సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు పైపైకి.. 2025 కల్లా 90% వృద్ధి

భారత మార్కెట్లో రోజు రోజుకి వాహన అమ్మకాలు పురోగతి చెందుతున్నాయి. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా వాహన అమ్మకాలు కొంత వరకు తగ్గినప్పటికీ కరోనా లాక్ డౌన్ పూర్తిగా తొలగించిన తర్వాత అమ్మకాలు మునుపటికంటే ఎక్కువగా సాగాయి. ఇందులో కూడా చాలామంది వినియోగదారులు కొత్త వాహనాలకంటే కూడా సెకండ్ హ్యాండ్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు పైపైకి.. 2025 కల్లా 90% వృద్ధి

ఇటీవల ఇండియన్ బ్లూ బుక్ విడుదల చేసిన 2021 నివేదిక ప్రకారం, భారతదేశంలోని సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ గురించి ఖచ్చితమైన వివరాలు మరియు ప్రత్యేక సమాచారాన్ని అందించింది. ఈ నివేదికల ప్రకారం రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ వేగంగా పెరుగుతుందని ఈ 2021 ఇండియన్ బ్లూ బుక్ నివేదిక తెలిపింది.

సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు పైపైకి.. 2025 కల్లా 90% వృద్ధి

సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ 2020 ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్ల మార్కెట్ కంటే 50% ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ 2025 నాటికి దాదాపుగా 90% వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. కేవలం ఈ సమయంలోనే మొత్తం 71 లక్షల సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించబడుతున్నాయి. దీని ప్రకారం అమ్మకాల పరిమాణం 11% పెరుగుతుందని అంచనా.

MOST READ:మతిపోగొడుతున్న కస్టమైజ్డ్ ఫోర్డ్ ఎండీవర్; వివరాలు

సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు పైపైకి.. 2025 కల్లా 90% వృద్ధి

కొత్త కార్ల కొనుగోలు కంటే కూడా ఎక్కువమంది సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. భారతదేశంలో కొత్త మరియు సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ 2016 నుండి 2019 ఆర్థిక సంవత్సరంలో ఒకటిన్నర రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ అమ్మకాలు మంచి వృద్ధిని సాధించాయి.

సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు పైపైకి.. 2025 కల్లా 90% వృద్ధి

ఈ నివేదిక ప్రకారం దేశంలోని వినియోగదారులు కొత్త కార్ల కంటే పాత కార్లను ఎక్కువ ఇష్టపడుతున్నట్లు నిర్దారించబడింది. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు 2021 లో భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

MOST READ:ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు పైపైకి.. 2025 కల్లా 90% వృద్ధి

ఈ సంవత్సరం చివరి నాటికి గత సమ్వత్సరంలో పెరిగిన వృద్ధికంటే కూడా ఈ రేటు 2.2 రెట్లు పెరిగే అవకాశం ఉంది. కోవిడ్ 19 నేపథ్యంలో ప్రజలు ప్రజా రవాణా కంటే తమ సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. సెకండ్ హ్యాండ్ కార్ల పెరుగుదలకు ఇది కూడా ప్రధాన కారణం.

సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు పైపైకి.. 2025 కల్లా 90% వృద్ధి

అంతే కాకుండా భారత మార్కెట్లో అమ్మకాలు కూడా పెరుగుదల దిశవైపు పరుగులుపెడుతున్నాయి. వినియోగదారులు కొత్త కారును కొనుగోలు చేసిన విధంగానే సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయవచ్చు. సెకండ్ హ్యాండ్ కార్లు ఇప్పుడు షోరూమ్‌లలో అమ్ముడవుతున్నాయి.

MOST READ:స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు పైపైకి.. 2025 కల్లా 90% వృద్ధి

సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసే వారికీ వారంటీ వంటివి కూడా అందిస్తారు. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ వాహన సంస్థలు కూడా సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లోకి ప్రవేశించాయి. కరోనా మహమ్మారి తరువాత తక్కువ బడ్జెట్ లో మెరుగ్గా ఉండే సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి మధ్య తరగతి వినియోగదారులు ఆసక్తి కనపరుస్తున్నారు.

Most Read Articles

English summary
Second Hand Car Market In India To Grow By 90 Percent. Read in Telugu.
Story first published: Sunday, April 25, 2021, 11:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X