Slavia ఆవిష్కరణ తేదీ వెల్లడించిన Skoda.. వివరాలు
స్కోడా (Skoda) కంపెనీ దేశీయ మార్కెట్లో కొత్త స్లావియా (Slavia) సెడాన్‌ను విడుదల చేసేందుకు తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త స్కోడా స్లావియా (Skoda Slavia) సెడాన్ కోసం భారతీయ మార్కెట్లో ఎంతోమంది వాహన ప్రియులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు కంపెనీ ఈ కొత్త సెడాన్ యొక్క ఆవిష్కరణ తేదీని వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

స్కోడా ఆటో ఇండియా తన ట్విట్టర్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం, ఈ కొత్త సెడాన్ 2021 నవంబర్ 18 మధ్యాహ్నం 2 గంటలకు వరల్డ్ ప్రీమియర్‌లో పరిచయం చేయబడుతుందని తెలిపింది. స్కోడా కుషాక్ తర్వాత స్లావియా ఈ సంవత్సరం భారతదేశంలో కంపెనీ యొక్క రెండవ ఆఫర్ అవుతుంది. ఇది అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

కంపెనీ యొక్క స్కోడా రాపిడ్ సెడాన్ స్థానంలో ఈ కొత్త స్కోడా స్లావియా రానుంది. కావున ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. స్కోడా స్లావియా కంపెనీ యొక్క MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. అంతే కాకుండా Skoda రాపిడ్ కంటే పెద్దదిగా ఉండే అవకాశం ఉంటుంది.

స్కోడా స్లావియా యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది. మొత్తంమీద, ఈ మిడ్ సైజ్ సెడాన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది మరియు ఇది స్కోడా ర్యాపిడ్ కంటే సైజులో కొంచెం పెద్దదిగా ఉంటుంది, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Skoda Slavia చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఇది కంపెనీ యొక్క లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. ఇది కంపెనీ యొక్క MQB A0-IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది, ఇది విభిన్న బాడీ స్టైల్స్ మరియు ఇంజన్ ఆప్షన్‌లకు అనుగుణంగా ఉంటుంది.

స్కోడా స్లావియా సెడాన్ నాచ్ బ్యాక్ లాంటి స్టైలింగ్‌ను కలిగి ఉంది. ఇది క్రోమ్ సరౌండ్‌తో కూడిన సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్, LED DRLలతో కూడిన షార్ప్ LED హెడ్‌ల్యాంప్‌లు, స్లోపింగ్ రూఫ్‌లైన్, LED టెయిల్-లైట్లు మరియు డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, స్కోడా స్లావిక్ ఆటోమేటిక్ ల్యాంప్ కార్ వంటి వాటిని పొందుతుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Skoda Slavia యొక్క ఇంటీరియర్ డిజైన్ కూడా కంపెనీ ఇటీవల విడుదల చేసింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా అందుబాటులో ఉంది. స్కోడా స్లావియా లోపలి భాగంలో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు దాని వెనుక ఉంచిన డిజిటల్ ఇన్సర్ట్ క్లస్టర్‌తో 2-స్పోక్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి.

స్కోడా స్లావియా యొక్క స్టీరింగ్ వీల్ కూడా చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. దీనికి రెండు వైపులా అనేక బటన్లు కూడా ఉన్నాయి. దీనికి మధ్యలో కంపెనీ యొక్క లోగో ఇవ్వబడింది. ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ముందు ఉంచబడింది మరియు దాని వైపున SKODA అక్షరాన్ని చూడవచ్చు.

ఇందులో రౌండ్ ఏసీ వెంట్స్ అందుబాటులో ఉన్నాయి. బయట ఉన్న ORVM లు లోపలి నుండి కూడా కనిపిస్తాయి, డోర్ హ్యాండిల్స్, AC వెంట్స్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గేర్‌బాక్స్‌తో సహా ORVMలతో సహా అనేక ప్రదేశాలలో క్రోమ్ ఇవ్వబడుతుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటీరియర్ మొత్తానికి చాలా ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

Skoda Auto India (స్కోడా ఆటో ఇండియా) తన కొత్త Slavia (స్లావియా) ను రెండు ఇంజన్ ఎంపికలతో అందించే అవకాశం ఉంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.
ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ స్కోడా 125 సంవత్సరాలకు పైగా గొప్ప ప్రపంచ వారసత్వాన్ని కలిగి ఉందని అన్నారు. స్లావియా అనే పేరు స్కొడాను అత్యంత ప్రసిద్ధ కార్ల తయారీదారులలో ఒకటిగా చేసిన విజయగాథకు నాంది పలికింది. స్లావియా పేరు భారత మార్కెట్లో స్కోడా బ్రాండ్‌కు మరోసారి కొత్త శకానికి నాంది పలుకుతుంది. స్కోడా స్లావియా అత్యుత్తమ నిర్మాణ నాణ్యత, విశ్వసనీయత మరియు డ్రైవింగ్ అనుభవంతో అందించబడుతుంది.

స్కోడా ఆటో సెడాన్లు మరియు SUVలతో భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే కంపెనీ ఈ సంవత్సరం భారతదేశంలో రెండు కొత్త కార్లను విడుదల చేసింది, ఇందులో కొత్త స్కోడా ఆక్టావియా కాగా, మరొకటి స్కోడా కుషాక్ SUV. అంతే కాకుండా స్కోడా కోడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను వచ్చే ఏడాది భారతదేశంలో తీసుకురావడానికి కూడా కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

స్కోడా స్లావియా ధర ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ దీని ధర రూ. 10 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నాము. స్కోడా కంపెనీ స్లావియా లాంచ్ తో తన ఉనికిని మరింత విస్తరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ 2022 చివరి నాటికి మొత్తం 225 కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించనుంది.


Click it and Unblock the Notifications








