ఈ బస్సులు కేవలం మహిళలకు మాత్రమే.. టికెట్ కూడా 5 రూపాయలే.. ఎక్కడో తెలుసా?

భారతదేశంలో జార్ఖండ్ రాజధాని నగరమైన రాంచీలో మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి, రాంచీ మునిసిపల్ కార్పొరేషన్ పింక్ సిటీ బస్ సర్వీసులను ప్రారంభించింది. మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం మేయర్ మరియు మునిసిపల్ కమిషనర్ ఈ బస్సును ఫ్లాగ్ చేసి ప్రారంభించారు.

ఈ బస్సులు కేవలం మహిళలకు మాత్రమే.. టికెట్ కూడా 5 రూపాయలే.. ఎక్కడో తెలుసా?

ఈ పింక్ సర్వీస్ లో ప్రస్తుతం రెండు బస్సులు మాత్రమే ఉన్నాయి. ఈ బస్ సర్వీసు కేవలం మహిళల కోసం మాత్రమే కేటాయించబడింది. ఈ బస్ లో కండక్టర్ నుంచి బస్ డ్రైవర్ వరకు అందరూ మహిళలే ఉంటారు. ఈ బస్సులు కూడా పింక్ కలర్ లోనే ఉంటాయి.

ఈ బస్సులు కేవలం మహిళలకు మాత్రమే.. టికెట్ కూడా 5 రూపాయలే.. ఎక్కడో తెలుసా?

ఈ పింక్ బస్సులో కనీస ఛార్జ్ కేవలం 5 రూపాయలు మాత్రమే. ఈ బస్ సర్వీస్ చాలా సురక్షితంగా ఉండటం వల్ల మహిళలకు ఎటువంటి ఇబ్బందులు వుండవు. దేశంలో రోజురోజుకి స్త్రీలమీద జరుగుతున్న అత్యాచారాలను ఆపడానికి ఈ బస్ సర్వీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

MOST READ:ఔరా.. ఇదేమి సిత్రం.. ట్రక్ డ్రైవర్‌కి హెల్మెట్ లేదని ఫైన్.. ఎక్కడో తెలుసా

ఈ బస్సులు కేవలం మహిళలకు మాత్రమే.. టికెట్ కూడా 5 రూపాయలే.. ఎక్కడో తెలుసా?

ఈ ప్రత్యేక బస్సులో 30 మంది మహిళా ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించగలరు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ మహిళలతోపాటు పిల్లలు కూడా ఈ బస్సులో ప్రయాణించవచ్చు. ఇలాంటి బస్ సర్వీసులను మరిన్ని మార్గాల్లో నడపడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆలోచిస్తోంది.

ఈ బస్సులు కేవలం మహిళలకు మాత్రమే.. టికెట్ కూడా 5 రూపాయలే.. ఎక్కడో తెలుసా?

జార్ఖండ్ రాజధాని రాంచీలో మహిళల కోసం ఇప్పటికే పింక్ ఆటోలో నడుస్తున్నాయి. ఇందులో డ్రైవర్స్ కూడా స్త్రీలే ఉంటారు. మహిళా డ్రైవర్లు కొన్ని చోట్ల కొరతగా ఉండటం వల్ల కొన్ని చోట్ల మగ డ్రైవర్లు ఉంటారు. ఇందులో అత్యధిక భాగం మహిళా డ్రైవర్లనే నియమిస్తారు.

MOST READ:ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

ఈ బస్సులు కేవలం మహిళలకు మాత్రమే.. టికెట్ కూడా 5 రూపాయలే.. ఎక్కడో తెలుసా?

బస్సులను డ్రైవ్ చేయడానికి మహిళలను నియమించడం నిజంగా ప్రశంసనీయం. నిజానికి మహిళలు ఆటోలో ప్రయాణించడం అంత సులభం కాదు, అంతే కాదు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ బస్సులు మహిళల కోసం మాత్రమే కావున మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ఈ బస్సులు కేవలం మహిళలకు మాత్రమే.. టికెట్ కూడా 5 రూపాయలే.. ఎక్కడో తెలుసా?

రాంచీ మేయర్ ఆశా లక్రా మహిళల కోసం ఈ బస్సు సర్వీసు ప్రారంభించి, దీనికి పింక్ సిటీ బస్ సర్వీస్ అని పేరు పెట్టారు. ఈ సమయంలో, ఇవి కేవలం రెండు బస్సులను ప్రస్తుతం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తరువాత అలాంటి 10 బస్సులను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు.

MOST READ:సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]

ఈ బస్సులు కేవలం మహిళలకు మాత్రమే.. టికెట్ కూడా 5 రూపాయలే.. ఎక్కడో తెలుసా?

రాంచీలో ఈ బస్సులు ప్రతిరోజు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల నడుస్తాయి. ఈ బస్సు కచ్రి చౌక్ నుండి బిర్సా చౌక్ వరకు 7 కి.మీ. ప్రయాణిస్తాయి. దీని కోసం టికెట్టు కేవలం మహిళలకు రూ. 5 రూపాయలు వసూలు చేస్తారు. ఏది ఏమైనా మహిళల కోసం ప్రారంభించిన ఈ బస్ సర్వీస్ చాలా ప్రశంసనీయం.

Most Read Articles

English summary
Ranchi Mayor Launches Pink City Bus Service Only For Women. Read in Telugu.
Story first published: Sunday, March 21, 2021, 4:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X