Skoda Slavia టీజర్ లాంచ్; మరికొద్ది నెలల్లోనే భారత మార్కెట్లో విడుదల!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా (Skoda) భారత మార్కెట్ కోసం పరిచయం చేయనున్న తమ సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ పేరును వెల్లడి చేసింది. ఈ కొత్త సెడాన్ ను 'స్కోడా స్లావియా' (Skoda Slavia) పేరుతో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది శీతాకాలంలో (నవంబర్ - డిసెంబర్ 2021 మధ్యలో) స్కోడా ఈ కారును విడుదల చేయనుంది.

స్కోడా స్లావియా పేరు వెనుక ఉన్న చరిత్రను కూడా కంపెనీ వెల్లడించింది. స్కోడా సంస్థను ప్రారంభించిన తొలినాళ్లలో ఆ సంస్థ వ్యవస్థాపకులు వక్లావ్ లౌరిన్ (Vaclav Laurin) మరియు వక్లావ్ క్లెమెంట్ (Vaclav Klement) లు 1896 లో సంయక్తంగా అభివృద్ధి చేసిన సైకిళ్లను 'స్లావియా' పేరుతో విక్రయించారు. కాగా, ఇప్పుడు కంపెనీ ఈ ఐకానిక్ పేరును తమ కొత్త సెడాన్ కోసం ఉపయోగించబోతోంది.

Skoda Slavia సెడాన్ టీజర్ లాంచ్

సరికొత్త స్కోడా స్లావియా సెడాన్ తమ సంస్థ వ్యవస్థాపకులకు నివాళిగా ఉంటుందని స్కోడా చెబుతోంది. స్కోడా స్లావియా యొక్క ఉత్పత్తి-సిద్ధంగా ఉన్న (ప్రొడక్షన్ రెడీ) మోడల్ ను కంపెనీ రాబోయే కొద్ది రోజుల్లోనే ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన స్కోడా కుషాక్ (Skoda Kushaq) మాదిరిగానే ఈ కొత్త స్లావియా సెడాన్ ను కూడా, భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా స్థానికీకరించిన MQB A0 IN ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుంది.

కంపెనీ, ఇటీవల అప్‌డేట్ చేసిన ఆక్టావియా మరియు సూపర్బ్ వంటి కార్ల నుండి స్పూర్తి పొంది స్లావియా సెడాన్ ను డిజైన్ చేయనున్నారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ర్యాపిడ్ స్థానాన్ని భర్తీ చేస్తుందా లేక దానికి ఎగువన ప్రవేశపెట్టబడుతుందా అనేది తెలియాల్సి ఉంది.

అయితే, గతంలో స్కోడా ఆటో ఇండియా బాస్ జాక్ హోలిస్ తెలిపిన వివరాల ప్రకారం, మార్కెట్లో స్కోడా ర్యాపిడ్ సెడాన్ ను కొనసాగిస్తూనే, దాని కన్నా శక్తివంతమైన మరియు సౌకర్యవంతమైన మిడ్-సైజ్ సెడాన్ ను ఇండియాలో విడుదల చేస్తామని చెప్పిన సంగతి తెలిసినదే. దీనిని బట్టి చూస్తుంటే, మార్కెట్లో ర్యాపిడ్ అమ్మకాలు యధావిధిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విడుదలతో స్కోడా ఇప్పటికే భారతదేశంలో లాభదాయకమైన ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం, ఈ మోడల్ అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కాగా, ఇప్పుడు స్లావియా ద్వారా పోటీతో కూడుకున్న మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో ప్రవేశించాలని స్కోడా ప్లాన్ చేస్తోంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ వెర్నా, మారుతి సియాజ్, హోండా సిటీ మొదలైన కార్లకు పోటీగా నిలుస్తుంది.

స్కోడా స్లావియా సెడాన్ విషయంలో కేవలం టీజర్ తప్ప వేరే ఏ ఇతర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే, కొన్ని నివేదికల ప్రకారం, ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్కోడా ర్యాపిడ్ ఎంట్రీ లెవల్ సెడాన్ కంటే పెద్దదిగా ఉంటుందని నిర్ధారించవచ్చు. ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వల్తే, ఈ సెడాన్‌ కు ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, సిగ్నేచర్ బటర్‌ఫ్లై ఆకారపు గ్రిల్, అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ మొదలైనవి ఆశించవచ్చు.

స్కోడా ఆటో ఇండియా తమ స్లావియా సెడాన్ ను 1.0 లీటర్ మరియు 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్లతో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం, కంపెనీ విక్రయిస్తున్న లేటెస్ట్ కుషాక్ ఎస్‌యూవీలో కూడా ఇవే ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. కాబట్టి, స్లావియా ఉత్పత్తి ఖర్చును తగ్గించేందుకు మరియు సరసమైన ధరకే ఈ సెడాన్ ను అందించేందుకు స్కోడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

స్లావియా సెడాన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందించబడుతుంది. కొత్త స్లావియా టీజర్ ను ఆవిష్కరించిన సందర్భంగా, స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ.. స్కోడా 125 సంవత్సరాల కంటే గొప్ప ప్రపంచ వారసత్వాన్ని కలిగి ఉందని అన్నారు.

Skoda Slavia సెడాన్ టీజర్ లాంచ్

అంతేకాకుండా, స్లావియా అనే పేరు స్కోడాను ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ కార్ల తయారీదారులలో ఒకటిగా చేసిన విజయగాధ ప్రారంభానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, స్లావియా పేరు భారతీయ మార్కెట్లో స్కోడా బ్రాండ్ కోసం కొత్త శకానికి నాంది పలుకుతుందని అన్నారు. స్కోడా స్లావియా ఉత్తమ నిర్మాణ నాణ్యత, విశ్వసనీయత మరియు డ్రైవింగ్ అనుభవంతో అందించబడుతుందని చెప్పారు.

స్కోడా ఆటో భారత మార్కెట్లో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని వేగంగా విస్తరించడం ద్వారా, మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే, స్కోడా ఇటీవలి కాలంలో ఎక్కువ భారతీయ విడిభాగాలతో రూపొందించిన వాహనాలను తయారు చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ నిర్ణయం వలన కంపెనీ తక్కువ ధరకే వాహనాలను ఉత్పత్తి చేయగలుగుతోంది మరియు వాటిని కస్టమర్లకు అందుబాటు ధరలో ఉంచగలుగుతోంది.

కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో రెండు కొత్త కార్లను విడుదల చేసింది, ఇందులో కొత్త స్కోడా ఆక్టేవియా మరియు కుషాక్ ఎస్‌యూవీలు ఉన్నాయి. ఇవేకాకుండా, వచ్చే ఏడాది భారతదేశంలో కోడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్ ను కూడా తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈలోపుగా స్లావియా సెడాన్ ను కూడా విడుదల చేయనుంది.

స్కోడా ఆటో భారతదేశంలో తమ నెట్‌వర్క్ మరియు పోర్ట్‌ఫోలియోని విస్తృతంగా విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. స్కోడా ఆటో భారతదేశంలో తన వ్యాపారాన్ని విస్తరించడానికి 2022 చివరి నాటికి 225 కొత్త డీలర్‌షిప్‌ లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 2021 నాటికి స్కోడా దేశంలోని 100 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.

స్కోడా ఈ ఏడాది జూన్ నెలలో తమ కుషాక్ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కంపెనీ ఈ ఎస్‌యూవీని ప్రస్తుతం అత్యంత పోటీతో కూడుకున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీలో స్కోడా అనేక గొప్ప ఫీచర్లను అందిస్తోంది. దేశీయ విపణిలో స్కోడా కుషాక్ ధరలు రూ. 10.50 లక్షల నుండి రూ. 17.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda slavia first teaser out india launch expected this winter details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X