మరో 5 ఏళ్ల వరకూ భారత్‌లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయటం అసాధ్యం : Skoda

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటి వరకూ కేవలం పెట్రోల్, డీజిల్ కార్లను మాత్రమే తయారు చేస్తూ వచ్చిన ఆటోమొబైల్ కంపెనీలు, ఇప్పుడు వాటితో పాటుగా ఎలక్ట్రిక్ కార్లను కూడా తయారు చేస్తున్నాయి. భూమిలో పెట్రోల్ డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు అంతరించిపోతుండటంతో కార్ మేకర్లు ఎలక్ట్రిక్ పవర్ వైపు దృష్టి సారిస్తున్నాయి.

మరో 5 ఏళ్ల వరకూ భారత్‌లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయటం అసాధ్యం : Skoda

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లే రాజ్యమేలనున్నాయి. అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఎటు చూసినా ఎలక్ట్రిక్ కార్లు కనిపిస్తున్నాయి. మనదేశంలో కూడా ప్రజలు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్ల వైపు ఆకర్షితులు అవుతున్నారు. కార్ల తయారీ సంస్థలు కూడా క్రమక్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పట్ల ఆసక్తి చూపుతున్నాయి.

మరో 5 ఏళ్ల వరకూ భారత్‌లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయటం అసాధ్యం : Skoda

ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ప్రతి ఆటోమొబైల్ కంపెనీ కూడా ఇక్కడి మార్కెట్లో ఓ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే, ఈ విషయంలో చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ Skoda మాత్రం వెనుకంజ వేస్తోంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తాము గమనిస్తూనే ఉన్నామని, కాకపోతే ఇప్పట్లో తాము ఈ విభాగంలోకి ప్రవేశించేది లేదని కంపెనీ పేర్కొంది.

మరో 5 ఏళ్ల వరకూ భారత్‌లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయటం అసాధ్యం : Skoda

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలనే ప్లాన్‌ను మరో ఐదేళ్ల పాటు పక్కన పెట్టేస్తున్నామని Skoda Auto India బ్రాండ్ డైరెక్టర్ Zac Hollis తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆయన చేసిన ట్వీట్ ప్రకారం, "అవును మేము భారతదేశానికి ఒక EV ని తీసుకువస్తాము, అయితే ఎప్పుడనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ, రాబోయే 5 సంవత్సరాలలో మాత్రం ఇది అసంభవం" అని పేర్కొన్నారు.

మరో 5 ఏళ్ల వరకూ భారత్‌లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయటం అసాధ్యం : Skoda

Skoda ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసిన Enyaq-iV (ఎనియాక్ ఐవి), అక్కడి మార్కెట్లలో అత్యుత్తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటిగా పరిగణించబడుతున్నప్పటికీ, కంపెనీ దీనిని భారతదేశంలో విడుదల చేయడానికి విముఖత చూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మరో 5 ఏళ్ల వరకూ భారత్‌లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయటం అసాధ్యం : Skoda

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసే విషయంలో Skoda మరియు Volkswagen సంస్థలు దూకుడుగా వ్యవహరించకుండా, ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నాయి. ఇందుకోసం Volkswagen ఇప్పటికే మనదేశంలో గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ యొక్క సాధ్యాసాధ్యాలను నిశితంగా అధ్యయనం చేస్తుంది.

మరో 5 ఏళ్ల వరకూ భారత్‌లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయటం అసాధ్యం : Skoda

Volkswagen భారతదేశంలో తమ స్వంత EV లను ప్రారంభించడానికి ముందు, ఇక్కడి మార్కెట్లో ఇతర బ్రాండ్ల యొక్క EV ల అమ్మకాల ధోరణిని నిశితంగా గమనించనుంది. ఈ సంస్థ గ్లోబల్ EV ప్లాన్‌తో పోల్చుకుంటే, భారత EV ప్లాన్ పూర్తిగా భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే Volkswagen ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లలో Tesla కి పోటీగా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టేందుకు దూకుడుగా ప్లాన్ చేస్తోంది.

మరో 5 ఏళ్ల వరకూ భారత్‌లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయటం అసాధ్యం : Skoda

ప్రస్తుతం, భారతదేశంలో Skoda బ్రాండ్ యొక్క ప్రోడక్ట్ లైనప్‌లో మూడు సెడాన్‌లు మరియు ఒక ఎస్‌యూవీ ఉన్నాయి. అవి: Rapid, Octavia, Superb మరియు Kushaq. ఒకవేళ మీరు Karoq ఎస్‌యూవీ ఏమైందని ఆశ్చర్యపోతున్నట్లయితే, ఈ చెక్ రిపబ్లిక్ బ్రాండ్ సైలెంట్‌గా ఈ ఎస్‌యూవీని భారత మార్కెట్ నుండి తొలగించి వేసింది. ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ మోడల్ కనిపించడం లేదు.

మరో 5 ఏళ్ల వరకూ భారత్‌లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయటం అసాధ్యం : Skoda

తాజాగా Skoda నుండి వచ్చిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ Kushaq కు భారత మార్కెట్ నుండి మంచి ఆదరణ లభించింది. అంతేకాదు, భారతదేశంలో ఈ బ్రాండ్ చరిత్రలోనే ఇది ఒక కీలకమైన లాంచ్ గా గుర్తించవచ్చు. ఇతర ఆటోమోటివ్ ఔత్సాహికుల మాదిరిగానే మేము కూడా Skoda బ్రాండ్ నుండి రాబోయే ఎలక్ట్రిక్ కారు కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము.

మరో 5 ఏళ్ల వరకూ భారత్‌లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయటం అసాధ్యం : Skoda

ఈ విషయంపై Volkswagen India బ్రాండ్ డైరెక్టర్ Ashish Gupta ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. భారతదేశంలో 2025-26 నాటికి తమ గ్రూపు నుండి ఓ ఎలక్ట్రిక్ వాహనం వస్తుందని భావిస్తున్నానని, మనదేశంలో ఇప్పటికే పలు కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడం చూస్తున్నామని అన్నారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల యొక్క మొదటి దశ ప్రారంభమైందని, ఇది ఎక్కువగా టూవీలర్లు మరియు నాలుగు చక్రాల వాహనాల రూపంలో ఉందని చెప్పారు.

మరో 5 ఏళ్ల వరకూ భారత్‌లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయటం అసాధ్యం : Skoda

ఇంకా ఆయన మాట్లాడుతూ.. రాబోయే మూడు లేదా నాలుగు సంవత్సరాలలో, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రెండవ దశ ప్రారంభమవుతుందని, ఆ సమయంలో ఎలక్ట్రిక్ టూవీలర్ల నుండి ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల వరకూ మనం చూడవచ్చని అన్నారు. ఈ ట్రెండ్ ఇప్పటికే పలు దేశాల్లో ఉందని, చైనా వంటి ఇతర పోల్చదగిన పెద్ద ఆర్థిక వ్యవస్థలను చూస్తే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు వాణిజ్య వాహనాల ద్వారా ఇవి విద్యుదీకరణకు ఆజ్యం పోశాయని అన్నారు.

మరో 5 ఏళ్ల వరకూ భారత్‌లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయటం అసాధ్యం : Skoda

Audi మరియు Porsche వంటి ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్లు Volkswagen గ్రూప్ కిందకు వచ్చినప్పటికీ, భారతదేశంలో చవకైన ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టేందుకు ఈ సంస్థ ఇంకా సంశయంలోనే ఉంది. ప్రస్తుతం మన దేశంలో Audi బ్రాండ్ అందిస్తున్న ఎలక్ట్రిక్ కారును కొనాలంటే, సుమారు ఒక కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda has no plans to launch ev in india at least for next 5 years details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X