స్కోడా కుషాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వీడియో.. మీ ప్రశ్నలన్నింటికీ దొరుకుతుంది ఇక్కడ సమాధానం
ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ స్కోడా కుషాక్‌ను 2021 జూన్ 28 న భారత్‌లో విడుదల చేయబోతోంది. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ కొత్త డిజైన్ కలిగి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.
ఇటీవల మేము ఈ కొత్త కుషాక్ ఎస్‌యూవీని డ్రైవ్ చేసాము. ప్రస్తుత తరానికి ఈ కొత్త కుషాక్ ఏ విధంగా సరిపోతుంది, ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీని పర్ఫామెన్స్ ఎలా ఉంటుంది, అనే దానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ చూడండి.
భారత మార్కెట్లో స్కోడా కుషాక్ రెండు ఇంజన్ ఆప్సన్స్ తో లబిస్తుంది. ఈ రెండు పెట్రోల్ ఇంజన్లు, అంతే కాదు ఇవి రెండూ టర్బోచార్జ్డ్ కూడా. లోయర్ స్పెక్ మోడల్ 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. టాప్-ఆఫ్-లైన్ మోడల్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది.
ఇందులోని 1.5-లీటర్ ఇంజిన్‌తో కూడిన వేరియంట్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 147.5 బిహెచ్‌పి మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్‌ఎమ్‌ను టార్క్ అందిస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికల కోసం కొనుగోలుదారులు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి వంటి వాటిని ఎంచుకోవచ్చు.
ఇక 1.0-లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 114 బిహెచ్‌పి పవర్ మరియు 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
స్కోడా కుషాక్ ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా, మల్టీ-కొలిక్షన్ బ్రేక్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటంతో పాటు మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది.
స్కోడా తన కుషాక్ ధరలను ఇంకా ప్రకటించలేదు. కానీ ఇది భారతదేశంలో కంపెనీ చౌకైన ఎస్‌యూవీ కావచ్చుని భావిస్తున్నాము. ధర రూ .10 నుంచి 14 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. కుషాక్ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు ఎంజి హెక్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications








