సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

కోవిడ్-19 సంక్షోభం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సెమీ కండక్టర్స్ చిప్స్ కొరత ఏర్పడింది. ఈ కొరత వలన ఆటోమొబైల్ పరిశ్రమ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ తయారీ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిలో అంతరాయాన్ని ఎదుర్కుంటున్నాయి.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

మనదేశంలో Maruti Suzuki వంటి అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కూడా ఈ చిప్స్ కొరత కారణంగా తమ వాహనాల ఉత్పత్తిని తగ్గించనుంది. కాగా, భారతదేశపు అతిపెద్ద యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కూడా సెమీకండక్టర్ కొరత కారణంగా వాహనాల ఉత్పత్తిని 25 శాతం వరకు తగ్గించనున్నట్లు ప్రకటించింది.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

Mahindra భారతదేశంలోని తమ ప్లాంట్లలో ఏడు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. Mahindra ఆటోమోటివ్ డివిజన్ ప్రస్తుతం చాకన్, నాసిక్, కాందివాలి, జహీరాబాద్ మరియు హరిద్వార్‌ నగరాల్లో తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. ఈ ప్లాంట్లలో కంపెనీ ఒక వారం రోజుల పాటు వాహన తయారీని నిలిపివేయనుంది.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

అయితే, ఈ ఉత్పత్తి అంతరాయం వలన తాము కొత్తగా విడుదల చేసిన ఎస్‌యూవీ Mahindra XUV700 (మహీంద్రా ఎక్స్‌యూవీ సెవన్ డబుల్ ఓ) యొక్క ప్రొడక్షన్ ర్యాంప్-అప్ మరియు లాంచ్ ప్లాన్‌ లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

సెమీకండక్టర్ సంక్షోభం కారణంగా భారతదేశంలో సరఫరా అంతరాయాలను ఎదుర్కొంటున్న కార్ల తయారీదారు Mahindra & Mahindra మాత్రమే కాదు. మనదేశంలో Tata Motors, Maruti Suzuki, Nissan మరియు Toyota వంటి సంస్థలు కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటున్నాయి.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజాలైన Ford మరియు General Motors అలాగే జపనీస్ కార్ మేజర్ కంపెనీలైన Toyota మరియు Nissan వంటి సంస్థలు కూడా ఇప్పటికే సెమీకండక్టర్ సంక్షోభం కారణంగా ఉత్పత్తిలో కోతలను విధించడం లేదా తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేయటం చేస్తున్నాయి.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

Mahindra తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో భాగంగా, కంపెనీ తన ఆటోమోటివ్ డివిజన్ ప్లాంట్లలో సెప్టెంబర్ 2021 నెలలో 'నో ప్రొడక్షన్ డేస్' నిర్వహిస్తుందని పేర్కొంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వలన, కొన్ని ప్రముఖ మోడళ్ల వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణలు భావిస్తున్నారు.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

గతంలో కూడా కొత్త Mahindra Thar విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఎస్‌యూవీ లోని ఇన్ఫోటైన్‌మెంట్ లో ఉపయోగించే చిప్స్ కొరత కారణంగా, కంపెనీ వాటిని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్లకు సరఫరా చేసింది. అప్పట్లో అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. కాబట్టి, ఈ పరిస్థితుల్లో వెయిటింగ్ పీరియడ్ పెరిగితే కంపెనీలు తమ సంభావ్య కస్టమర్లను కోల్పోయే అవకాశం ఉంది. Mahindra కేవలం ప్యాసింజర్ వాహనాలను మాత్రమే కాకుండా, మూడు చక్రాల వాహనాలు, బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పరికరాలను కూడా ఉత్పత్తి చేస్తుంది.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

సెమీకండక్టర్స్‌కు ఎందుకు అంత ప్రధాన్యత, వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు ?

ఇటీవల కాలంలో సెమీకండక్టర్ చిప్స్ ఆటోమొబైల్ పరిశ్రమలో చాలా ముఖ్యమైన భాగంగా మారాయి. లేటెస్ట్ సేఫ్టీ మరియు కంఫర్ట్ ఫీచర్లతో వస్తున్న అన్ని మోడ్రన్ కార్లలో వీటిని వినియోగం ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరిగింది. కార్లలో ఉపయోగించే బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్-అసిస్టెన్స్ ఫీచర్లు, నావిగేషన్ ఎక్విప్‌మెంట్‌లు మరియు హైబ్రిడ్-ఎలక్ట్రిక్ సిస్టమ్‌లు మొదలైన వాటికి ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ ఎంతో అవసరం.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

అంతేకాదు, దాదాపు అన్ని రకాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్లలో కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. ఈ సెమీకండక్టర్ చిప్స్ లేకుండా, కారు తయారీలో అవసరమైన కొన్ని ముఖ్యమైన భాగాలను అసెంబుల్ చేయటం కష్టంగా ఉంటుంది. ఫలితంగా, కార్ల ఉత్పత్తి కూడా అసాధ్యం అవుతుంది.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

Mahindra ఆగస్ట్ 2021 సేల్స్ ఎలా ఉన్నాయి ?

గడచిన ఆగష్టు 2021 నెలలో Mahindra & Mahindra ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసింది. గత నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలు 15,973 యూనిట్లుగా నమోదై, 17 శాతం వృద్ధిని కనబరిచాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 13,651 యూనిట్లుగా ఉన్నాయి.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

Mahindra XUV700 అమ్మకాలు ఎప్పుడు ?

Mahindra ఇటీవల తమ సరికొత్త ఎస్‌యూవీ XUV700 ని భారత మార్కెట్లో విడుదల చేసింది. లేటెస్ట్ డిజైన్ మరియు అధునాతన సేఫ్టీ ఫీచర్లతో రూపొందించిన ఈ ఎస్‌యూవీని దేశీయ విపణిలో రూ. 11.99 లక్షల నుండి రూ. 14.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో విడుదల చేయబడింది.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

భారతదేశంలో ప్రస్తుత పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ త్వరలోనే ఈ మోడల్ కోసం బుకింగ్ లను ప్రారంభించే అవకాశం ఉంది. Mahindra XUV700 ని ఈ విభాగంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్స్ మరియు అత్యాధునిక ఫీచర్లతో పరిచయం చేసినట్లు కంపెనీ తెలిపింది.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

Mahindra XUV700 ఎస్‌యూవీ ఈ విభాగంలోనే కేవలం 5 సెకన్లలోనే గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే మొట్టమొదటి కారని కూడా కంపెనీ తెలిపింది. ఇది MX మరియు AX అనే రెండు ట్రిమ్‌లలో మొత్తం నాలుగు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. త్వరలోనే, ఇందులో మరిన్ని కొత్త వేరియంట్లను కూడా విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

ఈ ఎస్‌యూవీ 5 సీటర్ మరియు 7 సీటర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ట్రిమ్ లు కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఇందులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్ ను మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

సెమీకండక్టర్ చిప్స్ కొరత; వారం రోజుల పాటు Mahindra ప్లాంట్లలో ఉత్పత్తి బంద్!

అలాగే, ఈ కారు లోని 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ గరిష్టంగా 185 బిహెచ్‌పి పవర్ ను మరియు 420 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. ఈ కారుకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Semiconductor chips shortage mahindra to cut production details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X