షాకింగ్ న్యూస్.. భారత్‌లో అప్పుడే పెరిగిన Skoda Kushaq ధర.. ఏకంగా..!!

భారతీయ మార్కెట్లో ఇప్పటికే చాలా వాహన తయారీ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. అయితే ఇప్పుడు స్కోడా (Skoda) కంపెనీ తన మిడ్-సైజ్ SUV కుషాక్ (Kushaq) యొక్క బేస్-స్పెక్ యాక్టివ్ వేరియంట్ ధరను పెంచింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

షాకింగ్ న్యూస్.. భారత్‌లో అప్పుడే పెరిగిన Skoda Kushaq ధర.. ఏకంగా..!!

నివేదికల ప్రకారం, స్కోడా కుషాక్ యొక్క బేస్-స్పెక్ యాక్టివ్ వేరియంట్ ధరను ఏకంగా రూ. 30,000 వరకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత స్కోడా కుషాక్ బేస్-స్పెక్ వేరియంట్ ధర రూ. 10.79 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఇక ఇందులోని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 18 లక్షలు (ఎక్స్-షోరూమ్).

షాకింగ్ న్యూస్.. భారత్‌లో అప్పుడే పెరిగిన Skoda Kushaq ధర.. ఏకంగా..!!

స్కోడా ఇండియా (Skoda India) 2021 జూన్ నెలలో తన స్కోడా కుషాక్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కంపెనీ ఈ SUV ని దేశీయ మార్కెట్లో ప్రారంభించినప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పటి వరకు కేవలం నాలుగు నెలల్లో 15,000 కుషాక్ బుకింగ్‌లను సొంతం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఈ SUV కి దేశీయ మార్కెట్లో ఎంత ఆదరణ ఉందో తెలుస్తుంది. స్కోడా కుషాక్ అతి తక్కువ కాలంలో 15,000 యూనిట్ల కంటే ఎక్కువ బుకింగ్స్ పొందటం అనేది కంపెనీ సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి.

షాకింగ్ న్యూస్.. భారత్‌లో అప్పుడే పెరిగిన Skoda Kushaq ధర.. ఏకంగా..!!

స్కోడా కంపెనీ ఈ కొత్త కుషాక్ SUV ని MQB-A0-IN డిజైన్ ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా రూపొందించింది. అయితే ఈ SUV లో కంపెనీ 95 శాతం వరకు స్థానికీకరణను ఉపయోగించింది. స్కోడా కుషాక్ SUV ని కంపెనీ భవిష్యత్తులో అన్ని భాగాలను భారతదేశంలోనే తయారుచేసే అవకాశం ఉంటుంది.

షాకింగ్ న్యూస్.. భారత్‌లో అప్పుడే పెరిగిన Skoda Kushaq ధర.. ఏకంగా..!!

స్కోడా కుషాక్‌ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో స్కోడా యొక్క ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్ ఇవ్వబడింది. ఇది కాకుండా, కారులో LED హెడ్‌ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్ మరియు LED టెయిల్ లైట్లు ఇవ్వబడ్డాయి. కారు ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు దిగువ భాగంలో బోనెట్ వంటివి ఉన్నాయి.

షాకింగ్ న్యూస్.. భారత్‌లో అప్పుడే పెరిగిన Skoda Kushaq ధర.. ఏకంగా..!!

స్కోడా కుషాక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఆటో-డిమ్మింగ్ హెడ్‌ల్యాంప్స్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, స్కోడా 6-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో కూడిన సబ్‌ వూఫర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఎలక్ట్రో-ఆపరేటెడ్ మరియు ఆటో- ఫోల్డ్ ORVM లు ఉన్నాయి.

షాకింగ్ న్యూస్.. భారత్‌లో అప్పుడే పెరిగిన Skoda Kushaq ధర.. ఏకంగా..!!

ఇందులో మల్టిఫుల్ ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐసోఫిక్స్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు మల్టీ-కొలిక్షన్ బ్రేక్‌లు, ఎబిడి విత్ ఇబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

షాకింగ్ న్యూస్.. భారత్‌లో అప్పుడే పెరిగిన Skoda Kushaq ధర.. ఏకంగా..!!

స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. మొదటి ఇంజిన్ 1.0-లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, ఇది 115 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ అందుబాటులో ఉంటుంది.

షాకింగ్ న్యూస్.. భారత్‌లో అప్పుడే పెరిగిన Skoda Kushaq ధర.. ఏకంగా..!!

ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్‌తో 7 స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్సన్ కలిగి ఉంది. మొత్తానికి స్కోడా కుషాక్ దేశీయ మార్కెట్లో మరింత ఆదరణ పొందుతుంది.

షాకింగ్ న్యూస్.. భారత్‌లో అప్పుడే పెరిగిన Skoda Kushaq ధర.. ఏకంగా..!!

ఇదిలా ఉండగా, స్కోడా (Skoda) దేశీయ మార్కెట్లో కొత్త స్లావియా (Slavia) సెడాన్‌ను విడుదల చేసేందుకు తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త స్కోడా స్లావియా (Skoda Slavia) సెడాన్ కోసం భారతీయ మార్కెట్లో ఎంతోమంది వాహన ప్రియులు ఎదురుచూస్తున్నారు. స్కోడా ఆటో ఇండియా తన ట్విట్టర్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం, ఈ కొత్త సెడాన్ 2021 నవంబర్ 18 మధ్యాహ్నం 2 గంటలకు వరల్డ్ ప్రీమియర్‌లో పరిచయం చేయబడుతుందని తెలిపింది. ఈ SUV విడుదలైతే కంపెనీ మరింత మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.ఈ సెడాన్ గురించి మరింత సమాచారం త్వరలో తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 17, 2021, 14:00 [IST]
English summary
Skoda kushaq base spec active variant price hiked details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+