భారీగా పెరిగిన Skoda 2021 నవంబర్ సేల్స్: కారణం అదే

ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda) ఇటీవల 2021 నవంబర్ అమ్మకాల ఇవేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం, కంపెనీ గత నెలలో మొత్తం 2,196 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. అయితే ఇదే నెల మునుపటి సంవత్సరం కేవలం 1,056 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు మునుపటికంటే కూడా ఏకంగా 108 శాతం వృద్ధిని నమోదు చేసింది.

భారీగా పెరిగిన Skoda 2021 నవంబర్ సేల్స్: కారణం అదే

స్కోడా యొక్క మొత్తం అమ్మకాలలో ఒక్క స్కోడా కుషాక్ మాత్రమే 2,300 యూనిట్ల అమ్మకాలను పొందింది. కంపెనీ యొక్క అమ్మకాలు పెరగడానికి ఈ కుషాక్ SUV ప్రధాన పాత్ర వహించింది. కంపెనీ తన ఉనికిని విస్తరాయించడంలో భాగంగానే కొత్త కొత్త సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

భారీగా పెరిగిన Skoda 2021 నవంబర్ సేల్స్: కారణం అదే

స్కోడా ఇటీవల చెన్నై, హైదరాబాద్, పాండిచ్చేరి మరియు సికింద్రాబాద్ వంటి ప్రధాన నగరాలలో తమ కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. స్కోడా యొక్క కొత్త మోడళ్లకు దేశీయ మార్కెట్లో మంచి స్పందన వస్తోంది. ఈ కారణంగానే తన నెట్‌వర్క్‌ను చాలా వేగంగా విస్తరిస్తోంది.

కంపెనీ యొక్క అమ్మకాలు గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణం స్కోడా కుషాక్. స్కోడా కుషాక్ యొక్క అన్ని వేరియంట్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. కావున మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ కారణంగా కంపెనీ అమ్మకాలు చాలా వరకు పెరిగాయి.

భారీగా పెరిగిన Skoda 2021 నవంబర్ సేల్స్: కారణం అదే

ప్రస్తుత ఆటో మొబైల్ పరిశ్రమ సెమికండక్టర్ చిప్ కొరతతో సతమతమవుతోంది. ఇది కంపెనీ యొక్క ఉత్పత్తులను మరియు అమ్మకాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. స్కోడా ఆటో ఇండియా ఈ ఏడాది భారతదేశంలో 30,000 కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాకుండా వచ్చే 2022 చివరి నాటికి భారతదేశంలో 60,000 కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

భారీగా పెరిగిన Skoda 2021 నవంబర్ సేల్స్: కారణం అదే

స్కోడా ఆటో సెడాన్లు మరియు SUVలతో భారతీయ మార్కెట్లో బలమైన పట్టును కొనసాగిస్తోంది. దీనితో పాటు కొత్త స్లావియా కూడా ఇటీవల దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడింది. కంపెనీ ఈ సంవత్సరం భారతదేశంలో రెండు కొత్త కార్లను విడుదల చేసింది, ఇందులో ఒకటి కొత్త స్కోడా ఆక్టావియా కాగా, మరొకటి స్కోడా కుషాక్ SUV ఉన్నాయి.

భారీగా పెరిగిన Skoda 2021 నవంబర్ సేల్స్: కారణం అదే

అయితే ఇటీవల కాలంలో కంపెనీ కొత్త స్కోడా స్లావియా సెడాన్ ఆవిష్కరించింది. ఈ సెడాన్ కోసం చాలామంది వాహన ప్రియులు ఎదురు చూస్తున్నారు. స్కోడా కంపెనీ తాజా సమాచారం ప్రకారం కొత్త మోడళ్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను తగ్గించే అవకాశం ఉంటుంది. వాటి స్థానంలో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది.

భారీగా పెరిగిన Skoda 2021 నవంబర్ సేల్స్: కారణం అదే

స్కోడా స్లావియా దేశీయ మార్కెట్లో అధికారికంగా విసుద్ధలైన తరువాత, డెలివరీ 2022 ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీ తన కొత్త స్కోడా స్లావియా సెడాన్‌ను ప్రతి నెలా 3,000 నుండి 4,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారీగా పెరిగిన Skoda 2021 నవంబర్ సేల్స్: కారణం అదే

స్కోడా స్లావియా మొత్తం మూడు ట్రిమ్‌లలో అందించబడుతుంది. అవి యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్. కంపెనీ ఈ కారుని మొత్తం 5 కలర్స్ ఆప్సన్స్ లో అందిస్తుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్.

భారీగా పెరిగిన Skoda 2021 నవంబర్ సేల్స్: కారణం అదే

కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

భారీగా పెరిగిన Skoda 2021 నవంబర్ సేల్స్: కారణం అదే

స్కోడా స్లావియా MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సెడాన్. దీని డిజైన్ ఇటీవల అప్‌డేట్ చేయబడిన ఆక్టావియా వంటి సెడాన్‌ల నుండి ప్రేరణ పొందింది. కొత్త స్కోడా స్లావియా కంపెనీ ప్రస్తుత ర్యాపిడ్ మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది. కావున దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

భారీగా పెరిగిన Skoda 2021 నవంబర్ సేల్స్: కారణం అదే

ఈ సెడాన్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ సెడాన్‌లో కంపెనీ సిగ్నేచర్ బటర్‌ఫ్లై ఆకారపు ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్ అందించింది. అంతే కాకుండా ఇందులో ఎల్-షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ రీసెస్‌ను కూడా పొందుతుంది. ఈ కారు యొక్క ORVMలపై టర్న్ ఇండికేటర్లను మరియు సైడ్ బాడీలో లైనింగ్‌ను పొందుతుంది.

భారీగా పెరిగిన Skoda 2021 నవంబర్ సేల్స్: కారణం అదే

కంపెనీ ఇంతకుముందే ఈ స్లావియా సెడాన్ యొక్క ఇంటీరియర్‌ను కూడా అప్‌డేట్ చేసింది. ఇది ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని క్యాబిన్‌ను డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో పరిచయం చేసింది, ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు అపోల్స్ట్రే కూడా డ్యూయల్-టోన్‌లో ఉంచబడ్డాయి.

భారీగా పెరిగిన Skoda 2021 నవంబర్ సేల్స్: కారణం అదే

కొత్త స్కోడా స్లావియా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని భావిస్తున్నాము. భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త స్లావియా హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 2, 2021, 11:19 [IST]
English summary
Skoda car sales november 2021 kushaq details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+