ఇంటికి చేరాల్సిన కొత్త Tata Punch రిపేర్ షాప్‌కి వెళ్ళింది.. ఎందుకో తెలుసా?

టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్లో విడుదల చేసిన మైక్రో SUV టాటా పంచ్ (Tata Punch). ఈ SUV భారతీయ విఫణిలో విదుడయినప్పటినుంచి అమితమైన ఆధరణ పొందుతోంది. ఈ SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ కారు యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించింది, అంతే కాకుండా డెలివరీలను కూడా స్టార్ట్ చేసింది.

ఇంటికి చేరాల్సిన కొత్త Tata Punch రిపేర్ షాప్‌కి వెళ్ళింది.. ఎందుకో తెలుసా?

టాటా మోటార్స్ తన టాటా పంచ్ డెలివరీలను చాలా వేగంగా చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో టాటా పంచ్ డెలివరీ సమయంలో ఒక చిన్న ప్రమాదానికి గురైంది. డెలివరీ పొందిన తరువాత ఇంటికి తీసుకెళ్లాల్సిన కారు నేరుగా వర్క్‌షాప్‌కి తీసుకెళ్లాసిన పరిస్థితి ఏర్పడింది.

ఇంటికి చేరాల్సిన కొత్త Tata Punch రిపేర్ షాప్‌కి వెళ్ళింది.. ఎందుకో తెలుసా?

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ సంఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీ ద్వారా రికార్డ్ చేయబడింది. ఇందులో ఓ వ్యక్తి కొత్త కారు నడపడం మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు శ్రద్దగా గమనిస్తే, కారు డ్రైవ్ చేసేవ్యక్తికి కార్ డ్రైవింగ్ లో పెద్దగా అనుభవం లేదని తెలుస్తుంది. ఈ కారణంగానే ప్రమాదం జరిగింది.

ఇంటికి చేరాల్సిన కొత్త Tata Punch రిపేర్ షాప్‌కి వెళ్ళింది.. ఎందుకో తెలుసా?

ఈ వీడియోలో కారు యజమాని కారులో కూర్చున్నట్లు చూడవచ్చు. కారు యజమాని కారును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఈ వీడియోలో కారు డెలివరీ పొందుతున్న వ్యక్తి ఉత్సాహంగా ఉండటాన్ని మీరు చూడవచ్చు. కొత్త కారును నడుపుతూ, షోరూమ్ ముందు ఉన్న చిన్న ప్రహరీ గోడకు కారు ఢీ కొట్టడం కనిపిస్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే షోరూమ్ సిబ్బంది మాత్రమే కాకుండా అక్కడున్న చాలామంది ప్రజలు గుమికూడారు.

ఇంటికి చేరాల్సిన కొత్త Tata Punch రిపేర్ షాప్‌కి వెళ్ళింది.. ఎందుకో తెలుసా?

ఈ ప్రమాదంలో టాటా పంచ్ కారు యొక్క ఫ్రంట్ బంపర్ మరియు రేడియేటర్ దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. కొత్త కారు డెలివరీ చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది, ఇది నిజంగా చాలా దురదృష్టకరం, అయితే ఇందులోని వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. టాటా మోటార్స్ నుంచి క్రాష్ అయిన మొట్ట మొదటి టాటా పంచ్ ఇదే.

ఇంటికి చేరాల్సిన కొత్త Tata Punch రిపేర్ షాప్‌కి వెళ్ళింది.. ఎందుకో తెలుసా?

టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మైక్రో SUV అత్యంత సురక్షితమైన వాహనం. ఇటీవల గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్‌ పొంది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. కావున మార్కెట్లో ఈ కారుకి మరింత డిమాండ్ పెరిగింది.

ఇంటికి చేరాల్సిన కొత్త Tata Punch రిపేర్ షాప్‌కి వెళ్ళింది.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం తక్కువ ధర వద్ద ఆధునిక ఫీచర్స్ కలిగి, సేఫ్టీ విషయంలో తనకు తానే సాటిగా నిలిచిన టాటా పంచ్ ఎంతోమంది కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధించింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా పంచ్ ధర రూ. 5.49 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్యలో ఉంది.

ఇంటికి చేరాల్సిన కొత్త Tata Punch రిపేర్ షాప్‌కి వెళ్ళింది.. ఎందుకో తెలుసా?

కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

ఇంటికి చేరాల్సిన కొత్త Tata Punch రిపేర్ షాప్‌కి వెళ్ళింది.. ఎందుకో తెలుసా?

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Tata Punch 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

ఇంటికి చేరాల్సిన కొత్త Tata Punch రిపేర్ షాప్‌కి వెళ్ళింది.. ఎందుకో తెలుసా?

ఇటీవల టాటా మోటార్స్ 2021 అక్టోబర్ అమ్మకాలు నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం కంపెనీ 32,339 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇప్పుడు అమ్మకాల్లో 39 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. అక్టోబర్ 2020లో కంపెనీ 24,652 యూనిట్లను విక్రయించింది. టాటా మోటార్స్ గత నెలలో మొత్తం వాహన విక్రయాలలో 31% వృద్ధిని నమోదు చేసింది. అమ్మకాలు పెరగటానికి ఈ కొత్త టాటా పంచ్ ఎంతగానో సహకరించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 3, 2021, 14:13 [IST]
English summary
Punch micro suv owner hits wall during delivery video details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+