Skoda Slavia సెడాన్‌లో వేరియంట్ వారీగా లభించే ఇంజన్ ఆప్షన్లు మరియు ఇతర వివరాలు

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India), ఇటీవలే తమ కొత్త మిడ్-సైజ్ సెడాన్ 'స్కోడా స్లావియా' (Skoda Slavia) ను భారత మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి మిడ్-సైజ్ సెడాన్లకు పోటీగా వస్తున్న స్కోడా స్లావియా అమ్మకాలు మార్చి 2022 నుండి ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. ఆ తర్వాతి నెలలో ఈ మోడల్ డెలివరీలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Skoda Slavia సెడాన్‌లో వేరియంట్ వారీగా లభించే ఇంజన్ ఆప్షన్లు మరియు ఇతర వివరాలు

కొత్త స్కోడా స్లావియా సెడాన్ ను కంపెనీ మూడు ట్రిమ్‌లలో అందించనుంది. వీటిలో యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ ట్రిమ్‌లు ఉన్నాయి. ఈ మూడు ట్రిమ్‌లు మొత్తం రెండు రకాల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి. ప్రస్తుతానికి ఈ కారులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు, భవిష్యత్తులో వస్తుందన్న భరోసా కూడా లేదు. ఇక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే, వీటిలో మొదటిది 1 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది 115 బిహెచ్‌పి పవర్ ను మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

Skoda Slavia సెడాన్‌లో వేరియంట్ వారీగా లభించే ఇంజన్ ఆప్షన్లు మరియు ఇతర వివరాలు

ఈ కారులో రెండవ ఇంజన్ ఆప్షన్ అయిన 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్‌ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. స్కోడా ఆటో ఇండియా ఇప్పుడు ఈ కొత్త స్లావియా సెడాన్ యొక్క వేరియంట్ వారీ ఇంజన్ ఆప్షన్ల వివరాలును వెల్లడి చేసింది.

Skoda Slavia సెడాన్‌లో వేరియంట్ వారీగా లభించే ఇంజన్ ఆప్షన్లు మరియు ఇతర వివరాలు

స్కోడా స్లావియాలోని ఏ వేరియంట్‌తో ఏ ఇంజన్ ఆప్షన్ ఇవ్వబడుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. మొత్తం మూడు ట్రిమ్ లలో మొదిటిదైన బేస్-స్పెక్ యాక్టివ్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది కేవలం ఒకేఒక ఇంజన్ ఆప్షన్ తో వస్తుంది. ఇందులో 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. అంతేకాకుండా, ఈ వేరియంట్ లోని ఈ ఇంజన్ ఆప్షన్ కేవలం 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే అందించబడుతుంది.

Variant Active Ambition Style
Powertrains 1-litre TSI MT 1-litre TSI MT & AT 1-litre TSI MT & AT
1.5-litre TSI MT & DSG
Skoda Slavia సెడాన్‌లో వేరియంట్ వారీగా లభించే ఇంజన్ ఆప్షన్లు మరియు ఇతర వివరాలు

ఇక ఇందులో మిడ్-స్పెక్ ట్రిమ్ అయిన యాంబిషన్ వేరియంట్ విషయానికి వస్తే, ఈ వేరియంట్ ను కంపెనీ కేవలం 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ తోనే అందిస్తోంది. కాకపోతే, ఈ వేరియంట్‌లో 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందవచ్చు. కస్టమర్ అవసరాన్ని బట్టి, ఈ గేర్‌బాక్స్ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.

Skoda Slavia 1.0 TSI Skoda Slavia 1.5 TSI
Power (PS) 115PS (+5PS over Rapid) 150PS
Torque (Nm) 178Nm (+3Nm over Rapid) 250Nm
Transmission 6-speed manual / 6-speed torque converter automatic 6-speed manual / 7-speed DSG (dual-clutch)
Skoda Slavia సెడాన్‌లో వేరియంట్ వారీగా లభించే ఇంజన్ ఆప్షన్లు మరియు ఇతర వివరాలు

చివరిగా కొత్త స్కోడా స్లావియా లో మూడవ మరియు టాప్-స్పెక్ ట్రిమ్ అయిన స్టైల్ వేరియంట్ విషయానికి వస్తే, కంపెనీ ఈ కారులో రెండు రకాల ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లను అందించింది. స్లావియా స్టైల్ ట్రిమ్ 1.0 లీటర్ టిఎస్ఐ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఇంజన్లతో, కంపెనీ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను అందిస్తోంది.

Skoda Slavia సెడాన్‌లో వేరియంట్ వారీగా లభించే ఇంజన్ ఆప్షన్లు మరియు ఇతర వివరాలు

స్కోడా కుషాక్ తర్వాత స్లావియా సెడాన్ కంపెనీ యొక్క ఇండియా 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా వస్తున్న రెండవ మోడల్. స్కోడా ఈ కారును ప్రత్యేకించి భారతదేశం కోసం స్థానికంగా అభివృద్ధి చేసిన MQB A0 IN ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని ఓవరాల్ డిజైన్ ఇటీవల అప్‌డేట్ చేయబడిన ఆక్టావియా మరియు సూపర్బ్ వంటి పెద్ద సెడాన్‌ల నుండి ప్రేరణ పొంది రూపొందించినట్లుగా అనిపిస్తుంది. ఈ కొత్త స్కోడా స్లావియా సెడాన్, ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ర్యాపిడ్ సెడాన్ కంటే పెద్దదిగా ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, November 26, 2021, 9:51 [IST]
English summary
Skoda auto india reveales slavia sedan variant wise features engine specs details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+