర్ 2021 లో) మొత్తం 8,077 మారుతి సుజుకి బాలెనో కార్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే సమయంలో (సెప్టెంబర్ 2020 లో) మారుతి సుజుకి మొత్తం 19,433 యూనిట్ల బాలెనో కార్లను విక్రయించింది. ఈ సమయంలో బాలెనో అమ్మకాలు 58 శాతం క్షీణతను నమోదు చేశాయి. మారుతి బాలెనో మార్కెట్లోకి వచ్చినప్పడి నుండి ఈ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతోంది. గత నెలలో మారుతి సుజుకి తమ కార్ల ఉత్పత్తిలో ఎదుర్కొన్న అంతరాయం కారణంగా, ఈ మోడల్ అమ్మకాలు తగ్గాయని భావిస్తున్నారు.

బాలెనో, ఆల్ట్రోజ్, ఐ20, గ్లాంజా.. మార్కెట్లో బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఏది..?

2. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)

ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది టాటా మోటార్స్ విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్. గడచిన సెప్టెంబర్ 2021 లో టాటా మోటార్స్ మొత్తం 5,772 యూనిట్ల ఆల్ట్రోజ్ కార్లను విక్రయించింది. కాగా, సెప్టెంబర్ 2020 లో, ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు 5,952 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు స్వల్పంగా 3 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఈ విభాగంలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ తో లభిస్తున్న ఏకైక కారు టాటా ఆల్ట్రోజ్ కావటం విశేషం.

బాలెనో, ఆల్ట్రోజ్, ఐ20, గ్లాంజా.. మార్కెట్లో బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఏది..?

3. హ్యుందాయ్ ఐ20 (Hyundai i20)

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్, చాలా కాలంగా ఈ విభాగంలో విక్రయిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20, ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు భారీగా 48 శాతం క్షీణించాయి. సెప్టెంబర్ 2021 లో హ్యుందాయ్ మొత్తం 5,153 యూనిట్లు ఐ20 కార్లను విక్రయించగా, సెప్టెంబర్ 2020 లో 9852 యూనిట్లను విక్రయించింది. ఈ మోడల్‌కి డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ, కంపెనీ వాహనాల ఉత్పత్తిని తగ్గించిన కారణంగా అమ్మకాలు కూడా తగ్గినట్లు తెలుస్తోంది.

బాలెనో, ఆల్ట్రోజ్, ఐ20, గ్లాంజా.. మార్కెట్లో బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఏది..?

4. టొయోటా గ్లాంజా (Toyota Glanza)

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా, గత నెలలో (సెప్టెంబర్ 2021 లో) 1,764 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, ఈ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ మోడల్ విషయంలో టొయోటా సగటున, ప్రతినెలా 2000-2500 యూనిట్లను విక్రయిస్తుంది. కాగా, గతేడాది ఇదే సమయంలో (సెప్టెంబర్ 2020 లో) టొయోటా గ్లాంజా అమ్మకాలు 2,572 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో అమ్మకాలు 31 శాతం క్షీణించాయి.

బాలెనో, ఆల్ట్రోజ్, ఐ20, గ్లాంజా.. మార్కెట్లో బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఏది..?

5. ఫోక్స్‌వ్యాగన్ పోలో (Volkswagen Polo)

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఫోక్స్‌వ్యాగన్ పోలో, గత నెలలో భారీగా క్షీణించాయి. సెప్టెంబర్ 2021 లో కేవలం 799 యూనిట్ల పోలో కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కాగా, సెప్టెంబర్ 2020 లో ఇవి 2,572 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో ఫోక్స్‌వ్యాగన్ పోలో కార్ల అమ్మకాలు 50 శాతం క్షీణించాయి. ఫోక్స్‌వ్యాగన్ పోలో కంపెనీ నుండి అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి.

బాలెనో, ఆల్ట్రోజ్, ఐ20, గ్లాంజా.. మార్కెట్లో బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఏది..?

6. హోండా జాజ్ (Honda Jazz)

జపనీస్ కార్ బ్రాండ్ హోండా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హోండా జాజ్. ఈ సెగ్మెంట్లోని ఇతర మోడళ్లతో పోల్చుకుంటే, హోండా జాజ్ అమ్మకాలు అతి తక్కువగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 2021 నెలలో హోండా మొత్తం 667 యూనిట్ల జాజ్ కార్లను విక్రయించి, ఈ జాబితాలో చివరి (ఆరవ) స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 2020 లో ఈ మోడల్ అమ్మకాలు 748 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో జాజ్ అమ్మకాలు 11 శాతం క్షీణతను నమోదు చేశాయి.

బాలెనో, ఆల్ట్రోజ్, ఐ20, గ్లాంజా.. మార్కెట్లో బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఏది..?

మొత్తంగా చూసుకుంటే, సెప్టెంబర్ 2021లో 22,232 యూనిట్ల ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే, ఈ విభాగపు అమ్మకాలు 46 శాతం క్షీణించాయి. గత నెలలో అన్ని వాహన విభాగాల్లోనూ అమ్మకాలు క్షీణించాయి. సెప్టెంబర్ 2020 నెలతో పోలిస్తే సెప్టెంబర్ 2021 నెలలో దేశంలోని మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 41 శాతం తగ్గాయి.

బాలెనో, ఆల్ట్రోజ్, ఐ20, గ్లాంజా.. మార్కెట్లో బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఏది..?

సియామ్ పేర్కొన్న సమాచారం ప్రకారం, వాహనాల అమ్మకాలలో ఈ క్షీణతకు అతిపెద్ద కారణం సెమీకండక్టర్ చిప్స్ కొరత అని తెలుస్తోంది. ఈ కొరత ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, భారతదేశంలోని కార్ల తయారీదారులను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత కారణంగా, గడచిన సెప్టెంబర్ 2021 నెలలో దాదాపు అన్ని కార్ కంపెనీలు ఉత్పత్తి కోతను ఎదుర్కున్నాయి. అక్టోబర్ నెలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. మరి ఈ నెలలో అమ్మకాలు ఎలా ఉంటాయో చూడాలి.

Most Read Articles

English summary
Premium hatchback sales in september 2021 baleno altroz i20 glanza and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X