విడుదలకు ముందే స్కొడా కుషాక్ ఇంటీరియర్ ఫీచర్స్ లీక్!

స్కోడా ఆటో భారత మార్కెట్ కోసం 'కుషాక్' పేరుతో ఓ మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసినదే. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్ చిత్రాలను కూడా వెల్లడి చేసింది. తాజాగా, ఇప్పుడు దీని ఇంటీరియర్స్‌లో ఆఫర్ చేయబడే ఫీచర్ల వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

విడుదలకు ముందే స్కొడా కుషాక్ ఇంటీరియర్ ఫీచర్స్ లీక్!

టీమ్‌బిహెచ్‌పి ద్వారా లీక్ అయిన సమాచారం ప్రకారం, కొత్త 2021 స్కొడా కుషాక్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్‌లోనే ఫుల్లీ లోడెడ్ ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇందులో 7.0 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 4 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్ లభ్యం కానుంది.

విడుదలకు ముందే స్కొడా కుషాక్ ఇంటీరియర్ ఫీచర్స్ లీక్!

అలాగే, టాప్-ఎండ్ వేరియంట్లో 10-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు బూట్ స్పేస్‌లో ఓ సబ్ వూఫర్ కూడా లభ్యం కానున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఇందులో కూల్డ్ గ్లౌవ్ బాక్స్ మరియు వెంటిలేటెడ్ సీట్లు కాడా లభ్యం కానున్నాయి.

విడుదలకు ముందే స్కొడా కుషాక్ ఇంటీరియర్ ఫీచర్స్ లీక్!

ఈ ఎస్‌యూవీలో స్టాండర్డ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటు బ్రాండ్ యొక్క స్వంత కనెక్టింగ్ టెక్నాలజీ కూడా లభించే అవకాశం ఉంది. అయితే, ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 360-డిగ్రీ కెమెరాను ఉండకపోవచ్చని తెలుస్తోంది.

విడుదలకు ముందే స్కొడా కుషాక్ ఇంటీరియర్ ఫీచర్స్ లీక్!

ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తేస ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఆటోమేటిక్ వేరియంట్లలో), బేస్ వేరియంట్లో 4 ఎయిర్‌బ్యాగులు మరియు టాప్-ఎండ్ వేరియంట్లో 6 ఎయిర్‌బ్యాగులు లభ్యం కానున్నాయి.

విడుదలకు ముందే స్కొడా కుషాక్ ఇంటీరియర్ ఫీచర్స్ లీక్!

భారత్‌లో స్కొడా కుషాక్‌ను రెండు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో విడుదల చేయవచ్చని అంచనా. ఇందులో మొదటిది 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్. అయితే, ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఎంట్రీ లెవల్ వేరియంట్లలో మాత్రమే ఆఫర్ చేసే అవకాశం ఉంది.

విడుదలకు ముందే స్కొడా కుషాక్ ఇంటీరియర్ ఫీచర్స్ లీక్!

ఈ 1.0-లీటర్ త్రీ-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎమ్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని అంచనా.

విడుదలకు ముందే స్కొడా కుషాక్ ఇంటీరియర్ ఫీచర్స్ లీక్!

ఇకపోతే, టాప్-ఎండ్ వేరియంట్లలో ఉపయోగించబోయే 1.5-లీటర్ టిఎస్ఐ ఇవో ఫోర్-సిలిండర్ టర్బో ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సెవన్-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

విడుదలకు ముందే స్కొడా కుషాక్ ఇంటీరియర్ ఫీచర్స్ లీక్!

స్కొడా ఆటో గతేడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన విజన్ ఇన్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ కుషాక్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు. భారతదేశం కోసం స్కొడా ఆటో సిద్ధం చేసుకున్న 'ఇండియా 2.0 ప్రాజెక్ట్' ప్లాన్‌లో భాగంగా వస్తున్న తొలి మోడల్ ఈ కుషాక్ ఎస్‌యూవీ.

విడుదలకు ముందే స్కొడా కుషాక్ ఇంటీరియర్ ఫీచర్స్ లీక్!

స్కొడా కుషాక్ ఎస్‌యూవీని 'ఎమ్‌క్యూబి ఏ0 ఇన్' ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీని కూడా తయారు చేయనున్నారు. మార్కెట్ అంచనా ప్రకారం, దేశీయ విపణిలో స్కొడా కుషాక్ ధర రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా.

విడుదలకు ముందే స్కొడా కుషాక్ ఇంటీరియర్ ఫీచర్స్ లీక్!

భారత్‌లో అత్యంత పాపులర్ అయిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో స్కొడా కుషాక్ విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జి హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్, టాటా హారియర్, జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 3, 2021, 13:25 [IST]
English summary
Skoda Kushaq Interior Features Leaked Ahead Of Official Launch, Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+