స్కొడా ర్యాపిడ్ కథ ముగిసినట్లే; దాని స్థానంలో కొత్త సి-సెగ్మెంట్ సెడాన్ వస్తోంది!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో, ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న ర్యాపిడ్ సెడాన్‌లో మొదటి తరం (ఫస్ట్ జనరేషన్) మోడల్‌ను తొలిసారిగా 2011లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ తర్వాత ఈ కారును కేవలం ఒక్కసారి మాత్రమే కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది.

స్కొడా ర్యాపిడ్ కథ ముగిసినట్లే; దాని స్థానంలో కొత్త సి-సెగ్మెంట్ సెడాన్ వస్తోంది!

అప్పటి నుండి ఈ మోడల్‌లో ఎలాంటి మేజర్ అప్‌గ్రేడ్స్ చేయలేదు. ఫోక్స్‌వ్యాగన్ వెంటో ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ స్కొడా రాపిడో సెడాన్‌ను తయారు చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లోని ఇతర మోడళ్లతో పోల్చుకుంటే రాపిడో అమ్మకాల పరంగా కూడా చాలా వెనుకబడి ఉంది.

స్కొడా ర్యాపిడ్ కథ ముగిసినట్లే; దాని స్థానంలో కొత్త సి-సెగ్మెంట్ సెడాన్ వస్తోంది!

ఈ నేపథ్యంలో, స్కొడా తమ ర్యాపిడో సెడాన్‌కు స్వస్తి పలకాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్కొడా ర్యాపిడ్ సెడాన్‌కి ఎగువన ఓ సి-సెగ్మెంట్ సెడాన్‌ను విడుదల చేస్తామని స్కోడా ఆటో ఇండియా సేల్స్, సర్వీస్, మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోలిస్‌ తెలిపారు.

MOST READ:జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

స్కొడా ర్యాపిడ్ కథ ముగిసినట్లే; దాని స్థానంలో కొత్త సి-సెగ్మెంట్ సెడాన్ వస్తోంది!

స్కొడా ర్యాపిడ్ సెడాన్ గురించి ట్విట్టర్ వేదికగా ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ఈ ఏడాది చివరినాటికి ఓ సరికొత్త సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేస్తామని, అది ప్రస్తుత ర్యాపిడ్ సెడాన్ కన్నా పెద్దదిగా ఉంటుందని మరియు ర్యాపిడ్‌కు ఎగువన ఈ మోడల్‌ను ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.

స్కొడా ర్యాపిడ్ కథ ముగిసినట్లే; దాని స్థానంలో కొత్త సి-సెగ్మెంట్ సెడాన్ వస్తోంది!

గడచిన డిసెంబర్ 2020 నెలలో కూడా జాక్ హోలిస్ ఇదే విషయం గురించి ట్విట్టర్‌లో స్పందించారు. భారత్ కోసం కొత్త ర్యాపిడ్‌ను తీసుకురాబోమని, 2021 సంవత్సరం చివరి నాటికి ఓ సరికొత్త సెడాన్‌ను విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

MOST READ:భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!

స్కొడా ర్యాపిడ్ కథ ముగిసినట్లే; దాని స్థానంలో కొత్త సి-సెగ్మెంట్ సెడాన్ వస్తోంది!

అంతేకాకుండా, ఈ కొత్త సెడాన్‌ను బ్రాండ్ యొక్క ఎమ్‌క్యూబి ఏఓ ఇన్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేస్తామని, దీనిని కేవలం టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్లతోనే విడుదల చేస్తామని, ఈ ఇంజన్లు మరింత సమర్థవంతమైనవి మరియు శక్తివంతమైనవనిగా ఉంటాయని హోలిస్ అన్నారు.

స్కొడా ర్యాపిడ్ కథ ముగిసినట్లే; దాని స్థానంలో కొత్త సి-సెగ్మెంట్ సెడాన్ వస్తోంది!

స్కొడా ఆటో గతంలో 'స్లావియా' అనే ఓ కొత్త పేరును కూడా ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ చేసింది. స్కొడా నుండి కొత్తగా రాబోయే సి-సెగ్మెంట్ సెడాన్‌కు ఈ కొత్త పేరును పెట్టవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కారును ఏఎన్‌బి అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ కొనుగోలు చేసిన సినీ నటి భావన

స్కొడా ర్యాపిడ్ కథ ముగిసినట్లే; దాని స్థానంలో కొత్త సి-సెగ్మెంట్ సెడాన్ వస్తోంది!

స్కొడా ర్యాపిడ్‌తో పోలిస్తే కొత్త సి-సెగ్మెంట్ సెడాన్‌లో అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలు లభించే అవకాశం ఉంది. వీటిలో పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు కనెక్ట్-కార్ టెక్నాలజీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉండవచ్చు.

స్కొడా ర్యాపిడ్ కథ ముగిసినట్లే; దాని స్థానంలో కొత్త సి-సెగ్మెంట్ సెడాన్ వస్తోంది!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్కొడా ర్యాపిడ్‌లో 1.0-లీటర్, త్రీ సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ టిఎస్‌ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

MOST READ:ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

స్కొడా ర్యాపిడ్ కథ ముగిసినట్లే; దాని స్థానంలో కొత్త సి-సెగ్మెంట్ సెడాన్ వస్తోంది!

అయితే, స్కొడా నుండి కొత్తగా రాబోయే సి-సెగ్మెంట్ సెడాన్‌లో మరింత శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ ఉంటుందని హోలిస్ తెలిపారు. కాబట్టి, ఈ కారులో ర్యాపిడ్‌లోని ఇంజన్లను ఉపయోగించే అవకాశం లేదు. ఇందులో 1.5-లీటర్, ఫోర్ సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించవచ్చు.

స్కొడా ర్యాపిడ్ కథ ముగిసినట్లే; దాని స్థానంలో కొత్త సి-సెగ్మెంట్ సెడాన్ వస్తోంది!

ఇదిలా ఉంటే, స్కొడా ఆటో భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త ఎస్‌యూవీని ఈనెల మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. స్కొడా కుషాక్ పేరుతో వస్తున్న ఈ ఎస్‌యూవీని కంపెనీ మార్చి 18న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Auto To Launch New C-Segment Sedan By The End Of This Year, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X