Lovlina Borgohain కు గిఫ్ట్‌గా కొత్త Renault Kiger
Tokyo Olympic Games లో భారతదేశానికి మొత్తం 7 పతకాలు వచ్చాయి. ఇందులో Mirabai Chanu సిల్వర్ మెడల్ తో శుభారంభం చేయగా. Neeraj Chopra అథ్లెట్ విభాగంలో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. భారతదేశానికి 7 మెడల్స్ సాధించిన వారిలో ఒకరు బాక్సర్ Lovlina Borgohain (లోవ్లినా బోర్గోహైన్).

Lovlina Borgohain (లోవ్లినా బోర్గోహైన్) Tokyo Olympic Games లో బలమైన పోటీ తర్వాత బ్రాంజ్ మెడల్ సాధించింది. బాక్సింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనపరచిన Lovlina Borgohain కు Renault India Compeny కొత్త Renault Kiger SUV ని గిఫ్ట్ గా అందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విడుదలయ్యాయి.

Lovlina Borgohain ని కొత్త Renault Kiger SUV ని రెనో ఇండియా సేల్స్ & మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ Sudhir Malhotra అందజేశారు. ఈ సందర్భంగా Lovlina Borgohain మాట్లాడుతూ ఇది తన ఫస్ట్ కార్ అని తెలిపింది. అంతే కాకుండా తనకు కారు డ్రైవ్ చేయడం తెలిసినప్పటికీ తనకు ఎక్కువ సమయం లేకపోవడం వల్ల కారు కొనలేదని మరియు ఇప్పుడు తానూ అందుకున్న కొత్త SUV లో తమ తల్లిదండ్రులను తీసుకెళ్తానని, అది తనకు ఎంతగానో ఇష్టమని చెప్పింది.

ఇటీవల Renault India Compeny సిల్వర్ మెడల్ విన్నర్ Mirabai Chanu కి కూడా Renault Kiger అందించారు. దీనిని కూడా రెనో ఇండియా సేల్స్ & మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ Sudhir Malhotra అందజేశారు.

Renault India తన Kiger Suv RXT(O) వేరియంట్‌ను ఇటీవల మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త Renault Kiger Suv RXT(O) ప్రారంభ ధర రూ. 7.37 లక్షలు. Kiger Suv RXT(O) పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందించబడుతుంది. అయితే, ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల ఎంపికను పొందుతుంది.

Kiger యొక్క కొత్త RXT(O) వేరియంట్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఆర్ఎక్స్‌టి వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొత్త వేరియంట్ Kiger RXZ వేరియంట్ ని టాప్-స్పెక్ వేరియంట్ క్రింద ఉంచబడింది. ఇది అనేక అదనపు ఫీచర్స్ కలిగి ఉంటుంది.

కొత్త RXT(O) వేరియంట్ అనేక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ తో పాటు పిఎమ్2.5 అడ్వాన్స్‌డ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఫిల్టర్ ఉంది, ఇది క్యాబిన్లోని గాలిని శుద్ధి చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ఇందులో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.

ఇవి మాత్రమే కాకూండా ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే ఉన్నాయి. ఇది 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్‌ను కూడా పొందుతుంది. ఈ కొత్త వేరియంట్ క్విడ్ మరియు ట్రైబర్ మాదిరిగానే ఎల్ఈడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పుష్-బటన్ స్టార్ట్‌తో కీలెస్ ఎంట్రీ వంటి వాటిని కలిగి ఉంటుంది.

Kiger RXT(O) వేరియంట్ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వాహనదారుని భద్రతకు అనుకూలంగా ఉంటాయి.

Renault కంపెనీ తన కొత్త Kiger యొక్క కొత్త RXT(O) వేరియంట్‌ను ప్రారంభించడంతో, భారతీయ మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని చూస్తోంది. అంతే కాకుండా కంపెనీ యొక్క విక్రయాలను కూడా పెంచడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉండే కొత్త RXT(O) వేరియంట్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి RXE, RXL, RXT మరియు RXZ వేరియంట్స్.

Kiger RXT రెండు ఇంజిన్ ఆప్షన్‌లలో అమ్ముడవుతోంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇందులోని 1.0-లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 72 బిహెచ్‌పి పవర్ మరియు 96 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో అందించబడింది.

అదేవిధంగా 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 99 బిహెచ్‌పి పవర్ మరియు 160 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో మాత్రమే కంపెనీ ఈ ఇంజిన్‌ను మార్కెట్‌లో విక్రయిస్తోంది. మొత్తానికి Kiger RXT వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.దేశీయ మార్కెట్లో ఉన్న Renault Kiger RXT అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో కంపెనీ మంచి అమ్మకాలు జరపడానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








