Renault కార్లపై ఆఫర్స్ ధమాకా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ కోసం ఇక్కడ చూడండి
ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా (Renault India) 2021 డిసెంబర్ నెలలో దేశీయ మార్కెట్లోని తమ బ్రాండ్ వాహనాలపైన అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. ఇందిలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూలర్ డిస్కౌంట్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు, తద్వారా కొత్త కారుని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
రెనాల్ట్ కంపెనీ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్స్ లో ఏ కారుపైన ఎంత డిస్కౌంట్ లభిస్తుంది అనే మరిన్ని విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. రండి.

రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber):
దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) MPV మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ MPV రెండు మోడల్స్ లో మరియు వివిధ కలర్ ఆప్సన్ లో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు MY2021కి ముందున్న ట్రైబర్ MPV పై కంపెనీ రూ. 25,000 వరకు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది. అంతే కాకూండా ఇందులో రూ. 10,000 కార్పొరేట్ బెనీఫీట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇక MY2021 రెనాల్ట్ ట్రైబర్ విషయానికి వస్తే, ఇందులోని RXT వేరియంట్‌పై రూ. 10,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 వరకు కార్పొరేట్ బెనీఫీట్స్ మరియు రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు MY2021 మరియు ప్రీ-MY2021 మోడల్‌లలో రైతులకు, సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ సభ్యులకు రూ. 5,000 రూరల్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించబడుతోంది. కావున ఇప్పుడు రెనాల్ట్ కంపెనీ యొక్క ట్రైబర్ MPV కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

రెనాల్ట్ డస్టర్ (Renault Duster):
2021 డిసెంబర్ నెలలో కంపెనీ తన రెనాల్ట్ డస్టర్ SUVపై ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తోంది. ఈ కారుపై రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 30,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తుంది. కార్పొరేట్ మరియు పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌ల ఆమోదిత జాబితాకు మాత్రమే కార్పొరేట్ మినహాయింపు అందుబాటులో ఉంటుంది.

రైతులు, సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ సభ్యులకు రూ.15,000 అదనపు రూరల్ డిస్కౌంట్ అందించబడుతుంది. అంతే కాకుండా, కంపెనీ రెనాల్ట్ డస్టర్ 1.5 RXZ ట్రిమ్ ఇటీవల రూ. 46,060 భారీ తగ్గింపును కూడా పొందింది. కావున కొనుగోలుదారులు ఈ అవకాశం వినియోగిన్చుకోవచ్చు.

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid):
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న రెనాల్ట్ కంపెనీ యొక్క క్విడ్ కారుపైన కూడా కంపెనీ అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. ఈ కారుపై రూ. 10,000 వరకు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బెనీఫీట్ అందుబాటులో ఉంటుంది. కంపెనీ యొక్క 1.0-లీటర్ మోడల్‌పైన రూ. 15,000 మరియు 0.8-లీటర్ వేరియంట్‌పైన రూ. 10,000 ఎక్స్‌ఛేంజ్ బెనీఫీట్ అందిస్తుంది.

రెనాల్ట్ క్విడ్ కారుపై కంపెనీ 10,000 రూపాయల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ. 5,000 వరకు రూరల్ డిస్కౌంట్ వంటి వాటిని కూడా అందిస్తుంది. వీటితోపాటు స్టాక్ ఉన్నంతవరకు 2020 మోడల్‌పైన రూ. 10,000 అదనపు నగదు తగ్గింపు కూడా వర్తిస్తుంది.

రెనాల్ట్ కంపెనీ తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ రెనాల్ట్ క్విడ్ యొక్క అమ్మకాలు ఇప్పటికి 4 లక్షల యూనిట్లు దాటాయి. ఇది కంపెనీ సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి. ఇప్పుడు కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ వల్ల మరిన్ని ఎక్కువ కార్లు అమ్ముడయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

రెనాల్ట్ కిగర్ (Renault Kiger):
రెనాల్ట్ ఇండియా యొక్క Renault Kiger కూడా రేసీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఈ సమయంలో కంపెనీ ఈ కారుపైన అద్భుతమైన ఆఫర్స్ అందిస్తుంది. ఇప్పుడు కంపెనీ ఈ కారుపైన 10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ. 5,000 వరకు రూరల్ డిస్కౌంట్ అందిస్తుంది.

రెనాల్ట్ ఇండియా అందిస్తున్న ఈ ఆఫర్స్ 2021 డిసెంబర్ 31 అరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనిని కొనుగోలుదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. 2021 డిసెంబర్ చివరి నాటికి పైన చెప్పిన మోడల్స్ కొనుగోలు చేసి ఈ ఆఫర్స్ అన్ని వినియోగించ్చుకోవచ్చు.

కొన్ని కంపెనీ ఇప్పటికి అందించిన సమాచారం ప్రకారం 2022 నుంచి తమ వాహనాల ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కావున కొత్త కార్లను కొనాలనుకునే వారు తప్పకుండా ఈ సంవత్సరంలో కొనుగోలు చేయడం చాలా ఉత్తమం. తరువాత ధరలు పెరిగితే కొత్త కార్లను కొనడానికి మరింత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








