దిలీప్ శెట్టి కొనుగోలుచేసి కొత్త కార్, ఇదే.. చూసారా?

సాధారణంగా సినీ ప్రముఖులకు, క్రికెటర్లకు మరియు ఇతర ప్రముఖులకు వాహనాలంటే చాలా మక్కువ, ఈ కారణంగానే ఎప్పటికప్పుడు మార్కెట్లో విడుదలైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ప్రముఖ కన్నడ టెలివిజన్ యాక్టర్ దిలీప్ శెట్టి సరికొత్త కారును కొనుగోలు చేశారు. ఇప్పుడు నటుడు దిలీప్ శెట్టి తన డ్రీం కారు అయిన 'కియా సెల్టోస్' ను కొనుగోలు చేశారు.

దిలీప్ శెట్టి కొనుగోలుచేసి కొత్త కార్, ఇదే.. చూసారా?

దిలీప్ శెట్టి కొనుగోలు చేసిన ఈ కొత్త కారు ముందు నిలబడి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దిలీప్ శెట్టి కొనుగోలు చేసిన కియా సెల్టోస్ ఎస్‌యూవీ వైట్ కలర్ లో ఉంది. అయితే కియా సెల్టోస్ లో ఏ వేరియంట్ కొన్నారు, అనేదానికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియదు.

దిలీప్ శెట్టి కొనుగోలుచేసి కొత్త కార్, ఇదే.. చూసారా?

దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో కియా సెల్టోస్ ఒకటి. దిలీప్ శెట్టి షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నటుడు దిలీప్ శెట్టి ప్రస్తుతం కస్తూరి నివాస్ అనే సీరియల్‌లో బిజీగా ఉన్నారు. ఇది మాత్రమే కాకూండా ఇతడు విద్యా వినాయక సీరియల్‌లో కూడా నటించారు. యితడు తెలుగు సీరియల్ అయిన కృష్ణ తులసిలో కూడా ప్రధాన పాత్ర పోషించారు.

దిలీప్ శెట్టి కొనుగోలుచేసి కొత్త కార్, ఇదే.. చూసారా?

దిలీప్ శెట్టి కొనుగోలు చేసిన కియా సెల్టోస్ కారు విషయానికొస్తే, ఇది ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉండి, అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో ఈ కారుకి విపరీతమైన ప్రజాదరణ పొందింది. విడుదలైనప్పటి నుండి, సెల్టోస్ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ గా మారింది.

దిలీప్ శెట్టి కొనుగోలుచేసి కొత్త కార్, ఇదే.. చూసారా?

2021 కియా సెల్టోస్ ఇప్పుడు కంపెనీ యొక్క కొత్త లోగో కలిగి ఉంది. ఈ కారులో సాండ్, మడ్ మరియు స్నో అనే మూడు ట్రాక్షన్ సదుపాయాలతో స్టాండర్డ్, ఎకో మరియు స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్‌లను అందుకుంటుంది. ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

దిలీప్ శెట్టి కొనుగోలుచేసి కొత్త కార్, ఇదే.. చూసారా?

సెల్టోస్ 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మరియు 1.4 లీటర్ టర్బో పెట్రోల్ అనే ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలోని 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

దిలీప్ శెట్టి కొనుగోలుచేసి కొత్త కార్, ఇదే.. చూసారా?

అన్ని ఇంజన్లలో స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 1.5-లీటర్ పెట్రోల్ సివిటి, 1.5-లీటర్ డీజిల్ లో ఐవిటి, మరియు 6-స్పీడ్ మాన్యువల్‌తో 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ ట్విన్- క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంటాయి.

దిలీప్ శెట్టి కొనుగోలుచేసి కొత్త కార్, ఇదే.. చూసారా?

కియా సెల్టో యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్‌ విత్ ఈబిడి, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్, హిల్ అసిస్ట్ కంట్రోల్, సేఫ్టీ అలర్ట్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు మరియు మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

దిలీప్ శెట్టి కొనుగోలుచేసి కొత్త కార్, ఇదే.. చూసారా?

సెల్టోస్ యొక్క హై ఎండ్ వేరియంట్లు వాయిస్ కమాండ్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఆటో ఎసి సౌకర్యం, 6 స్టేజ్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, రియర్ ఎసి వెంట్స్ మరియు 37 ఫీచర్స్ కలిగి ఉన్న బ్లూలింక్ సూట్లతో యువిఓ కనెక్ట్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. కియా సెల్టోస్ భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యువి 500, టాటా హారియర్, జీప్ కంపాస్, ఎంజి హెక్టర్, నిస్సాన్ కిక్స్ మరియు రెనాల్ట్ డస్టర్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Serial Actor Dileep Shetty Buys New Kia Seltos. Read in Telugu.
Story first published: Tuesday, July 27, 2021, 17:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X