కార్ కంపెనీలకు కలిసిరాని సెప్టెంబర్; పండుగ సీజన్‌పై భారీ అంచనాలు!

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఈ సెప్టెంబర్ నెల కార్ కంపెనీలకు పెద్దగా కలిసిరాలేదు. గత నెలలో కార్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడం, మరోవైపు కస్టమర్లు కూడా రానున్న పండుగ సీజన్ మంచి డీల్స్ లభిస్తాయని వేచి ఉండటంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ 2021లో టాటా, టొయోటా మరియు ఎమ్‌జి కంపెనీలు మినహా మిగిలిన అన్ని కంపెనీల అమ్మకాలు తగ్గాయి.

కార్ కంపెనీలకు కలిసిరాని సెప్టెంబర్; పండుగ సీజన్‌పై భారీ అంచనాలు!

కోవిడ్-19 సంక్షోభం తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన సెమీకండక్టర్ చిప్స్ కొరత ఇప్పుడు భారతీయ ఆటోమొబైల్ కంపెనీలు కూడా వేధిస్తోంది. ఈ పరిస్థితిలో, కార్ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిని బలవంతంగా తగ్గించాల్సి వచ్చింది. ఫలితంగా, కార్ల వెయిటింగ్ పీరియడ్ పెరగడంతో పాటుగా వాటి డెలివరీలు కూడా సకాలంలో జరగడం లేదు. ఈ పరిస్థితులు కూడా కార్ల అమ్మకాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

కార్ కంపెనీలకు కలిసిరాని సెప్టెంబర్; పండుగ సీజన్‌పై భారీ అంచనాలు!

భారతదేశపు అగ్రశ్రేణి కార్ కంపెనీలైన, మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ వంటి సంస్థలు కూడా గడచిన నెల అమ్మకాలలో భారీగా క్షీణతను నమోదు చేశాయి. అయితే, ఇదే సమయంలో, కొన్ని కార్ కంపెనీలు తమ నెలవారీ మరియు వార్షిక అమ్మకాల ఆధారంగా వృద్ధిని నమోదు చేశాయి. సెప్టెంబర్ 2021 లో భారతదేశంలోని టాప్ 10 ఆటోమొబైల్ కంపెనీలు ఎన్ని కార్లను విక్రయించాయో చూద్దాం రండి..!

కార్ కంపెనీలకు కలిసిరాని సెప్టెంబర్; పండుగ సీజన్‌పై భారీ అంచనాలు!

మారుతి మరియు హ్యుందాయ్ పరిస్థితి

సెప్టెంబర్ 2021 నెలలో, అనేక కార్ కంపెనీలు అమ్మకాల్లో క్షీణతను నమోదు చేశాయి. దేశంలోనే మొదటి అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి మరియు రెండవ అతిపెద్ద కార్ల కంపెనీ అయిన హ్యుందాయ్‌ కూడా గత నెల అమ్మకాల్లో తగ్గుదలను చూశాయి. గత నెలలో మారుతి సుజుకి మొత్తం విక్రయాలు 57 శాతం క్షీణించగా హ్యుందాయ్ అమ్మకాలు 34 శాతం మేర క్షీణించాయి. ఈ రెండు కంపెనీల మార్కెట్ వాటా కూడా 34 శాతం మరియు 17.80 శాతానికి తగ్గింది.

కార్ కంపెనీలకు కలిసిరాని సెప్టెంబర్; పండుగ సీజన్‌పై భారీ అంచనాలు!

ఈ టాప్ 10 జాబితాలో మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ కంపెనీల తరువాత, టాటా మోటార్స్ కార్ల విక్రయాలలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 2020 లో టాటా మోటార్స్ మొత్తం 21,199 కార్లను విక్రయించగా, సెప్టెంబర్ 2021 లో కంపెనీ 25,730 కార్లను విక్రయించి 21.37 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే, ఆగస్టు అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో టాటా మోటార్స్ అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ఫలితంగా, టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల మార్కెట్ వాటా 13.84 శాతానికి చేరుకుంది.

కార్ కంపెనీలకు కలిసిరాని సెప్టెంబర్; పండుగ సీజన్‌పై భారీ అంచనాలు!

టాప్ 10 కంపెనీల కార్ల అమ్మకాలు

ఈ అమ్మకాల గణాంకాలను గమనిస్తే, మారుతి సుజుకి సెప్టెంబర్ 2020లో మొత్తం 1,47,912 యూనిట్లను విక్రయించగా, సెప్టెంబర్ 2021లో కేవలం 63,111 యూనిట్లను మాత్రమే విక్రయించి, అమ్మకాలలో 57.3 శాతం క్షీణతను నమోదు చేసింది. ఇదే సమయంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు 50,313 యూనిట్ల నుండి 33,087 యూనిట్లకు తగ్గి 34.2 శాతం క్షీణించాయి.

కార్ కంపెనీలకు కలిసిరాని సెప్టెంబర్; పండుగ సీజన్‌పై భారీ అంచనాలు!

కాగా, గత నెలలో టాటా మోటార్స్ అమ్మకాలు 25,730 యూనిట్లుగా నమోదయ్యాయి. మరోవైపు, కియా మోటార్స్ గత నెలలో 14,441 కార్లు, మహీంద్రా 13,134 కార్లు, టొయోటా 9,284 కార్లు, రెనో 7,326 కార్లు, హోండా 6,765 కార్లు, ఎమ్‌జి మోటార్ ఇండియా 3,241 కార్లు మరియు స్కోడా ఆటో 3,027 కార్లను విక్రయించింది. ఆ తరువాత, నిస్సాన్ గత నెలలో 2,816 కార్లు, ఫోక్స్‌వ్యాగన్ 2,563 కార్లు మరియు జీప్ ఇండియా 1,311 కార్లను విక్రయించింది.

Rank Brand Sep'21 Sep'20 Growth (%)
1 Maruti Suzuki 63,111 1,47,912 -57.3
2 Hyundai 33,087 50,313 -34.2
3 Tata 25,729 21,200 21.4
4 Kia 14,441 18,676 -22.7
5 Mahindra 12,863 14,663 -12.3
6 Toyota 9,284 8,116 14.4
7 Renault 7,326 8,805 -16.8
8 Honda 6,765 10,199 -33.7
9 MG 3,241 2,537 27.7
10 Skoda 3,027 1,312 130.7
11 Nissan 2,816 780 261
12 Volkswagen 2,563 2,026 26.5
13 FCA 1,311 554 136.6
14 Citroen 72 - -
కార్ కంపెనీలకు కలిసిరాని సెప్టెంబర్; పండుగ సీజన్‌పై భారీ అంచనాలు!

ఈ కంపెనీల అమ్మకాలు మాత్రమే పెరిగాయి

సెప్టెంబర్ 2020 తో పోలిస్తే సెప్టెంబర్ 2021 లో కొన్ని కార్ కంపెనీల అమ్మకాలు మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి. వీటిలో టాటా మోటార్స్, టొయోటా కిర్లోస్కర్ మోటార్స్, ఎమ్‌జి మోటార్ ఇండియా, స్కోడా ఆటో, నిస్సాన్, ఫోక్స్‌వ్యాగన్ మరియు జీప్ వంటి కంపెనీలు ఉన్నాయి. అయితే, ఆగస్టు 2021 అమ్మకాలతో పోలిస్తే ఫోక్స్‌వ్యాగన్, జీప్ మరియు సిట్రోయెన్ కంపెనీలు మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి.

కార్ కంపెనీలకు కలిసిరాని సెప్టెంబర్; పండుగ సీజన్‌పై భారీ అంచనాలు!

భారతదేశంలో మొత్తం కార్ల విక్రయ గణాంకాలను పరిశీలిస్తే, సెప్టెంబర్ 2021 లో మొత్తం 1,85,908 కార్లు విక్రయించబడ్డాయి. ఇవి గత సంవత్సరం ఇదే సమయంలో విక్రయించిన 2,92,858 కార్ల తో పోలిస్తే 36.52 శాతం తక్కువగా నమోదయ్యాయి. అలాగే, ఆగస్టు 2021 తో పోలిస్తే సెప్టెంబర్ 2021 లో మొత్తం 74,253 కార్లు అమ్ముడయ్యాయి.

Most Read Articles

English summary
September 2021 car sales in india drop by 36 5 percent details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X