Renault కార్లపై పండుగ సీజన్ ఆఫర్స్: మోడల్ వారీ డిస్కౌంట్ వివరాలు

ఫ్రెంచ్ కార్ కంపెనీ Renault India (రెనో ఇండియా) ప్రస్తుత పండుగ సీజన్ ను పురస్కరించుకొని తమ ప్రోడక్డ్ పోర్ట్‌ఫోలియోలోని కార్లపై భారీ క్యాష్ డిస్కౌంట్లు మరియు ఆఫర్‌ లను ప్రకటించింది. ఈ సెప్టెంబర్ 2021 నెలలో Renault కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు బారీ మొత్తంలో నగదును ఆదా చేసుకోవచ్చు.

Renault కార్లపై పండుగ సీజన్ ఆఫర్స్: మోడల్ వారీ డిస్కౌంట్ వివరాలు

ప్రస్తుతం భారత మార్కెట్లో రెనో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో నాలుగు మోడళ్లను కలిగి ఉంది. వీటిలో Renault Kwid, Renault Kiger, Renault Duster మరియు Renault Triber (క్విడ్, కైగర్, డస్టర్ మరియు ట్రైబర్) మోడళ్లు ఉన్నాయి. ఈ కార్లపై అందిస్తున్న ఉన్న ఆఫర్లు సెప్టెంబర్ 31, 2021 వరకు చెల్లుబాటులో ఉంటాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

Renault కార్లపై పండుగ సీజన్ ఆఫర్స్: మోడల్ వారీ డిస్కౌంట్ వివరాలు

1.Renault Duster

రెనో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ Duster పై ఈ నెలలో కంపెనీ గరిష్టంగా 2.25 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 30,000 కార్పొరేట్ బెనిఫిట్ లేదా రూ. 15,000 రూరల్ ఆఫర్, రూ. 1.1 లక్షల ప్రత్యేక లాయల్టీ బెనిఫిట్ మరియు రూ. 10,000 స్క్రాపేజ్ బోనస్ (మహారాష్ట్ర, గుజరాత్ మరియు గోవా రాష్ట్రాలలో మాత్రమే) లు ఉన్నాయి.

Renault కార్లపై పండుగ సీజన్ ఆఫర్స్: మోడల్ వారీ డిస్కౌంట్ వివరాలు

భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో, ఈ కారుపై రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 30,000 కార్పొరేట్ బెనిఫిట్ లేదా రూ. 15,000 రూరల్ ఆఫర్, రూ. 1.1 లక్షల ప్రత్యేక లాయల్టీ బెనిఫిట్ మరియు రూ. 10,000 స్క్రాపేజ్ బోనస్‌ లభిస్తుంది.

Renault కార్లపై పండుగ సీజన్ ఆఫర్స్: మోడల్ వారీ డిస్కౌంట్ వివరాలు

2. Renault Kiger

ఈ బ్రాండ్ నుండి లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ Renault Kiger పై కంపెనీ ఈ సెప్టెంబర్ నెలలో రూ. 1.05 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్ మరియు గోవా రాష్ట్రాలలో రూ. 30,000 కార్పొరేట్ బెనిఫిట్ లేదా రూ. 15,000 రూరల్ ఆఫర్ మరియు రూ. 80,000 ప్రత్యేక లాయల్టీ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.

Renault కార్లపై పండుగ సీజన్ ఆఫర్స్: మోడల్ వారీ డిస్కౌంట్ వివరాలు

ఇక దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఈ కారుపై రూ. 10,000 కార్పొరేట్ బెనిఫిట్ లేదా రూ. 5,000 రూరల్ ఆఫర్ మరియు రూ. 95,000 ప్రత్యేక లాయల్టీ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. రెనో ఇండియా ఎంపిక చేసిన రాష్ట్రాలలో కొంతమంది కస్టమర్‌లకు ఈ ఎస్‌యూవీపై 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల పొడిగించిన వారంటీని కూడా అందిస్తోంది.

Renault కార్లపై పండుగ సీజన్ ఆఫర్స్: మోడల్ వారీ డిస్కౌంట్ వివరాలు

3. Renault Triber

భారతదేశంలో అత్యంత సరసమైన ఎమ్‌పివిలలో ఒకటైన Renault Triber ను ఈ నెలలో కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 1.45 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 25,000 ఎక్సేంజ్ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ బెనిఫిట్ లేదా రూ. 5,000 రూరల్ ఆఫర్, రూ. 75,000 ప్రత్యేక లాయల్టీ బెనిఫిట్స్ మరియు రూ. 10,000 స్క్రాపేజ్ బోనస్ లు (మహారాష్ట్ర, గుజరాత్ మరియు గోవా రాష్ట్రాలలో) అందుబాటులో ఉన్నాయి.

Renault కార్లపై పండుగ సీజన్ ఆఫర్స్: మోడల్ వారీ డిస్కౌంట్ వివరాలు

అదే సమయంలో, దేశంలోని ఇతర రాష్ట్రాలలో, ఈ కారుపై రూ. 1.35 లక్షల వరకు మొత్తం ప్రయోజనాలు అందించబడుతున్నాయి. ఇందులో రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ బెనిఫిట్ లేదా రూ. 5,000 రూరల్ ఆఫర్ మరియు రూ. 75,000 ప్రత్యేక లాయల్టీ బెనిఫిట్ మరియు రూ. 10,000 స్క్రాపేజ్ బోనస్ అందుబాటులో ఉంది.

Renault కార్లపై పండుగ సీజన్ ఆఫర్స్: మోడల్ వారీ డిస్కౌంట్ వివరాలు

4. Renault Kwid

రెనో బ్రాండ్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ కారు Kwid పై కంపెనీ ఈ నెలలో రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్సేంజ్ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ బెనిఫిట్ లేదా రూ. 5,000 రూరల్ ఆఫర్, రూ. 65,000 ప్రత్యేక లాయల్టీ బెనినిఫిట్ మరియు రూ. 10,000 స్క్రాపేజ్ బోనస్ (మహారాష్ట్ర, గుజరాత్‌ మరియు గోవా రాష్ట్రాలలో) లభిస్తోంది.

Renault కార్లపై పండుగ సీజన్ ఆఫర్స్: మోడల్ వారీ డిస్కౌంట్ వివరాలు

అదే సమయంలో, దేశంలోని ఇతర రాష్ట్రాలలో, ఈ కారుపై మొత్తం రూ. 1.15 లక్షల ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ బెనిఫిట్ లేదా రూ. 5,000 రూరల్ ఆఫర్ మరియు రూ. 65,000 ప్రత్యేక లాయల్టీ బెనిఫిట్ మరియు రూ. 10,000 స్క్రాపేజ్ బోనస్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Renault కార్లపై పండుగ సీజన్ ఆఫర్స్: మోడల్ వారీ డిస్కౌంట్ వివరాలు

ఈ ఆఫర్లన్నీ కూడా సెప్టెంబర్ 31 ,2021 వరకూ లేదా స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని గుర్తుంచుకోండి. అంతేకాకుండా, ఇవి డీలర్‌షిప్ మరియు ప్రాంతాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత రెనో డీలర్‌షిప్ ను సందర్శించండి. - ఆటోమొబైల్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 8, 2021, 11:13 [IST]
English summary
Renault india september offers and discounts on kwid duster kiger and triber details
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+