Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

ఇటాలియన్ హైపర్ కార్ బ్రాండ్ పగని (Pagani) కి మహర్ధశ పట్టుకుంది. ఈ బ్రాండ్ ఇప్పుడు సౌదీ అరేబియా నుండి భారీ పెట్టుబడిని అందుకుంది. సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) ద్వారా పెట్టుబడులను అందుకున్నట్లు పగని ప్రకటించింది.

Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సార్వభౌమ సంపద నిధులలో ఒకటిగా పరిగణించడం జరుగుతుంది మరియు దీని విలువ సుమారు 430 బిలియన్ అమెరికన్ డాలర్లకు దగ్గరగా అంచనా వేయబడింది. ఈ డీల్‌తో అతికొద్ది మందికి మాత్రమే పరిచయమైన Pagani బ్రాండ్, ఇకపై ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని తెచ్చుకోనుంది.

Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

ప్రపంచ పటంలో సౌదీ అరేబియా అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా ఉంది మరియు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పెట్రోలియం నిల్వలు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో, సౌదీ అరేబియా మరియు Pagani బ్రాండ్ ల మధ్య ఏర్పడిన ఈ మైత్రి, ఈ విభాగంలోని ఇతర వ్యాపార సంస్థల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.

Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

పగని హైపర్‌కార్ మేకర్ యొక్క మాతృ సంస్థకు చెందిన గ్రూప్ Horacio Pagani SpA లో సౌదీ అరేబియా పెట్టుబడి పెట్టినప్పటికీ, ఇందులో ఇటాలియన్ హైపర్‌కార్ తయారీదారు యొక్క మైనారిటీ వాటాను మాత్రమే సౌదీ అరేబియా కొనుగోలు చేసింది. దీంతో మెజారిటీ వాటా ఇటాలియన్ కార్ మేకర్ ఫ్యామిలీ చేతిలోనే ఉంటుంది.

Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

ఈ చారిత్రాత్మక డీల్ గురించి Pagani సంస్థ వ్యవస్థాపకుడు Horacio Pagani (హోరాసియో పగని) మాట్లాడుతూ.. "మా దీర్ఘకాలిక హైపర్‌కార్‌లు ప్రత్యేకమైన భావోద్వేగాలను తెలియజేస్తూ ఉండేలా గణనీయమైన పెట్టుబడులను ఊహించే మా దీర్ఘకాలిక వృద్ధి వ్యూహంలో ఇదొక కీలకమై అడుగు" అని వ్యాఖ్యానించారు.

Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

ఈ సంస్థ నిర్మించిన కార్ల సంఖ్య ప్రకారం Pagani బ్రాండ్ ఒక చిన్న కంపెనీయే అయినప్పటికీ, ఈ సంస్థ తయారు చేసిన మరియు చేయబోయే కార్లన్నింటికీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం చాలా ఎక్కువ డబ్బు అవసరం. ఈ పరిస్థితుల్లో తాజాగా సౌదీ అరేబియా పెట్టిన పెట్టుబడి ఈ బ్రాండ్ యొక్క భవిష్యత్తు వాహనాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది.

Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

ఈ పెట్టుబడిన వలన Pagani బ్రాండ్ యొక్క భవిష్యత్తు పరిణామాలలో సాంకేతిక మెరుగుదలలు మరియు లైఫ్‌స్టైల్ సెగ్మెంట్లో బ్రాండ్ విస్తరణ మొదలైన వాటిని ఆశించవచ్చు. Lamborghini (లంబోర్ఘిని) ని సూపర్ కార్ తయారీదారుగా చేయడంలో Ferrari (ఫెరారీ) కీలక పాత్ర పోషిస్తున్నట్లుగానే, Pagani ని హైపర్ కార్ తయారీదారుగా మార్చడంలో Lamborghini కూడా కీలక పాత్ర పోషించింది.

Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

ఆరంభంలో Pagani సంస్థ Lamborghini కార్ల కోసం విడిభాగాలను అందించే కంపెనీగా ప్రారంభమైంది. ఆ తరువాత, ఈ అనుభవంతో Pagani స్వంతంగా సూపర్ కార్‌ను డిజైన్ చేయటం ప్రారంభించింది. ఇందుకు లంబోర్ఘిని కూడా తమ సహకారాన్ని అందించింది. ఈ ప్రయాణంలో పగని Dallara బ్రాండ్ నుండి ఛాస్సిస్ మరియు ఏరో కిట్లను సేకరించగా Mercedes - AMG నుండి ఇంజన్‌ను గ్రహించింది.

Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

ఇలా రూపొందిన హైపర్ కారే Pagani C12 మరియు Pagani Zonda లైన్‌లో ఇది మొదటిది. కాలక్రమేనా Zonda లో కంపెనీ 40 కి పైగా విభిన్న మోడళ్లను సృష్టిస్తూ వచ్చింది. ఇప్పటివరకు నిర్మించిన అన్ని Pagani Zonda కార్లలో Mercedes - AMG నుండి గ్రహించిన వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే వేరియంట్ ను బట్టి ఈ ఇంజన్ సైజు 6.0 లీటర్ల నుండి 7.3 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉండేది.

Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

అలాగే, ఇందులో వేరియంట్‌ను బట్టి, ఆయా కార్లలో అందించే ట్రాన్స్‌మిషన్ కూడా మారుతూ ఉండేది. ఈ కార్లలో కంపెనీ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ వంటి గేర్‌బాక్స్ లను ఉపయోగించింది. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా, కంపెనీ తమ Pagani Zonda ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత దీనికి సక్సెసర్‌గా 2011 లో పగనీ హుయెరా (Pagani Huayra) ను కంపెనీ ప్రారంభించింది.

Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

మునుపటి Pagani Zonda మాదిరిగానే Pagani Huayra హైపర్ కారులో కూడా Mercedes - AMG నుండి గ్రహించి ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ కారులో శక్తివంతమైన 6.0 లీటర్ వి12 ఇంజన్ డ్యూయెల్ టర్బోచార్జర్‌లతో పనిచేస్తుంది. ఇందులో వేరియంట్ మరియు మోడల్‌ను బట్టి ఈ ఇంజన్ గరిష్టంగా 740 పిఎస్‌ల నుండి 850 పిఎస్‌ల మధ్య శక్తిని జనరేట్ చేస్తుంది.

Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

Pagani Huayra యొక్క అన్ని మోడళ్లు కూడా ఎక్స్‌ట్రాక్ సంస్థ నిర్మించిన 7 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటాయి మరియు ఇవి యాక్టివ్ ఏరోడైనమిక్స్‌తో వస్తాయి.

Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

Pagani మరియు సౌదీ అరేబియా మధ్య కుదిరిన ఈ వ్యాపార భాగస్వామ్యం నిజానికి అంత పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటే ఈ మధ్యప్రాచ్య దేశం దాని చమురు నిల్వలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశం లోపల మరియు వెలుపల వివిధ రంగాలలో భారీ మొత్తంలో పెట్టుబడులను వెచ్చిస్తోంది.

Pagani లో భారీ పెట్టుబడి పెట్టిన సౌదీ అరేబియా; ఈ ఇటాలియన్ బ్రాండ్ దశ మారనుందా?

ఇందులో భాగంగానే సౌదీ అరేబియా Pagani లో భారీ ఇంత భారీ పెట్టుబడిని వెచ్చించింది. ఈ పెట్టుబడి ఇటాలియన్ బ్రాండ్ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది మరియు సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ హైపర్ కార్ బ్రాండ్ చేపట్టిన హైపర్ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ఈ నిధులు ఎంతగానే ఉపయోగపడుతాయి.

Most Read Articles

English summary
Saudi arabia invests in italian hyper car brand pagani details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X