Kushaq అమ్మకాల్లో పరుగులు తీస్తున్న Skoda.. ఎందుకింత డిమాండ్ అంటే?

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా ఆటో (Skoda Auto) భారతీయ మార్కెట్లో తన కుషాక్ (Kushaq) SUV ని విడుదల చేసినప్పటినుంచి కూడా మంచి ప్రజాదరణ పొందుతోంది. ఈ కారణంగానే కంపెనీ యొక్క ఈ SUV మంచి బుకింగ్స్ పొందుతూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు కంపెనీ 20,000 యూనిట్లకుపైగా బుకింగ్స్ స్వీకరించినట్లు తెలిపింది.

Kushaq అమ్మకాల్లో పరుగులు తీస్తున్న Skoda.. ఎందుకింత డిమాండ్?

స్కోడా కుషాక్ SUV దేశీయ విఫణిలో 2021 జూన్ నెలలో అధికారికంగా ప్రారభించబడింది. విడుదలైనప్పటి నుంచి కూడా కంపెనీ ఆశించిన స్థాయిలో బుకింగ్స్ పొందుతూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా రోజు రోజుకి బుకింగ్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ కొత్త SUV కి దేశీయ మార్కెట్లో ఎంత ఆదరణ ఉందొ స్పష్టంగా తెలుస్తోంది.

Kushaq అమ్మకాల్లో పరుగులు తీస్తున్న Skoda.. ఎందుకింత డిమాండ్?

స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో తన నెట్‌వర్క్‌ను మరింత వేగంగా మరియు చాలా ఎక్కువగా విస్తరించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేస్తుంది. కంపెనీ తన పరిధిని దక్షిణ భారతదేశంలో ఎక్కువుగా విస్తరించడంతో ద్రుష్టి సారిస్తోంది. ఇప్పటికి దక్షిణ భారతదేశంలో డీలర్ నెట్‌వర్క్ 38 టచ్ పాయింట్ల నుండి 70 టచ్ పాయింట్లకు పెరిగింది.

Kushaq అమ్మకాల్లో పరుగులు తీస్తున్న Skoda.. ఎందుకింత డిమాండ్?

దక్షిణ భారతదేశంలో డీలర్‌షిప్‌ల వేగవంతమైన విస్తరణ ఫలితంగా దక్షిణ ప్రాంతంలో అమ్మకాలు దాదాపు 90% పెరిగాయి. అంతే కాకూండా కంపెనీ ఇండియా ప్రాజెక్ట్ 2.0 కింద అమ్మకాలను మరింత వేగంగా విస్తరించడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. కంపెనీ భారతదేశంలో వచ్చే ఏడాది స్లావియా కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

దీనితో పాటు కంపెనీ వచ్చే ఏడాది జనవరిలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ SUV అయిన కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా పరిచయం చేస్తుంది. స్కోడా కోడియాక్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ఉత్పత్తి భారతదేశంలో కూడా ప్రారంభించబడింది. కావున ఇది త్వరలో దేశీయ మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.

Kushaq అమ్మకాల్లో పరుగులు తీస్తున్న Skoda.. ఎందుకింత డిమాండ్?

స్కోడా ఆటో భారతదేశంలో తన ఉనికిని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ 2022 నాటికి మొత్తం 225 కొత్త డీలర్‌షిప్‌లను ప్రారభింస్తుంది. 2021 ఆగష్టు నాటికి దేశంలోని 100 నగరాల్లో కంపెనీ తన సర్వీసులను ప్రారంభించింది. వీటి సంఖ్య వచ్చే ఏడాదికి రెట్టింపు అవుతాయి.

Kushaq అమ్మకాల్లో పరుగులు తీస్తున్న Skoda.. ఎందుకింత డిమాండ్?

స్కోడా కుషాక్ కాంపాక్ట్ SUV ధర భారతీయ మార్కెట్లో రూ. 10.50 లక్షల నుండి రూ. 17.60 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంటుంది. ఈ కుషాక్ SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Kushaq అమ్మకాల్లో పరుగులు తీస్తున్న Skoda.. ఎందుకింత డిమాండ్?

స్కోడా కుషాక్ మొత్తం 7 వేరియంట్లలో మరియు యాంబియంట్, యాంబిషన్, స్టైల్ అనే మూడు ట్రిమ్‌లలో అందించబడుతుంది. ఈ SUV రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇంజిన్ ఎంపికలలో 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. రెండు ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ మరియు DSG గేర్‌బాక్స్‌లతో అందుబాటులోకి వచ్చాయి.

Kushaq అమ్మకాల్లో పరుగులు తీస్తున్న Skoda.. ఎందుకింత డిమాండ్?

స్కోడా ఆటో ఇండియా ఈ ఏడాది భారతదేశంలో 30,000 కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అమ్మకాలను సాధించడానికి ఇందులో స్కోడా కుషాక్ ప్రధాన పాత్ర వహిస్తుంది. అంతే కాకూండా కంపెనీ 2022 చివరి నాటికి భారతదేశంలో 60,000 కార్లను విక్రయించనుంది. స్కోడా గత సంవత్సరం భారతదేశంలో 10,000 యూనిట్లను విక్రయించింది.

Kushaq అమ్మకాల్లో పరుగులు తీస్తున్న Skoda.. ఎందుకింత డిమాండ్?

ఇదిలా ఉండగా స్కోడా ఆటో (Skoda Auto) భారతీయ మార్కెట్లో హన కొత్త మిడ్-సైజ్ ప్రీమియం సెడాన్ అయిన స్కోడా స్లావియాను ఆవిష్కరించింది. స్కోడా స్లావియా MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సెడాన్. దీని డిజైన్ ఇటీవల అప్‌డేట్ చేయబడిన ఆక్టావియా వంటి సెడాన్‌ల నుండి ప్రేరణ పొందింది. కొత్త స్కోడా స్లావియా కంపెనీ ప్రస్తుత ర్యాపిడ్ మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది.

Kushaq అమ్మకాల్లో పరుగులు తీస్తున్న Skoda.. ఎందుకింత డిమాండ్?

కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

Kushaq అమ్మకాల్లో పరుగులు తీస్తున్న Skoda.. ఎందుకింత డిమాండ్?

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. కొత్త స్లావియా హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda kushaq booking over 20000 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X