స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) తమ సరికొత్త స్లావియా (Slavia) సెడాన్‌ ను నవంబర్ 18, 2021 వ తేదీన విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో స్కోడా స్లావియా సెడాన్ యొక్క ఇంజన్ ఆప్షన్లు మరియు కొలతలతో సహా ఇతర వివరాలను కంపెనీ వెల్లడి చేసింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం రండి.

స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

ప్రస్తుతానికి స్కోడా స్లావియా (Skoda Slavia) కొలతలు మరియు ఇంజన్ వివరాలు మాత్రమే పూర్తిగా వెల్లడయ్యాయి. ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ఫీచర్ల గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి, పరిమాణం మరియు ఇంజన్ స్పెక్స్ విషయానికి వస్తే స్కోడా స్లావియా ఈ విభాగంలో హోండా సిటీ, మారుతి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

కొలతలు (పొడవు, వెడల్పు, ఎత్తు మరియు వీల్‌బేస్):

స్కోడా స్లావియా మొత్తం పొడవు 4,541 మిమీ గా ఉంటుంది, ఇది స్కోడా లైనప్ లోనే రెండవ పొడవైన కారు. హోండా సిటీ (4,549 మిమీ) పొడవుతో పోలిస్తే స్కోడా స్లావియా సెడాన్ పొడవు కేవలం 8 మిమీ తక్కువ ఉంటుంది. అదే సమయంలో మారుతి సుజుకి సియాజ్ (4,490 మిమీ) మరియు హ్యుందాయ్ వెర్నా (4,440 మిమీ) పొడవు కన్నా స్లావియా పెద్దదిగా ఉంటుంది.

స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

ఇక వెడల్పు విషయానికి వస్తే, స్లావియా 1,752 మిమీ వెడల్పుతో విశాలమైనదిగా ఉంటుంది. అంటే, దీని అర్థం స్కోడా స్లావియా లోప ప్రయాణీకులకు, ముఖ్యంగా వెనుక సీట్లో ఉన్నవారికి ఎక్కువ స్థలం లభించాలి. పోల్చి చూస్తే, హోండా సిటీ వెడల్పు 1,749 మిమీ, మారుతి సుజుకి సియాజ్ వెడల్పు 1,730 మిమీ మరియు హ్యుందాయ్ వెర్నా వెడల్పు 1,729 మిమీ గా ఉంటుంది. స్లావియా సెడాన్ వెడల్పు పరంగా ఈ మూడు కార్ల కన్నా పెద్దదిగా ఉంటుంది.

స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

ఎత్తు పరంగా చూస్తే, హోండా సిటీ సెడాన్ మరియు స్కోడా స్లావియాలు ఇంచు మించు ఒకేలా ఉంటాయి. సిటీ ఎత్తు 1,489 మిమీగా ఉంటే, స్లావియా సెడాన్ ఎత్తు 1,487 మిమీగా ఉంటుంది. అలాగే, ఎత్తు పరంగా ఇది మారుతి సుజుకి సియాజ్ (1,485 మిమీ) కన్నా 2 మిమీ ఎత్తుగా మరియు హ్యుందాయ్ వెర్నా (1,475 మిమీ) కన్నా 12 మిమీ ఎత్తుగా ఉంటుంది.

స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

ఈ నాలుగు కార్లలో అసలైన పోటీ వాటి వీల్‌బేస్ వద్ద జరుగుతుంది. కారు లోపలి క్యాబిన్ ఎంత విశాలంగా ఉంటుందనే విషయాన్ని దాని వీల్‌బేస్ నిర్ణయిస్తుంది. ఈ విషయంలో స్కోడా స్లావియా 2,651 మిమీ వీల్‌బేస్‌తో మారుతి సియాజ్‌ కన్నా కేవలం 1 మిమీ ఎక్కువగా ఉంటుంది. సియాజ్ వీల్‌బేస్ 2,650 మిమీగా ఉంటే, సిటీ మరియు వెర్నా రెండు మోడళ్లు కూడా ఒకే విధమైన వీల్‌బేస్ పొడవు (2,600 మిమీ)ను కలిగి ఉంటాయి.

స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లు:

ఈ నాలుగు కార్లలో, స్కోడా స్లావియా, హోండా సిటీ మరియు హ్యుందాయ్ వెర్నా మోడళ్లు మాత్రమే బహుళ ఇంజన్ ఆప్షన్లతో అందించబడుతున్నాయి. అలాగే, ఈ విభాగంలో వెర్నా మరియు సిటీ మాత్రమే ఇప్పటికీ డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో లభ్యమవుతున్నాయి. స్కోడా స్లావియా మాత్రం విభిన్నమైన పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

కాగా, ప్రస్తుతం మారుతి సుజుకి సియాజ్ మరియు స్కోడా స్లావియా మోడళ్లలో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. సరికొత్త స్కోడా స్లావియాను రెండు ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేయనున్నారు. వీటిలో మొదటిది త్రీ-సిలిండర్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, కాగా రెండవది ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కి చెందిన 1.5 -లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్.

స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

స్లావియా యొక్క 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, 1.5-లీటర్ ఇంజన్ గరిష్టంగా 148 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. అయితే, 1.0-లీటర్ ఇంజన్ మాత్రం 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉండగా, 1.5-లీటర్ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

ఈ విభాగంలోని హ్యుందాయ్ వెర్నా రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ లీటరుకు 21.3 కిమీ ఏఆర్ఏఐ (ARAI) సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది మరియు ఈ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.

స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

ఇక పెట్రోల్ ఇంజన్ల విషయానికి వస్తే, వెర్నా 1.0 లీటర్ మరియు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 144ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు దీని ARAI ధృవీకరించబడిన మైలేజ్ లీటరుకు 17.7 కిమీ గా ఉంటుంది. ఇకపోతే, చిన్న 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 11 బిహెచ్‌పి పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది, ఇది లీటరుకు 19.2 కిమీ మైలేజీని అందిస్తుంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కాగా, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

హోండా సిటీ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇది 1.5 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందించబడుతుంది. హోండా సిటీ పెట్రోల్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది మరియు ఈ ఇంజన్ 119 బిహెచ్‌పి పవర్, 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

హోండా సిటీ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడుతుంది. ఈ డీజల్ ఇంజన్ గరిష్టంగా 98 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, లీటరుకు 24.1 కిమీ మైలేజీని అందిస్తుంది. కాగా, పెట్రోల్ మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 17.8 కిమీ మైలేజీని మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 18.4 కిమీ మైలేజీని అందిస్తుంది.

స్కోడా స్లావియా vs హోండా సిటీ vs మారుతి సియాజ్ vs హ్యుందాయ్ వెర్నా - కంపారిజన్

చివరిగా, మారుతి సుజుకి సియాజ్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది కేవలం 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే అందించబడుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పి పవర్ మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మైలజే విషయానికి వస్తే, మాన్యువల్ వెర్షన్ లీటరుకు 20.65 కిమీ మైలేజీని మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 20.04 కిమీ మైలేజీని ఇస్తుంది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda slavia details out competes with honda city maruti ciaz and hyundai verna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X