Kushaq కి పెరుగుతున్న క్రేజ్.. ఆగస్ట్ నెలలో Skoda అమ్మకాలు భేష్..

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ Skoda Auto, గడచిన ఆగస్టు 2021 నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, గత నెలలో కంపెనీ అమ్మకాలు ఏకంగా 282 శాతం వృద్ధి చెందాయి. ఈ బ్రాండ్ నుండి తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఎస్‌యూవీ Skoda Kushaq అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో, కంపెనీ ఈ గణనీయమైన వృద్ధిని సాధించగలిగింది.

Kushaq కి పెరుగుతున్న క్రేజ్.. ఆగస్ట్ నెలలో Skoda అమ్మకాలు భేష్..

ఆగస్ట్ 2020 లో Skoda Auto India మొత్తం అమ్మకాలు 1,003 యూనిట్లు మాత్రమే నమోదయ్యాయి. కాగా, ఆగస్ట్ 2021 లో ఇవి 3,829 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 282 శాతం పెరిగాయి. గత నెల మొత్తం అమ్మకాలలో Skoda Kushaq అమ్మకాలే 70 శాతం ఉన్నట్లు కంపెనీ వివరించింది.

Kushaq కి పెరుగుతున్న క్రేజ్.. ఆగస్ట్ నెలలో Skoda అమ్మకాలు భేష్..

Skoda Auto విడుదల చేసిన సమాచారం ప్రకారం, గత నెల మొత్తం అమ్మకాలలో 2,700 యూనిట్ల Skoda Kushaq ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. నెలవారీ అమ్మకాల పరంగా చూసుకుంటే, జూలై 2021 లో, కంపెనీ 3,080 యూనిట్లను విక్రయించగా, ఆగస్ట్ 2021 లో 3,829 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంతో పోలిస్తే కంపెనీ నెలవారీ అమ్మకాలు 24 శాతం పెరుగుదలను కనబరిచాయి.

Kushaq కి పెరుగుతున్న క్రేజ్.. ఆగస్ట్ నెలలో Skoda అమ్మకాలు భేష్..

గత నెలలో Skoda Auto విక్రయాలలో Kushaq SUV కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం Skoda Kushaq ఎస్‌యూవీ కోసం సుమారు రెండు నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోందని, ఈ మోడల్ కోసం ఇప్పటి వరకూ 6,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ తెలిపింది.

Kushaq కి పెరుగుతున్న క్రేజ్.. ఆగస్ట్ నెలలో Skoda అమ్మకాలు భేష్..

భారత మార్కెట్లో Skoda Kushaq యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు ట్రిమ్ లలో మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు రూ. 10.49 లక్షల నుండి రూ. 17.59 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ఇది 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

Kushaq కి పెరుగుతున్న క్రేజ్.. ఆగస్ట్ నెలలో Skoda అమ్మకాలు భేష్..

ప్రస్తుతానికి ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు మరియు భవిష్యత్తులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ ను పరిచయం చేసే అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. ఈ ఎస్‌యూవీలోని 1.0-లీటర్, 3-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Kushaq కి పెరుగుతున్న క్రేజ్.. ఆగస్ట్ నెలలో Skoda అమ్మకాలు భేష్..

అలాగే, ఇందులోని 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా మాన్యువల్, ఆటోమేటిక్ మరియు డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.

Kushaq కి పెరుగుతున్న క్రేజ్.. ఆగస్ట్ నెలలో Skoda అమ్మకాలు భేష్..

ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఈఎస్‌సి, హిల్-హోల్డ్ కంట్రోల్, రెయిన్ అండ్ లైట్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

స్కోడా కుషాక్ దాని విభాగంలో సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలువనుంది. అన్ని ఇతర ఆధునిక స్కోడా కార్ల మాదిరిగానే, కంపెనీ కుషాక్‌ను అగ్రశ్రేణి సేఫ్టీ ఫీచర్స్ తో లోడ్ చేసింది. స్కోడా కుషాక్ ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు రియర్ పార్కింగ్ కెమెరా మరియు మల్టీ-కొలిషన్ బ్రేక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Kushaq కి పెరుగుతున్న క్రేజ్.. ఆగస్ట్ నెలలో Skoda అమ్మకాలు భేష్..

డిజన్ పరంగా చూసుకుంటే, Skoda Kushaq లో ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్, పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు నిటారుగా ఉండే బోనెట్, వెనుక భాగంలో సన్నటి ఎల్ఈడి టెయిల్ లైట్స్, రూఫ్ స్పాయిల్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్, పెద్ద రియర్ బంపర్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ మరియు సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Kushaq కి పెరుగుతున్న క్రేజ్.. ఆగస్ట్ నెలలో Skoda అమ్మకాలు భేష్..

కొత్త అప్‌డేటెడ్ Skoda Kodiaq వస్తోంది..

ఇదిలా ఉంటే, Kushaq (కుషాక్) లాంచ్ తర్వాత కంపెనీ తమ అప్‌డేటెడ్ Kodiaq (కొడియాక్) ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త 2021 Skoda Kodiaq అప్‌డేటెడ్ డిజైన్, ఇంజన్ మరియు ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. - దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda auto india sold 3829 cars in august details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X