Skoda Slavia ఎక్స్టీరియర్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి [వీడియో]

చెక్ రిపబ్లిక్ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda) భారతీయ మార్కెట్లో ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద కొత్త కారును విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ఈ కొత్త కారుని 'స్కోడా స్లావియా' పేరుతో లాంచ్ చేయనుంది. స్కోడా కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా మిడ్-సైజ్ సెడాన్ ఇప్పటికే మార్కెట్లో ఆవిష్కరించబడింది. ఇది రానున్న కొత్త సంవత్సరం మొదటి ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

అయితే కంపెనీ ఇప్పుడు ఈ కొత్త స్కోడా స్లావియా యొక్క ఎక్స్టీరియర్ భాగాలను గురించి తెలియజేసే ఒక వీడియోను అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Skoda Slavia ఎక్స్టీరియర్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి [వీడియో]

కంపెనీ విడుదల చేసిన ఈ వీడియోలో ఈ సెడాన్ యొక్క అన్ని బాహ్య భాగాలను చూడవచ్చు. ఈ వీడియో స్కోడా స్లావియా ముందు భాగాన్ని చూపించడంతో ప్రారంభమవుతుంది. ఇది హెక్సాగోనల్ గ్రిల్ పొందుతుంది. దీనిని బటర్‌ఫ్లై గ్రిల్ అని కూడా పిలుస్తారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Skoda Slavia ఎక్స్టీరియర్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి [వీడియో]

ఇందులోని గ్రిల్ చుట్టూ క్రోమ్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎల్ ఆకారపు ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లతో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇది క్రోమ్ సరౌండ్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్‌లతో వస్తుంది. తరువాత ఈ వీడియోలో స్కోడా స్లావియా యొక్క టెయిల్ ల్యాంప్‌లను చూడవచ్చు. ఇవి కూడా ఎల్ఈడీ ఎలిమెంట్స్ పొందుతాయి.

Skoda Slavia ఎక్స్టీరియర్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి [వీడియో]

స్కోడా స్లావియా యొక్క వెనుక బంపర్ చాలా సరళంగా ఉంటుంది, అంతే కాకూండా రెండు రిఫ్లెక్టర్‌లతో బ్లాక్ హానీకూంబ్ షేప్ కూడా ఇక్కడ ఇవ్వబడింది. దీనితో పాటు వెనుక భాగంలో 'SKODA' బ్యాడ్జింగ్ దాని బూట్ లిడ్ మధ్యలో ఇవ్వబడింది. ఇవన్నీ చూపరులను ఒక్క సారిగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

Skoda Slavia ఎక్స్టీరియర్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి [వీడియో]

వెనుక భాగంలోని రియర్ బంపర్‌లో రియర్ పార్కింగ్ సెన్సార్‌లను కూడా చూడవచ్చు. స్కోడా స్లావియా యొక్క ఫ్రంట్ ఫెండర్ కూడా 'SKODA' బ్యాడ్జింగ్‌ను పొందింది. ఈ బ్యాడ్జింగ్‌లోనే పియానో ​​బ్లాక్ మరియు క్రోమ్ వంటి వాటిని చూడవచ్చు. ఈ వీడియోలో మీరు ఇంకా ఇందులోని షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఆధునిక ఫీచర్స్ వంటివాటిని కూడా చూడవచ్చు.

Skoda Slavia ఎక్స్టీరియర్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి [వీడియో]

కొత్త స్కోడా స్లావియాలో ఆటో-ఫోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎక్ట్సీరియర్ రియర్‌వ్యూ మిర్రర్‌పై ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, కీలెస్ ఎంట్రీ మరియు క్రోమ్‌తో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ చూపబడ్డాయి. వీటితో పాటు ఇంతకు ముందు కంపెనీ వెల్లడించిన దాదాపు అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి.

Skoda Slavia ఎక్స్టీరియర్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి [వీడియో]

స్కోడా స్లావియాలోని మరిన్ని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు స్కోడా ప్లే యాప్‌లతో కూడిన 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటివి ఉన్నాయి. ఇందులో 8 స్పీకర్లు మరియు సబ్‌ వూఫర్ వంటివి కూడా ఉన్నాయి.

Skoda Slavia ఎక్స్టీరియర్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి [వీడియో]

త్వరలో విడుదల కానున్న కొత్త స్కోడా స్లావియాలో 8 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా ఉంటుంది. ఇది వాహనం గురించి కావాల్సిన సమాచారాన్ని డ్రైవర్ కి అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. క్యాబిన్‌లో లెదర్ అప్హోల్స్ట్రే మరియు ముందు భాగంలో వెంటిలేటెడ్ సీట్లు వంటి వున్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Skoda Slavia ఎక్స్టీరియర్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి [వీడియో]

స్కోడా స్లావియా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ కొలిజన్ బ్రేక్‌లు, క్రూయిజ్ కంట్రోల్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. స్కోడా స్లావియా సైడ్ పోల్స్ మరియు రియర్ ఇంపాక్ట్‌తో పాటు ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ పాదచారుల రక్షణను అందిస్తుంది. ఇది వాహన వినియోగదారుల రక్షణను నిర్దారిస్తుంది.

Skoda Slavia ఎక్స్టీరియర్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి [వీడియో]

కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Skoda Slavia ఎక్స్టీరియర్ డిజైన్ ఎలా ఉందో ఇక్కడ చూడండి [వీడియో]

స్కోడా కంపెనీ , కొత్త స్లావియా ధరను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే కంపెనీ ఈ సెడాన్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసిన తరువాత ధర వెల్లడవుతుంది. స్కోడా ర్యాపిడ్ ధర భారతీయ మార్కెట్లో రూ. 7.79 లక్షలు నుంచి రూ. 13.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది, కావున స్కోడా స్లావియా ధర రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Saturday, December 25, 2021, 12:43 [IST]
English summary
Skoda slavia sedan official video released exterior features revealed details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+