తన మొదటి కారు వీడియోను షేర్ చేసిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ [వీడియో]..మీరు చూసారా..!!

ధర్మేంద్ర అని పిలువబడే ధరమ్ సింగ్ డియోల్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత మరియు రాజకీయ నాయకుడు. బాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న యితడు ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. అంటే కాకుండా ప్రధాన నటుడిగా 100 విజయవంతమైన సినిమాలను సాధించిన ప్రపంచంలోని అతికొద్ది మంది నటులలో ధర్మేంద్ర ఒకరు.

తన మొదటి కారు వీడియోను షేర్ చేసిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ [వీడియో]

ధర్మేంద్ర, ప్రముఖ బాలీవుడ్ నటులలో ఒకరు మాత్రమే కాదు, అతను 15 వ లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. ఆయన కుమారుడు సన్నీ డియోల్ ఇప్పుడు లోక్ సభ సభ్యుడు. ప్రముఖ నటుడు ధర్మేంద్ర తన ట్విట్టర్ ఖాతాలో ఒక సాధారణ కారు వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోని మీరు ఇక్కడ గమనించవచ్చు.

తన మొదటి కారు వీడియోను షేర్ చేసిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ [వీడియో]

ధర్మేంద్ర షేర్ చేసిన ఈ వీడియోలో Fiat 1100 (ఫియట్ 1100) కారును చూడవచ్చు. ఈ కారు 60 సంవత్సరాల వయస్సు అని ధర్మేంద్ర వీడియోలో తెలిపారు. ఈ కారు ధర్మేంద్ర యొక్క మొదటి కారు కావడం గమనార్హం. ధర్మేంద్ర ఈ కారును 1960 లో కొనుగోలు చేసినట్లు తెలిపాడు.

తన మొదటి కారు వీడియోను షేర్ చేసిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ [వీడియో]

ధర్మేంద్ర ఈ కారుని అప్పట్లో రూ. 18,000 కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇటీవలి టెలివిజన్ ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి ప్రస్తావించారు. అప్పట్లో అతను కారుని రూ. 18,000 కొన్నట్లు, అది ఆ రోజుల్లో పెద్ద మొత్తం అని చెప్పుకొచ్చారు. ఈ కారు ఇప్పటికి కూడా చాలా కొత్తదిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది వారి మొదటి కారు మరియు ఇష్టమైన కారు కూడా కావడం వల్ల దీనిని చాలా అపురూపంగా చూసుకుంటున్నారు.

తన మొదటి కారు వీడియోను షేర్ చేసిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ [వీడియో]

ఈ కారు 1960 ల మోడల్‌గా కనిపించినప్పటికీ, చాలా కొత్తగా కనిపిస్తుంది. ధర్మేంద్ర ఈ కారును ఎప్పటికీ ఎవరికి అమ్మే అవకాశం ఉండదని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఈ కారు అంటే అతనికి ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు.

తన మొదటి కారు వీడియోను షేర్ చేసిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ [వీడియో]

ఫియట్ 1100 కారు భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. ఇటాలియన్ ఆధారిత ఫియట్ కంపెనీ భారతదేశంలో ప్రాచుర్యం పొందడానికి ఈ కారు కూడా ప్రధాన కారణం. ఈ కారు భారతదేశంలో ఎక్కువమందిని ఆకర్శించడంలో విజయం సాధించింది.

తన మొదటి కారు వీడియోను షేర్ చేసిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ [వీడియో]

అటువంటి ప్రజాదరణ పొందిన ఈ కారు ధర్మేంద్ర మొదటి కారు కావడం నిజంగా గమనార్హం. ఈ కారుపై ఉన్న క్రేజ్ కారణంగా, చాలా మంది ఇప్పటికీ కూడా వీటిని ఉపయోయిస్తున్నారు. ఇది చూడటానికి ఆకర్షణీయంగా మరియు వాహన వినియోగాదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

తన మొదటి కారు వీడియోను షేర్ చేసిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ [వీడియో]

గమనార్హం 1,089 సిసి 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 36 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. ఫియట్ 1100 కారు ముంబైలో ఎక్కువగా టాక్సీగా ఉపయోగించబడింది. పాత వాహనాల వాడకాన్ని నిషేధించిన తరువాత ఫియట్ 1100 కార్లను టాక్సీలుగా ఉపయోగించడం నిలిపివేశారు.

తన మొదటి కారు వీడియోను షేర్ చేసిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ [వీడియో]

నటుడు ధర్మేంద్రకు కార్ల పట్ల మక్కువ ఎక్కువ. వారి గ్యారేజీలో అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇందులో Land Rover Range Rover, Mercedes Benz SL 500 , Mercedes Benz S Class S 550, Porsche 911, Porsche Caynne,Hyundai Santa FE, Audi Q 5, BMW X 6, BMW X 5 మరియు Pajero SFX వంటివి ఉన్నాయి. అయితే ధర్మేంద్ర ఫియట్ 1100 కారుని మాత్రమే తన కుటుంబ సభ్యులలో ఒకరుగా చూస్తారు.

ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుండి పోటీ చేస్తున్నారు మరియు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. సన్నీ డియోల్ నుండి ఇటీవల ఒక సిఫార్సు లేఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయింది. సన్నీ డియోల్ కారు డీలర్‌షిప్‌కు సిఫారసు లేఖ రాశారు.

తన మొదటి కారు వీడియోను షేర్ చేసిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ [వీడియో]

సాధారణంగా రాజకీయ నాయకులు తమకు తెలిసిన వారికి సిఫార్సు లేఖలు ఇస్తారు, లేదా ప్రభుత్వ విభాగాలలో చదువుకోవడానికి అందిస్తారు. అయితే సన్నీ డియోల్ కారును వెంటనే జారీ చేయాలని కార్ల డీలర్‌షిప్‌కు సిఫారసు లేఖ పంపారు. అతను ఇచ్చిన సిఫారసు లేఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో చక్కర్లు కొడుతోంది. మహీంద్రా & మహీంద్రా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన కార్ మోడళ్లలో థార్ ఒకటి. కారు విడుదలైన కొద్దిసేపటికే భారతీయుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ SUV డెలివరీ కోసం చాలా నెలలు వేచి ఉండాలి.

చాలా అవసరమైన ఈ ఎస్‌యూవీని వెంటనే డెలివరీ చేయాలని ఎంపీ సన్నీ డియోల్ సిఫార్సు చేశారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న మహీంద్రా కంపెనీ షోరూమ్‌కు లేఖ రాసారు. సున్నీపూర్ మున్సిపల్ కౌన్సిలర్ దినేష్ సింగ్ ఠాకూర్ కుమార్తె సురభి ఠాకూర్‌కు సన్నీ డియోల్ ఈ లేఖ రాశారు. లేఖలో, సుజాన్ మున్సిపల్ కౌన్సిలర్ కుమార్తె సురభి ఠాకూర్ ప్రాధాన్యతపై వెంటనే థార్ ఎస్‌యూవీని జారీ చేయాలని ఆయన అన్నారు.

Most Read Articles

English summary
Senior bollywood actor dharmendra shares video of his first car details
Story first published: Friday, October 15, 2021, 11:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X