Skoda Karoq ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పుల్ డీటైల్స్

ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda) ఎట్టకేలకు తన కొత్త SUV అయిన స్కోడా కరోక్ ఫేస్‌లిఫ్ట్ అధికారికంగా మార్కెట్లో ఆవిష్కరించింది. స్కోడా కరోక్ దేశీయ మార్కెట్లో ప్రారంభించబడిన నాలుగు సంవత్సరాల తరువాత కరోక్ ఫేస్‌లిఫ్ట్ మొదటిసారిగా ఆవిష్కరించబడింది. ఈ కొత్త కరోక్ ఫేస్‌లిఫ్ట్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Skoda Karoq ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పుల్ డీటైల్స్

స్కోడా కంపెనీ యొక్క అత్యధిక అమ్మకాలకు దోహదపడిన SUV లలో స్కోడా కరోక్ ఒకటి. 2020 నుండి ఇది మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. స్కోడా కంపెనీ యొక్క అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ గా కూడా కరోక్ ప్రసిద్ధి చెందింది. ఇది అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

Skoda Karoq ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పుల్ డీటైల్స్

కొత్త కరోక్ ఫేస్‌లిఫ్ట్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,382 మిమీ నుండి 4,390 మిమీకి పెంచబడింది, అయితే ఎత్తు మరియు వెడల్పు పాత మోడల్‌ మాదిరిగానే అలాగే ఉంచబడ్డాయి. అంతే కాకుండా ఫ్రంట్-వీల్ డ్రైవ్ మోడల్ వీల్‌బేస్ 2,638 మిమీ కాగా, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ 2,630 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Skoda Karoq ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పుల్ డీటైల్స్

కొత్త స్కోడా కరోక్ ఫేస్‌లిఫ్ట్ మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్. అయితే కంపెనీ త్వరలో ఇందులో దాని స్పోర్ట్‌లైన్ వేరియంట్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంటుంది. కరోక్ ఫేస్‌లిఫ్ట్ ఆధునిక స్టైల్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Skoda Karoq ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పుల్ డీటైల్స్

కొత్త స్కోడా కరోక్ ఫేస్‌లిఫ్ట్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది మునుపటికంటే కూడా వెడల్పుగా మరియు షట్కోణ ఆకారంలో ఉన్న కొత్త గ్రిల్ మరియు తక్కువ గాలిని తీసుకునే కొత్త బంపర్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది ప్రస్తుత మోడల్ కంటే సన్నని డిజైన్‌తో కొత్త LED టెయిల్‌లైట్‌లను కూడా పొందుతుంది. ఇందులో 19 ఇంచెస్ బ్లాక్ ప్లాస్టిక్ వింగ్స్ తో కొత్త అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి. వెనుక విండో పక్కన ఫ్లాప్‌లు మరియు కొత్త రియర్ స్పాయిలర్ కూడా ఉన్నాయి.

Skoda Karoq ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పుల్ డీటైల్స్

ఇక ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో పెద్దగా మార్పు లేదు. కొత్త కరోక్‌లోని డ్యాష్‌బోర్డ్ మరియు సీట్లు పాత మోడల్‌లోనే ఉంటాయి. అయితే, స్కోడా కరోక్ లోపల డిస్‌ప్లే యూనిట్‌లను అప్‌గ్రేడ్ చేసింది.

Skoda Karoq ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పుల్ డీటైల్స్

ఇందులో పెద్ద 10.25 ఇంచెస్ స్క్రీన్‌కి అప్‌గ్రేడ్ చేయడానికి 8 ఇంచెస్ స్టాండర్డ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ను పొందుతుంది. ఈ 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను 9.2 ఇంచెస్ సిస్టమ్‌కు కూడా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో లారా యొక్క డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ 15 భాషలను అర్థం చేసుకోగలదు. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది.

Skoda Karoq ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పుల్ డీటైల్స్

ఈ కొత్త స్కోడా కరోక్ ఫేస్‌లిఫ్ట్ స్మార్ట్‌లింక్ టెక్నాలజీతో పాటు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ద్వారా వైర్‌లెస్‌గా స్మార్ట్‌ఫోన్‌లను కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్ధరిస్తాయి.

Skoda Karoq ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పుల్ డీటైల్స్

ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, అడాప్టివ్ డిస్టెన్స్ అసిస్ట్, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్, ట్రాఫిక్ జామ్‌ల కోసం స్టార్ట్-స్టాప్ ఫంక్షన్‌తో యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, వాహన స్టేటస్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటివివ్ అందుబాటులో ఉంటాయి.

Skoda Karoq ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పుల్ డీటైల్స్

స్కోడా కరోక్ మూడు పెట్రోల్ ఇంజన్‌లతో పాటు మొత్తం ఐదు ఇంజన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులోని 1.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌ 110 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా 1.5-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో 2.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది.

Skoda Karoq ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ: డిజైన్, ఫీచర్స్ & పుల్ డీటైల్స్

డీజిల్ ఇంజిన్ల విషయానికి వస్తే, 2.0-లీటర్ TDI ఇంజిన్ ఎంపిక అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అన్ని ఇంజన్లు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇవి అద్భుతమైన పనితీరుని అందిస్తాయి. ఏది ఏమైనా ఈ కొత్త కారు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత స్కోడా కరోక్ మాదిరిగానే మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Tuesday, November 30, 2021, 19:08 [IST]
English summary
Skoda karoq facelift unveiled features engine specifications details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+