Skoda ఆవిష్కరించిన Slavia గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ చూడండి

స్కోడా (Skoda) కంపెనీ ఎట్టకేలకు స్లావియా (Slavia) సెడాన్ ను ఆవిష్కరించింది. అదే సమయంలో కంపెనీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. అయితే డెలివరీలు మాత్రం 2022 మొదటి త్రైమాసికం నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కంపెనీ ఈ కొత్త సెడాన్ ను మూడు ట్రిమ్‌లలో అందించనుంది. అవి యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్.

స్కోడా స్లావియా (Skoda Slavia) ఐదు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్. ఈ సెడాన్ చాలా ఆకర్షనీయంగా ఉండటమే కాకుండా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కొత్త స్లావియాలోని కొన్ని స్పెషల్ ఫీచర్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Skoda ఆవిష్కరించిన Slavia గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ చూడండి

Skoda Slavia డిజైన్:

కొత్త స్కోడా స్లావియా కంపెనీ యొక్క MQAB AO IN డిజైన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో విక్రయించే కార్ల కోసం కంపెనీ ఈ డిజైన్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్ స్కోడా కార్ల స్థానికీకరణను అందిస్తుంది.

Skoda ఆవిష్కరించిన Slavia గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ చూడండి

స్కోడా స్లావియా కంపెనీ యొక్క ర్యాపిడ్ కంటే పెద్దదిగా ఉంటుంది. దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది. పరిమాణంలో మాత్రమే కాకుండా ఇది మంచి ఇంటీరియర్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఎక్కువ లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ మరియు బూట్ స్పేస్‌ను అందిస్తుంది. పెద్ద వీల్‌బేస్ కారణంగా, స్లావియా అధిక వేగంతో కూడా నియంత్రణలో ఉంటుంది. మొత్తానికి ఇది అద్బుతంగా ఉంటుంది.

Skoda ఆవిష్కరించిన Slavia గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ చూడండి

స్కోడా స్లావియా ఫీచర్స్:

స్కోడా స్లావియాలో కంపెనీ చాలా వరకు అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఇందులో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టచ్-సెన్సిటివ్ AC కంట్రోల్, వైర్‌లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రివర్స్ కెమెరా, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కోల్డ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ మొదలైనవి ఇందులో ఉన్నాయి. క్యాబిన్‌ను డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో ఉంటుంది. ఇందులోని డ్యాష్‌బోర్డ్ మరియు అప్హోల్స్టరీ కూడా డ్యూయల్-టోన్‌లో ఉంచబడ్డాయి.

Skoda ఆవిష్కరించిన Slavia గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ చూడండి

సేఫ్టీ ఫీచర్స్:

స్కోడా స్లావియా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ కొలిజన్ బ్రేక్‌లు, క్రూయిజ్ కంట్రోల్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. స్కోడా స్లావియా సైడ్ పోల్స్ మరియు రియర్ ఇంపాక్ట్‌తో పాటు ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ పాదచారుల రక్షణను అందిస్తుంది. ఇది వాహన వినియోగదారుల రక్షణను నిర్దారిస్తుంది.

Skoda ఆవిష్కరించిన Slavia గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ చూడండి

ఇంజిన్ ఆప్సన్:

కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

Skoda ఆవిష్కరించిన Slavia గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ చూడండి

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Skoda ఆవిష్కరించిన Slavia గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ చూడండి

ధర:

స్కోడా కంపెనీ , కొత్త స్లావియా ధరను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే కంపెనీ ఈ సెడాన్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసిన తరువాత ధర వెల్లడవుతుంది. స్కోడా స్లావియా 2022 ప్రారంభంలో షోరూమ్‌లకు చేరుకుంటుంది. ఇది ర్యాపిడ్ కారులోని ప్రీమియం ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లతో పరిచయం చేయబడింది, కాబట్టి దీని ధర ర్యాపిడ్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

Skoda ఆవిష్కరించిన Slavia గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ చూడండి

స్కోడా ర్యాపిడ్ ధర భారతీయ మార్కెట్లో రూ. 7.79 లక్షలు నుంచి రూ. 13.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది, కావున స్కోడా స్లావియా ధర రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఈ స్లావియా సెడాన్ భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 18, 2021, 19:54 [IST]
English summary
Skoda slavia unveiled top 5 things to know
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+