Skoda Slavia ఆవిష్కరణ నవంబర్ 18 న: పూర్తి వివరాలు

స్కోడా స్లావియా (Skoda Slavia) అనేది Skoda కంపెనీ నుంచి భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న కొత్త మోడల్. ఇప్పటికే ఈ కొత్త సెడాన్ కి సంబంధించిన చాలా సమాచారం అందుబాటులోకి వచ్చింది. అయితే కంపెనీ ఈ కొత్త Skoda Slavia ను 2021 నవంబర్ 18 న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనుంది. ఈ సెడాన్ యొక్క టీజర్ కూడా ఇప్పటికే విడుదలైంది. కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం ఇది మార్కెట్లో వింటర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

Skoda Slavia ఆవిష్కరణ నవంబర్ 18 న: పూర్తి వివరాలు

స్కోడా స్లావియా కంపెనీ యొక్క ప్రీమియం సెడాన్. కంపెనీ ఇంకా దాని డిజైన్‌ను వెల్లడించలేదు. ఈ సెడాన్ కంపెనీ యొక్క ఇండియా 2.0 ప్రాజెక్ట్ క్రింద రానున్న రెండవ కారు. ఈ కారు కంపెనీ యొక్క MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌లో కూడా నిర్మించబడింది. అంతకు ముందు ఈ ప్లాట్‌ఫారమ్‌లో కంపెనీ కుషాక్ SUVని తీసుకువచ్చింది.

Skoda Slavia ఆవిష్కరణ నవంబర్ 18 న: పూర్తి వివరాలు

ఈ కొత్త SUVకి భారతీయ మార్కెట్లోని కస్టమర్ల నుండి మంచి స్పందన వచ్చింది. కావున ఇది మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుంది. స్కోడా స్లావియా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సెడాన్ ముందు భాగంలో సిగ్నేచర్ గ్రిల్ ఇవ్వబడింది. దానికి దిగువన ఎయిర్ డ్యామ్‌లు ఇవ్వబడ్డాయి, వీటిని పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉన్నాయి. హెడ్‌లైట్ యూనిట్‌లు రెండు వైపులా ఉంచబడ్డాయి, ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. హెడ్‌లైట్‌ల క్రింద రౌండ్ ఫాగ్ లైట్లు ఉంచబడతాయి.

Skoda Slavia ఆవిష్కరణ నవంబర్ 18 న: పూర్తి వివరాలు

ఇక దాని సైడ్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే, ఇక్కడ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు, ఇవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి, కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దాని పైన ORVM ఇన్‌స్టాల్ చేయబడ్డాయి, అంతే కాకుండా ఇందులో టర్న్ ఇండికేటర్ ఇన్‌స్టాల్ చేయబడింది. డోర్ హ్యాండిల్ గుండా వెళుతున్న లైన్ వెనుక నుండి కారు ముందు వరకు కనిపిస్తుంది.

Skoda Slavia ఆవిష్కరణ నవంబర్ 18 న: పూర్తి వివరాలు

స్కోడా కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త స్లావియా పరిమాణంలో స్కోడా ర్యాపిడ్ సెడాన్ కంటే ఎక్కువగా ఉటుంది. పొడవు మరియు కాకుండా ఈ సెడాన్ యొక్క వీల్‌బేస్ కూడా పెరిగింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం స్కోడా స్లావియా పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

Skoda Slavia ఆవిష్కరణ నవంబర్ 18 న: పూర్తి వివరాలు

మొత్తంమీద, ఈ మిడ్ సైజ్ సెడాన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది మరియు ఇది స్కోడా ర్యాపిడ్ కంటే సైజులో కొంచెం పెద్దదిగా ఉంటుంది, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Skoda Slavia ఆవిష్కరణ నవంబర్ 18 న: పూర్తి వివరాలు

Skoda Auto India (స్కోడా ఆటో ఇండియా) తన కొత్త Slavia (స్లావియా) ను రెండు ఇంజన్ ఎంపికలతో అందించే అవకాశం ఉంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

Skoda Slavia ఆవిష్కరణ నవంబర్ 18 న: పూర్తి వివరాలు

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Skoda Slavia ఆవిష్కరణ నవంబర్ 18 న: పూర్తి వివరాలు

కంపెనీ ఈ కొత్త సెడాన్ యొక్క ధర మరియు ఇతర ఇంటీరియర్ వంటి వివరాలను ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. ఈ సెడాన్ భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత ధర మొదలైన సమాచారం అందుబాటులోకి వస్తాయి. రాబోయే రోజుల్లో ఇది ప్రారంభించిన తర్వాత బుకింగ్‌లు మరియు ఉత్పత్తిని ప్రారంభించే ముందు, జనవరిలో భారతీయ రోడ్లపై చూడవచ్చని భావిస్తున్నాము.

Skoda Slavia ఆవిష్కరణ నవంబర్ 18 న: పూర్తి వివరాలు

స్కోడా స్లావియా కంపెనీకి మరో ముఖ్యమైన మోడల్ కానుంది. కంపెనీ యొక్క కుషాక్ భారతీయ మార్కెట్లో ఆశించిన విజయాన్ని పొందింది. కావున కంపెనీ ఈ కొత్త మోడల్‌తో మరింత మంచి అమ్మకాలను పొందటానికి ఉపయోగిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి మరింత సమాచారం త్వరలో వెల్లడవుతుంది. అయితే ఈ కొత్త సెడాన్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి ఆధరణ పొందుతుందో తెలుసుకోవడానికి, కొంత సమయం వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Friday, October 29, 2021, 18:35 [IST]
English summary
Skoda slavia unveil on 18th november design engine details
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+