Just In
- 24 min ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్‌లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 1 hr ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 3 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
త్వరపడండి.. Renault కార్లపై రూ. 1.30 లక్షల వరకు ఆఫర్స్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ Renault India (రెనాల్ట్ ఇండియా) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. రెనాల్ట్ ఇండియా యొక్క Kwid (క్విడ్), Triber (ట్రైబర్) అంటి మోడల్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమయ్యింది.
ఈ పండుగ సీజన్ ని దృష్టిలో ఉంచుకుని Renault India తన బ్రాండ్ అమ్మకాలను మరింత పెంచటానికి మరియు కస్టమర్లను ఆకర్శించడానికి అద్భుతమైన ఆఫర్స్ తీసుకువచ్చింది. ప్రస్తుతం కంపెనీ తన బ్రాండ్ యొక్క నాలుగు కార్లపై ఆఫర్స్ అందిస్తుంది. ఇందులో Renault Kwid (రెనాల్ట్ క్విడ్), Triber (రెనాల్ట్ ట్రైబర్), Kiger (రెనాల్ట్ కిగర్) మరియు Renault Duster (రెనాల్ట్ డస్టర్) ఉన్నాయి.
కంపెనీ ఈ కార్లపై అందిస్తున్న ఆఫర్ల గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.
Renault Kwid (రెనాల్ట్ క్విడ్):
Renault Kwid అనేది Renault కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్. ఇది తక్కువ ధర కలిగి ఉండటం వల్ల ఎక్కువ అమ్మకాలను చేపట్టగలిగింది. అంతే కాకుండా ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. రెనాల్ట్ కంపెనీ ఇప్పుడు ఈ Renault Kwid కారుపై రూ .40,000 వరకు ఆఫర్లను అందిస్తోంది.
దీనితో పాటు కంపెనీ రూ. 65,000 వరకు స్పెషల్ లాయల్టీ బెనిఫిట్ కూడా అందిస్తుంది. Renault Kwid కారుపై రూ. 10,000 వరకు అడిషినల్ క్యాష్ ఆఫర్స్ అందిస్తుంది. ఇవన్నీ కూడా పరిమితంగా అంటే స్టాక్ ఉన్నంతవరకు అందుబాటులో ఉంటాయి.
కంపెనీ ఈ ఆఫర్స్ తో పాటు స్క్రాపేజ్ పాలసీ కింద 'Buy Now, Pay In 2022' (ఇప్పుడు కొనండి, 2022 లో చెల్లించండి) అనే అద్భుతమైన ఆఫర్ కూడా అందిస్తోంది. అంతే కాకుండా ఈ కారుపై రూ .10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వబడుతుంది. ఇవన్నీ పండుగ సీజన్ లో కారు కొనే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
రెనాల్ట్ క్విడ్ అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉండటంతో పాటు, మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. దీనికోసం కంపెనీ ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్లను అందిస్తుంది. ఇందులో ఒకటి 0.8 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ కాగా, రెండవది 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్.
Renault Triber (రెనాల్ట్ ట్రైబర్):
Renault Triber అనేది Renault కంపెనీ యొక్క 7-సీటర్ MPV. కంపెనీ 2021 కి ముందు ఉన్న Renault Triber మోడల్‌పై రూ. 60,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇది కాకుండా, రూ .75,000 వరకు లాయల్టీ బెనిఫీట్స్, మరియు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తుంది. ఈ వేరియంట్ లో 'Buy Now, Pay In 2022' ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
అదే విధంగా కంపెనీ యొక్క 2021 రెనాల్ట్ ట్రైబర్ విషయానికి వస్తే, ఈ ఈ మోడల్‌పై కంపెనీ రూ. 50,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. అంతే కాకుండా కంపెనీ రూ. 75,000 వరకు లాయల్టీ ప్రయోజనాలు మరియు స్క్రాపేజ్ పాలసీ కింద రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. దీనిపై కూడా 'Buy Now, Pay In 2022' ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కావున Renault Triber ఈ పండుగ సీజన్లో కొనేవారికి ఈ ప్రయోజనాలన్నీ కూడా వర్తిస్థాయి.
Renault Kiger (రెనాల్ట్ కిగర్):
Renault కంపెనీ యొక్క Renault Kiger కాంపాక్ట్ SUV, ఈ సంవత్సరం మార్కెట్లో విడుదల చేయబడింది. ఈ కొత్త మోడల్ పై కంపెనీ అరుదైన ఆఫర్స్ అందిస్తుంది. ఈ కారుపై కంపెనీ రూ .95,000 వరకు లాయల్టీ బెనిఫిట్స్, రూ .10,000 కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ మరియు 'Buy Now, Pay in 2022' వంటి ఆఫర్ అందిస్తోంది.
Renault Kiger SUV ని కంపెనీ ఇటీవల ఒలంపిక్ గేమ్స్ లో గెలిచిన ఆటగాళ్లకు అందించింది. ఈ SUV లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. Renault India తన Kiger Suv RXT(O) వేరియంట్‌ను ఇటీవల మార్కెట్లో విడుదల చేసింది.
Renault Duster (రెనాల్ట్ డస్టర్):
Renault కంపెనీ Duster ఎస్‌యూవీపై కూడా ఆఫర్స్ అందిస్తుంది. ఈ కారు కొనుగోలు చేసే కస్టమర్లు ఏకంగా రూ. 1,30,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
అంతే కాకుండా ఈ కారుపై రూ. 1,10,000 స్పెషల్ లాయల్టీ బోనస్ మరియు స్క్రాపేజ్ పాలసీ కింద రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుతుంది. ఇందులో 'Buy Now, Pay in 2022' వంటి ఆఫర్ లేదు. కొనుగోలుదారులు గమనించాలి.