Skoda Slavia ఇంటీరియర్ డిజైన్.. ఎలా ఉందో చూసారా..!!
స్కోడా (Skoda) కంపెనీ భారతీయ మార్కెట్ కోసం కొత్త స్లావియా (Slavia) అనే కొత్త సెడాన్ ని సిద్ధం చేస్తోంది. ఈ సెడాన్ దేశీయ మార్కెట్లో 2021 నవంబర్ 18 న ఆవిష్కరించబడుతుందని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. అంతే కాకూండా ఈ కొత్త సెడాన్ యొక్క డిజైన్ కూడా వెల్లడయ్యింది. అయితే ఇప్పుడు స్కోడా స్లావియా యొక్క ఇంటీరియర్ కూడా వెల్లడయింది. స్కోడా స్లావియా ఇంటీరియర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

స్కోడా స్లావియా అద్భుతమైన డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుందని ఇదివరకటి కథనాలలో తెలుసుకున్నాం. ఇప్పుడు కంపెనీ వెల్లడించిన ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో డ్యాష్‌బోర్డ్ మరియు డోర్స్ అన్నీ కూడా చాలా స్పోర్టీవ్ గా ఉండటం గమనించవచ్చు. ఇందులోని డ్యాష్‌బోర్డ్‌కు రెండు వైపులా వృత్తాకార ఏసీ వెంట్‌లు మరియు మధ్యలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కంట్రోల్ బటన్‌లు మరియు గేర్‌బాక్స్ దిగువన ఉండటం మీరు ఇప్పుడు వెలువడిన ఫొటోలో గమనించవచ్చు.

స్కోడా స్లావియా యొక్క స్టీరింగ్ వీల్ కూడా చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. దీనికి రెండు వైపులా అనేక బటన్లు కూడా ఉన్నాయి. దీనికి మధ్యలో కంపెనీ యొక్క లోగో ఇవ్వబడింది. ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ముందు ఉంచబడింది మరియు దాని వైపున SKODA అక్షరాన్ని చూడవచ్చు.

బయట ఉన్న ORVM లు లోపలి నుండి కూడా కనిపిస్తాయి, డోర్ హ్యాండిల్స్, AC వెంట్స్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గేర్‌బాక్స్‌తో సహా ORVMలతో సహా అనేక ప్రదేశాలలో క్రోమ్ ఇవ్వబడుతుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటీరియర్ మొత్తానికి చాలా ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

స్లావియా యొక్క రెండు సీట్ల మధ్యలో ఆర్మ్ రెస్ట్ కూడా మీరు చూడవచ్చు. అంతే కాకూండా ఇందులో వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లను చూడవచ్చు. కంపెనీ తన డిజైన్‌తో పాటు ఫీచర్లను నవంబర్ 18వ తేదీన అధికారికంగా వెల్లడించనుంది. అప్పుడు ఇందులో ఏఏ ఫీచర్స్ ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా అవగతం అవుతుంది.

కొత్త Skoda Slavia చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇప్పుడు వెల్లడైన ఈ డిజైన్ ప్రకారం ఈ కొత్త మోడల్ ముందు మరియు వెనుక భాగం చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది, కావున చాలా దూకుడుగా అనిపిస్తుంది. ఇది కంపెనీ యొక్క MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. అంతే కాకుండా Skoda రాపిడ్ కంటే పెద్దదిగా ఉండే అవకాశం ఉంటుంది.

Skoda Slavia మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ యొక్క సిగ్నేచర్ గ్రిల్ దాని ముందు భాగంలో ఇవ్వబడింది. దానికి దిగువన ఎయిర్ డ్యామ్‌లు ఇవ్వబడ్డాయి, వీటిని పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉన్నాయి. హెడ్‌లైట్ యూనిట్‌లు రెండు వైపులా ఉంచబడ్డాయి, ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. హెడ్‌లైట్‌ల క్రింద రౌండ్ ఫాగ్ లైట్లు ఉంచబడతాయి.

ఇక Skoda Slavia సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు, ఇవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి, కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దాని పైన ORVM ఇన్‌స్టాల్ చేయబడ్డాయి, అంతే కాకుండా ఇందులో టర్న్ ఇండికేటర్ ఇన్‌స్టాల్ చేయబడింది. డోర్ హ్యాండిల్ గుండా వెళుతున్న లైన్ వెనుక నుండి కారు ముందు వరకు కనిపిస్తుంది.

స్కోడా స్లావియా యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.
మొత్తంమీద, ఈ మిడ్ సైజ్ సెడాన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది మరియు ఇది స్కోడా ర్యాపిడ్ కంటే సైజులో కొంచెం పెద్దదిగా ఉంటుంది, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Skoda Auto India (స్కోడా ఆటో ఇండియా) తన కొత్త Slavia (స్లావియా) ను రెండు ఇంజన్ ఎంపికలతో అందించే అవకాశం ఉంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త Skoda Slavia కంపెనీకి మరో ముఖ్యమైన మోడల్ కానుంది. కంపెనీ యొక్క కుషాక్ భారతీయ మార్కెట్లో ఆశించిన విజయాన్ని పొందింది. కావున కంపెనీ ఈ కొత్త మోడల్‌తో మరింత మంచి అమ్మకాలను పొందటానికి ఉపయోగిస్తుంది. రాబోయే రోజుల్లో కంపెనీ దీనిని ఆవిష్కరించిన తరువాత బుకింగ్‌లు ప్రారంభిస్తుంది. మొత్తానికి ఈ సెడాన్ 2022 జనవరిలో భారతీయ రోడ్లపై చూసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నాము. ఈ కొత్త సెడాన్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి ఆధరణ పొందుతుందో తెలుసుకోవడానికి, కొంత సమయం వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








