దేశంలో 10 లక్షల రైడ్లను పూర్తి చేసిన రాపిడో ఆటో టాక్సీ

రైడ్ షేర్ సేవలను అందిస్తున్న బైక్ టాక్సీ ప్లాట్‌ఫామ్ రాపిడో, తమ ఆటో టాక్సీ రైడ్ ప్లాట్‌ఫామ్‌లో 1 మిలియన్ రైడ్‌లను పూర్తి చేసినట్లు ప్రకటించింది. రాపిడో అక్టోబర్ 2020లో ఆటో టాక్సీ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం రాపిడో ఆటో టాక్సీ సేవలు దేశంలోని 25 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

దేశంలో 10 లక్షల రైడ్లను పూర్తి చేసిన రాపిడో ఆటో టాక్సీ

దేశంలో ఈ సేవలను ప్రారంభించిన 5 నెలల్లోనే 10 లక్షల రైడ్‌ల భారీ విజయాన్ని సాధించినట్లు కంపెనీ తెలిపింది. ఈ సమయంలో రాపిడో తమ ఆటో ఫ్లీట్‌లో సుమారు 70,000 మంది ఆటో డ్రైవర్లను నియమించుకుంది. వచ్చే ఆరు నెలల్లో 5 లక్షల మంది కొత్త డ్రైవర్లను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.

దేశంలో 10 లక్షల రైడ్లను పూర్తి చేసిన రాపిడో ఆటో టాక్సీ

మహిళా సాధికారతపై కూడా రాపిడో దృష్టి సారించింది. ఇందుకోసం కంపెనీ శిక్షణ పొందిన మహిళా డ్రైవర్లను కూడా ఇందులో భాగం చేసింది. రాపిడో ఆటో టాక్సీ పట్టణ రవాణాకు సురక్షితమైన, ఆర్థికంగా సరసమైన మరియు సులభమైన మార్గాలను అందిస్తుంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో ఆటో టాక్సీ సేవలకు అత్యధిక డిమాండ్ కంపెనీ తెలిపింది.

MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

దేశంలో 10 లక్షల రైడ్లను పూర్తి చేసిన రాపిడో ఆటో టాక్సీ

రాపిడో ఆటో సాధించిన ఈ విజయంపై కంపెనీ సహ వ్యవస్థాపకుడు అరవింద్ శంకా మాట్లాడుతూ, "కరోనా కాలంలో రాపిడో సురక్షితమైన రవాణా మార్గంగా ఉద్భవించింది. రాపిడో ఆటో టాక్సీ తన వినియోగదారులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందనే నమ్మకంతో ఉంది. కరోనా కష్టకాలంలో దేశంలో వ్యక్తిగత రవాణా వనరులకు డిమాండ్ పెరిగింది. అటువంటి పరిస్థితిలో, రాపిడో బైక్‌లు మరియు ఆటోలు ప్రజలకు వ్యక్తిగత రవాణాలో సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయ"ని అన్నారు.

దేశంలో 10 లక్షల రైడ్లను పూర్తి చేసిన రాపిడో ఆటో టాక్సీ

రాపిడోలోని ప్రతి ఆటో టాక్సీ మరియు బైక్ జిపిఎస్ ఆధారిత రైడ్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తాయి. రాపిడో వినియోగదారులు తమ రైడ్‌లకు సంబంధించి రియల్ టైమ్ ట్రాకింగ్ వివరాలను మొబైల్ యాప్ సాయంతో తెలుసుకోవచ్చు మరియు ఆ వివరాలను తమ ఆత్మీయులతో పంచుకోవచ్చు.

MOST READ:కారులో ఆహారపదార్థాలు నిల్వచేస్తే వచ్చే సమస్యలేంటో మీకు తెలుసా.. అయితే ఇది చూడండి

దేశంలో 10 లక్షల రైడ్లను పూర్తి చేసిన రాపిడో ఆటో టాక్సీ

ప్రతి రైడ్ తర్వాత కస్టమర్ నుండి కంపెనీ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంది, తద్వారా రైడర్లు తమ రైడ్ అనుభవం గురించి కంపెనీకి ఫీడ్‌బ్యాక్ అందించవచ్చు. రాపిడో బైక్ టాక్సీ సేవలను 2015లో ప్రారంభించారు. ప్రయాణీకులకు సరసమైన మరియు లాస్ట్ మైల్ కనెక్టివిటీ సేవలను కల్పించాలనే లక్ష్యంతో కంపెనీ ఈ సేవలను ప్రారంభించింది.

దేశంలో 10 లక్షల రైడ్లను పూర్తి చేసిన రాపిడో ఆటో టాక్సీ

రాపిడో ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద బైక్ టాక్సీ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉంది. ఈ బ్రాండ్ 1.5 మిలియన్లకు పైగా రైడ్ భాగస్వాములతో దేశంలోని 100కి పైగా నగరాల్లో సేవలందిస్తోంది. రాపిడోకు భారతదేశంలో 10 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్‌లోని ఈ చిత్రం భలే విచిత్రం..చూసారా..!

దేశంలో 10 లక్షల రైడ్లను పూర్తి చేసిన రాపిడో ఆటో టాక్సీ

ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణేతో సహా 100 నగరాల్లో ర్యాపిడో సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఆటో సేవలు మాత్రం 25 నగరాల్లోనే అందుబాటులో ఉన్నాయి. రాపిడో యాప్ ద్వారా రైడ్ బుక్ చేసినప్పుడు అనేక రకాల డిస్కౌంట్లు, వోచర్లు మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా కంపెనీ అందిస్తోంది.

దేశంలో 10 లక్షల రైడ్లను పూర్తి చేసిన రాపిడో ఆటో టాక్సీ

లాక్డౌన్ సమయంలో బిగ్ బాస్కెట్, బిగ్ బజార్ మరియు స్పెన్సర్ వంటి రిటైల్ అవుట్లెట్లతో రాపిడో భాగస్వామ్యం కుదుర్చుకోవటం ద్వారా ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను నేరుగా వారికి ఇంటికి పంపిణీ చేసింది. రాపిడో హోమ్ డెలివరీ సేవలు దేశంలోని 90 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

MOST READ:ఇలాంటి విచిత్రమైన ఎలక్ట్రిక్ కారును ఎప్పుడైనా చూశారా?

దేశంలో 10 లక్షల రైడ్లను పూర్తి చేసిన రాపిడో ఆటో టాక్సీ

డెలివరీ సేవలను అందించడానికి సంస్థ యొక్క 70 శాతం డ్రైవర్లు అందుబాటులో ఉన్నారు. డెలివరీ సేవలను విస్తరించడానికి కంపెనీ గ్రోఫర్స్, డన్జో, ఫ్రెష్‌హోమ్‌లతో కూడా భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

Most Read Articles

English summary
Rapido Auto Taxi Completes 10 Lakh Rides, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X