భారత్‌లో విడుదలైన Skoda స్పెషల్ ఎడిషన్; ధర రూ. 11.99 లక్షలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ Skoda (స్కోడా) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు కొత్త Rapid Matte Edition అనే స్పెషల్ ఎడిషన్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Rapid Matte Edition ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త ఎడిషన్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ సెడాన్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన Skoda స్పెషల్ ఎడిషన్; ధర రూ. 11.99 లక్షలు

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Skoda Rapid Matte Edition రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి మాన్యువల్ కాగా, మరొకటి ఆటోమేటిక్ వేరియంట్. అయితే కంపెనీ యొక్క ఈ స్పెషల్ ఎడిషన్ యొక్క స్టాండర్డ్ వెర్షన్‌ మాత్రం ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ మరియు అదనపు ఫీచర్లను పొందుతుంది.

భారత్‌లో విడుదలైన Skoda స్పెషల్ ఎడిషన్; ధర రూ. 11.99 లక్షలు

Skoda కంపెనీ మోతాదిసారిగా 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తన Rapid Matte Edition ను ఆవిష్కరించింది, అయితే ఇప్పటికి దేశీయ విఫణిలో విడుదల చేసింది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ కొత్త సెడాన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం కొత్త Rapid Matte Edition కేవలం 400 యూనిట్లను మాత్రమే విక్రయిస్తుంది. తరువాత నిలిపివేసే అవకాశం ఉంటుంది.

భారత్‌లో విడుదలైన Skoda స్పెషల్ ఎడిషన్; ధర రూ. 11.99 లక్షలు

కొత్త Skoda Rapid Matte Edition చూడటానికి చాలా ఆకర్షనీయంగా మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఇది చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇందులో మాట్టే కలర్ లో పూర్తి చేసిన ఫ్రంట్ గ్రిల్, డోర్ హ్యాండిల్స్ మరియు ముందు మరియు వెనుక స్పాయిలర్‌లపై గ్లాస్ బ్లాక్ బిట్స్ ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన Skoda స్పెషల్ ఎడిషన్; ధర రూ. 11.99 లక్షలు

ఈ స్పెషల్ ఎడిషన్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులోని రియర్ డిఫ్యూజర్‌తో పాటు సైడ్ బాడీ మౌల్డింగ్ బ్లాక్‌తో ఉంటుంది. అల్లాయ్ వీల్స్ కూడా బ్లాక్ ట్రీట్మెంట్ పొందుతాయి. ఇవన్నీ కూడా ఈ ఎడిషన్ ని చాలా అద్భుతంగా కనిపించేలా చేస్తాయి. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్కఫ్ ప్లేట్, ఫ్లాట్ బాటమ్ స్ట్రింగ్ వీల్, ఎల్‌ఈడీ లైట్లు మరియు లెదర్ మినహా కొత్త ర్యాపిడ్ కారు మునుపటి మోడల్ మాదిరిగానే కొనసాగుతుంది.

భారత్‌లో విడుదలైన Skoda స్పెషల్ ఎడిషన్; ధర రూ. 11.99 లక్షలు

Skoda Rapid Matte Edition యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులోని క్యాబిన్ కొత్త డ్యూయల్-టోన్ టెల్లూర్ గ్రే ఇంటీరియర్‌ను బ్లాక్ లీథెరెట్ అప్‌హోల్స్టరీ మరియు అల్కాంటారా ఇన్సర్ట్‌లతో పొందుతుంది. ఇవి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటాయి. వీటితో పాటు ఈ స్పెషల్ ఎడిషన్ లో 8.0-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా మరియు యుఎస్‌బి ఆధారిత ఎయిర్ ప్యూరిఫయర్ ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన Skoda స్పెషల్ ఎడిషన్; ధర రూ. 11.99 లక్షలు

ఈ సందర్భంగా స్కోడా ఇండియా బ్రాండ్ డైరెక్టర్ మిస్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ, భారతీయ మార్కెట్లో స్కోడా ర్యాపిడో అద్భుతమైన విజయాన్ని సాధించడంలో సహకరించింది. ఇప్పటి వరకు స్కోడా ర్యాపిడో 1,00,000 కంటే ఎక్కువ అమ్మకాలను పొందింది. ఇది కంపెనీ యొక్క అద్భుతమైన విజయం. ఇప్పుడు కంపెనీ కొత్త Rapid Matte Edition ను మార్కెట్లో విడుదల చేయడంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము అన్నారు.

భారత్‌లో విడుదలైన Skoda స్పెషల్ ఎడిషన్; ధర రూ. 11.99 లక్షలు

Skoda Rapid Matte Edition సేఫ్టీ ఫీచర్స్:

Skoda యొక్క స్పెషల్ ఎడిషన్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహనదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి. ఇందులో

  • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు
  • రియర్ పార్కింగ్ సెన్సార్లు
  • యాంటీ-గ్లేర్ IRVM
  • రియర్ విండ్‌స్క్రీన్ డీఫోజర్ విత్ టైమర్
  • ఏబీఎస్
  • భారత్‌లో విడుదలైన Skoda స్పెషల్ ఎడిషన్; ధర రూ. 11.99 లక్షలు

    Skoda Rapid Matte Edition ఇంజిన్:

    Skoda Rapid Matte Edition యొక్క హుడ్ కింద, 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 109 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ మరియు ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జత చేయబడి ఉంటుంది. ఇది మంచి ఇంధన సామర్త్యాన్ని అందిస్తుంది. కావున వాహన వినియోగాదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

    భారత్‌లో విడుదలైన Skoda స్పెషల్ ఎడిషన్; ధర రూ. 11.99 లక్షలు

    Skoda Rapid Matte Edition యొక్క మాన్యువల్ వేరియంట్ ధర రూ .11.99 లక్షలు. ఈ ధర ప్రస్తుతం బ్రాండ్ లైనప్ లో ఉన్న రాపిడ్ మాంటే కార్లోతో సమానంగా ఉంటుంది. కానీ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా దీని ధర రూ. 20,000 నుంచి 30,000 వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

    Skoda కంపెనీ తన స్లావియా సెడాన్ ను ఈ సంవత్సరం చివరినాటికి ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే దీని అమ్మకాలు మాత్రమే వచ్చే సంవత్సరం ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ ఈ సంవత్సరం భారతదేశంలో ఫేస్‌లిఫ్డ్ కోడియాక్ ఎస్‌యూవీని తిరిగి ప్రవేశపెట్టనుంది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క కార్లకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందొ తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, October 4, 2021, 16:47 [IST]
English summary
Skoda rapid matte edition launched in india at rs 11 99 lakh
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+