Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండా కార్లపై ఫిబ్రవరి 2021 ఆఫర్స్.. రూ.32,000 వరకూ డిస్కౌంట్స్..
కొత్త సంవత్సరంలో అన్ని కార్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతుంటే, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మాత్రం తమ కార్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ ఫిబ్రవరి 2021లో హోండా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.32,000 వరకూ ఆదా చేసుకోవచ్చు.

ప్రస్తుతం భారత మార్కెట్లో హోండా విక్రయిస్తున్న అన్ని మోడళ్లపై ఈ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా, నగదు తగ్గింపులు, ఉచిత యాక్ససరీలు, ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఎక్స్ఛేంజ్ మరియు లాయల్టీ బోనస్‌లను కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి.

హోండా కార్స్ ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో అమేజ్ కాంపాక్ట్ సెడాన్, ఐదవ-తరం హోండా సిటీ సెడాన్, డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ మరియు జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను విక్రయిస్తోంది. కాగా, కంపెనీ ఇటీవలే తమ సివిక్ మరియు సిఆర్-వి మోడళ్లను మార్కెట్లో నిలిపివేసింది.
ఫిబ్రవరి 2021 ఆఫర్లలో భాగంగా, హోండా కార్లపై మోడల్ వారీగా అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
MOST READ:కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్ : వివరాలు

హోండా జాజ్
హోండా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్‌లో 2021 మోడల్‌పై కంపెనీ రూ.25,000 నగదు తగ్గింపు లేదా రూ.29,365 విలువైన యాక్ససరీలను అందిస్తోంది. ఇవే కాకుండా కార్ ఎక్సేంజ్‌పై అదనంగా రూ.15,000 నగదు తగ్గింపును కూడా అందిస్తోంది.

అయితే, ఇందులో కొత్త 2021 మోడల్‌పై మాత్రం కేవలం రూ.15,000 నగదు తగ్గింపు లేదా రూ.17,248 రూపాయల యాక్ససరీలను మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. వీటికి అదనంగా కార్ ఎక్సేంజ్‌పై మరో రూ.15,000 నగదు తగ్గింపును కూడా ఆఫర్ చేస్తున్నారు.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

హోండా అమేజ్
హోండా విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్‌లో 2020 మోడల్‌పై కంపెనీ రూ.15,000 నగదు తగ్గింపును లేదా రూ.18,106 విలువైన యాక్ససరీలను అందిస్తోంది. ఇవే కాకుండా కార్ ఎక్సేంజ్‌పై రూ.10,000 నగదు తగ్గింపు కూడా ఆఫర్ చేస్తోంది. దీనితో పాటుగా రూ.12,000 ఎక్స్‌టెండెడ్ వారంటీనీ (4వ మరియు 5వ సంవత్సరం కోసం) అందిస్తున్నారు.

అదే, 2021 మోడల్ అమేజ్‌పై అయితే రూ.12,500 నగదు తగ్గింపు లేదా రూ.14,497 యాక్ససరీలను అందిస్తున్నారు. అదనంగా కార్ ఎక్సేంజ్‌పై రూ.12,500 తగ్గింపు కూడా ఆఫర్ చేస్తున్నారు.
MOST READ:ఆటోమొబైల్ పరిశ్రమపై కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ ; ఎలా ఉందో తెలుసా..!

హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్‌పై రూ.7000 నగదు తగ్గింపును లేదా కార్ ఎక్స్ఛేంజ్‌పై రూ.15,000 తగ్గింపును అందిస్తున్నారు. అలాగే, హోండా అమేజ్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌పై రూ.12,000 నగదు తగ్గింపు మరియు కార్ ఎక్స్ఛేంజ్‌పై రూ.15,000 అదనపు తగ్గింపు అందిస్తున్నారు.

హోండా డబ్ల్యుఆర్-వి
హోండా డబ్ల్యుఆర్-వి 2020 మోడల్ కొనుగోలుపై రూ.25,000 నగదు తగ్గింపు లేదా రూ.29,427 విలువైవ యాక్ససరీలను మరియు కార్ ఎక్స్ఛేంజ్‌పై రూ.15,000 అదనపు తగ్గింపు అందిస్తున్నారు.
MOST READ:న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

అలాగే, 2021 మోడల్ కొనుగోలుపై రూ.15,000 నగదు తగ్గింపు లేదా రూ.17,527 విలువైన యాక్ససరీలను మరియు కార్ ఎక్స్ఛేంజ్‌పై అదనంగా రూ.15,000 తగ్గింపు అందిస్తున్నారు.
హోండా డబ్ల్యుఆర్-వి ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ కొనుగోలుపై రూ.10,000 నగదు తగ్గింపు మరియు కార్ ఎక్స్ఛేంజ్‌పై అదనంగా రూ.15,000 తగ్గింపు అందిస్తున్నారు.

హోండా సిటీ
హోండా సిటీ 2020 మోడల్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.10,000 నగదు తగ్గింపును లేదా రూ.10,798 విలువైన యాక్ససరీలను అందిస్తున్నారు. ఇవే కాకుండా కార్ ఎక్స్ఛేంజ్‌పై అదనంగా రూ.20,000 తగ్గింపు ఇస్తున్నారు.

అయితే కొత్త 2021 మోడల్ సిటీ సెడాన్ కొనుగోలుపై కేవలం రూ.10,000 కార్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను మాత్రమే అందిస్తున్నారు. హోండా ఇటీవల తమ నోయిడా ప్లాంట్‌ను మూసివేయడంతో ఆ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్న హోండా సివిక్, సిఆర్-విల ఉత్పత్తి కూడా ఆగిపోయింది. ప్రస్తుతానికి ఈ రెండు మోడళ్లను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టే అంశంపై హోండా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.