Skoda Slavia ఫస్ట్ లుక్ వీడియో: డిజైన్, ఫీచర్స్, ఇంకా..

స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త సెడాన్ పేరు 'స్కోడా స్లావియా' (Skoda Slavia). స్కోడా స్లావియా అనేది స్కోడా రాపిడ్‌కు ప్రత్యామ్నాయం. రాపిడ్ ఒక అద్భుతమైన మిడ్-సైజ్ సెడాన్, అయితే ఈ సెడాన్ స్థానాన్ని భర్తీ చేయడానికి స్లావియా పుట్టుకొస్తుంది. స్లావియా పేరు చెక్‌లో 'గ్లోరీ' అని అర్థం వస్తుంది. స్కోడా తన స్లావియా సెడాన్ ని ఇటీవల ఆవిష్కరించింది.

కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త స్లావియా సెడాన్ ను మేము ఇటీవల సందర్శించాము, ఈ సెడాన్ గురించి మరింత సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.

స్కోడా స్లావియా మూడు ట్రిమ్‌లలో అందించబడుతుంది - యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్. అంతే కాకుండా ఇది మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్. స్కోడా కంపెనీ ఈ సెడాన్ యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించింది.

స్కోడా స్లావియా డిజైన్ స్కోడా ర్యాపిడ్ నుండి ప్రేరణ పొందింది. ఈ సెడాన్ ర్యాపిడ్ కంటే పెద్దది అయినప్పటికీ. పెద్ద పరిమాణంతో పాటు, సెడాన్ ఇంటీరియర్‌లో ఎక్కువ లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ మరియు బూట్ స్పేస్‌ను అందిస్తుంది. స్కోడా స్లావియాలో కంపెనీ చాలా ఫీచర్లను అందించింది. ఇది 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టచ్-సెన్సిటివ్ AC కంట్రోల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రివర్స్ కెమెరా, LED హెడ్‌ల్యాంప్‌లు, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ మొదలైన ఫీచర్లతో అమర్చబడి ఉంటుంది. స్లావియా పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

Skoda Slavia ఫస్ట్ లుక్ వీడియో

స్కోడా స్లావియా 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

స్కోడా స్లావియాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ కొలిజన్ బ్రేక్‌లు, క్రూయిజ్ కంట్రోల్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగద్రుని యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda slavia video review feature engine details
Story first published: Monday, November 22, 2021, 16:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X