Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మార్కెట్లో కొత్త 2021 స్కొడా సూపర్బ్ విడుదల: ధర, ఫీచర్లు
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో, భారత మార్కెట్లో తమ సరికొత్త 2021 సూపర్బ్ సెడాన్‌ను విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త (2021) స్కొడా సూపర్బ్ ధర రూ.31.99 లక్షల, ఎక్స్-షోరూమ్ (ఇండియా) నుండి ప్రారంభం అవుతుంది. ఈ కొత్త మోడల్‌లో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా అనేక అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

కొత్త 2021 స్కొడా సూపర్బ్ ప్రీమియం సెడాన్ స్పోర్ట్ లైన్ మరియు లౌరిన్ అండ్ క్లెమెంట్ (ఎల్ అండ్ కె) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్-ఎండ్ ఎల్ అండ్ కె వేరియంట్ ధర రూ.34.99 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

ఈ కొత్త మోడల్ సూపర్బ్‌లో చేసిన అప్‌డేట్స్ విషయానికి వస్తే, ఇందులో అధునాతన అడాప్టివ్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లను ఉపయోగించారు. ఇవి ఇప్పుడు స్కొడా డైనమిక్ హెడ్‌ల్యాంప్ ఇన్‌క్లినేషన్ కంట్రోల్, స్వివ్లింగ్ అండ్ కార్నరింగ్ ఫంక్షన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఫీచర్ల కారణంగా, హెడ్‌ల్యాంప్స్ వాతావరణాన్ని/సమయాన్ని బట్టి ఆటోమేటిక్‌గా ఆన్/ఆఫ్ కావటమే కాకుండా వంపు దారుల్లో ప్రయాణించేటప్పుడు అన్ని వైపులా కాంతి ప్రసరించేలా ఆటోమేటిక్‌గా ప్రొజెక్ట్ అవుతాయి.
MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి

కొత్త 2021 స్కొడా సూపర్బ్‌లోని హెడ్‌ల్యాంప్‌లు ఇంటర్‌సిటీ, మోటర్‌వే మరియు రెయిన్ అనే మూడు మోడ్స్‌ని కలిగి ఉంటాయి. ఇందులోని టర్న్ ఇండికేటర్స్ కూడా స్టాండర్డ్‌గా కలిగి ఉంటాయి. ఇవి కాకుండా ఎక్స్టీరియర్ డిజైన్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ లేవు. దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, 2021 మోడల్ స్కొడా సూపర్బ్ ఇప్పుడు ‘వర్చువల్ కాక్‌పిట్'ను కలిగి ఉంటాయి. ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది బిల్ట్ ఇన్ నావిగేషన్ మరియు వాయిస్ కమాండ్స్‌ను కూడా కలిగి ఉంటుంది.
MOST READ:డాకర్ ర్యాలీ 2021 ఫైనల్ స్టేజ్ ఫలితాలు వచ్చేశాయ్.. ర్యాలీ ఛాంపియన్ ఎవరో తెలుసా..!

ఇంకా ఇందులో 360 డిగ్రీ కెమెరా, టైప్-సి యుఎస్‌బి పోర్ట్‌లు, త్రీ-స్పోర్ట్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్‌లతో కూడిన అల్కాంటారా సీట్స్ (స్పోర్ట్‌లైన్‌లో) మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎల్ అండ్ కె వేరియంట్‌లో బేజ్ కలర్ అప్‌హోలెస్ట్రీ, పియానో-బ్లాక్ ఎలిమెంట్స్ మరియు క్రోమ్ ఇన్సెర్ట్స్‌తో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

పైన పేర్కొన్న కాస్మెటిక్/ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా కొత్త 2021 స్కొడా సూపర్బ్ స్పోర్ట్‌లైన్ మరియు ఎల్ అండ్ కె వేరియంట్లలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇదివరకటి స్కొడా సూపర్బ్ కారులో ఉపయోగించిన ఇంజన్లనే ఇందులోనూ యధావిధిగా ఉపయోగించారు.
స్కొడా సూపర్బ్ ప్రీమియం సెడాన్‌లో 2.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ సెవన్-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
MOST READ:ఇంటెర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఇప్పుడు వెరీ సింపుల్.. ఇలా చేయండి

ఈ కొత్త 2021 స్కొడా సూపర్బ్ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా స్కొడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ.. సూపర్బ్ సెడాన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుండి, ఇది దాని విభాగంలో కొత్త బెంచ్ మార్కులను ఏర్పాటు చేస్తోందని అన్నారు.
స్కొడా సూపర్బ్ దాని సొగసైన డిజైన్, విలాసవంతమైన ఇంటీరియర్స్, విశాలమైన క్యాబిన్ స్పేస్‌తో విలువకు తగిన విలాసాన్ని అందిస్తుందని, రిఫ్రెష్ చేసిన కొత్త 2021 స్కొడా సూపర్బ్ మరిన్ని ఆధునిక అప్‌డేట్స్‌తో, మరింత ఆకర్షణీయంగా ఉంటుందని, ఇది అందరిచేత ప్రశంసించబడుతుందని హోలిస్ వ్యాఖ్యానించారు.