Slavia TVC విడుదల చేసిన Skoda: పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India) ఇటీవల తన సరికొత్త మిడ్-సైజ్ ప్రీమియం సెడాన్ స్కోడా స్లావియా (Skoda Slavia) ను వెల్లడించింది. అయితే స్కోడా కంపెనీ ఈ కొత్త సెడాన్ ను స్కోడా ఆక్టావియా (Skoda Octavia) కింద విడుదల చేయనుంది. దేశీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త స్కోడా స్లావియా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

Slavia TVC విడుదల చేసిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా స్లావియా భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ మరియు హోండా సిటీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొత్త సెడాన్ లైనప్‌లో దాని స్కోడా ర్యాపిడ్ స్థానంలో రానుంది. కానీ ఇది స్కోడా ర్యాపిడ్ పైన ఉంచబడుతుంది. అంతే కాకుండా దీని ధర కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది.

Slavia TVC విడుదల చేసిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా స్లావియా ధర అధికంగా ఉండటానికి ప్రధాన కారణం, ఇది రాపిడ్ కంటే పెద్దది మరియు ఎక్కువ ప్రీమియం సెడాన్. కంపెనీ కొత్త స్కోడా స్లావియా కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. కావున ఈ కొత్త సెడాన్ యొక్క డెలివరీలు 2022 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి.

Slavia TVC విడుదల చేసిన Skoda: పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా స్కోడా ఆటో ఇండియా ఈ కొత్త సెడాన్ యొక్క మొదటి TVC విడుదల చేసింది. TVC అనగా టెలివిజన్ కమర్షియల్ ప్రకటన. ఈ TVC వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఈ TVC వీడియోలో స్కోడా స్లావియా యొక్క విభిన్న కలర్ ఆప్సన్స్ చూడవచ్చు. ఇవన్నీ కూడా చాలా ఆకర్షనీయంగా ఉన్నాయి.

Slavia TVC విడుదల చేసిన Skoda: పూర్తి వివరాలు

ఈ TVC ముగింపులో, కంపెనీ కొత్త స్కోడా స్లావియా కోసం "Beauty that is just not skin deep" అని రావడం మీరు చూడవచ్చు. కంపెనీ స్కోడా స్లావియాను మొత్తం 5 కలర్ ఆప్షన్‌లతో అందించే అవకాశం ఉంటుంది. ఈ కలర్ ఆప్సన్స్ లో క్యాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ వంటివి ఉన్నాయి.

Slavia TVC విడుదల చేసిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా స్లావియా కోసం కంపెనీ తన క్రిస్టల్ బ్లూ పెయింట్ షేడ్‌ను ప్రత్యేకంగా తయారు చేసింది. నివేదికల ప్రకారం, స్కోడా స్లావియా పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

Slavia TVC విడుదల చేసిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా స్లావియాలో కంపెనీ చాలా వరకు అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఇందులో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టచ్-సెన్సిటివ్ AC కంట్రోల్, వైర్‌లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రివర్స్ కెమెరా, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కోల్డ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ మొదలైనవి ఇందులో ఉన్నాయి. క్యాబిన్‌ను డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో ఉంటుంది. ఇందులోని డ్యాష్‌బోర్డ్ మరియు అప్హోల్స్టరీ కూడా డ్యూయల్-టోన్‌లో ఉంచబడ్డాయి.

స్కోడా స్లావియా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ కొలిజన్ బ్రేక్‌లు, క్రూయిజ్ కంట్రోల్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. స్కోడా స్లావియా సైడ్ పోల్స్ మరియు రియర్ ఇంపాక్ట్‌తో పాటు ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ పాదచారుల రక్షణను అందిస్తుంది. ఇది వాహన వినియోగదారుల రక్షణను నిర్దారిస్తుంది.

Slavia TVC విడుదల చేసిన Skoda: పూర్తి వివరాలు

కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

Slavia TVC విడుదల చేసిన Skoda: పూర్తి వివరాలు

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

స్కోడా కంపెనీ , కొత్త స్లావియా ధరను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే కంపెనీ ఈ సెడాన్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసిన తరువాత ధర వెల్లడవుతుంది. స్కోడా ర్యాపిడ్ ధర భారతీయ మార్కెట్లో రూ. 7.79 లక్షలు నుంచి రూ. 13.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది, కావున స్కోడా స్లావియా ధర రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నాము.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda slavia sedan new tvc design features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X