ధనవంతులు కొనే కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్స్, మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? : గడ్కరీ

మనదేశంలో పెద్ద కార్ల కన్నా చిన్న కార్ల విక్రయాలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం వాటి సరసమైన ధర. కార్ల తయారీ సంస్థలు కూడా వాటి ధరకు తగినట్లుగానే ఫీచర్లను అందిస్తుంటారు. అందుకే, చిన్న కార్లలో ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు లభించవు. ఈ కార్ల నిర్మాణం కూడా పెద్ద కార్ల కంటే బలహీనంగా ఉంటుంది.

ధనవంతులు కొనే కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్స్, మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? : గడ్కరీ

అయినప్పటికీ, మధ్యతరగతి ప్రజలు వాటి ధరను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇలాంటి చవకైన కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఇటీవలి నివేదికల ప్రకారం, చిన్న కార్లలో బలహీనమైన సేఫ్టీ ఫీచర్స్ కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మరిణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

ధనవంతులు కొనే కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్స్, మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? : గడ్కరీ

అయితే, ఇప్పుడు కొనుగోలుదారుల్లో అవగాహన పెరిగింది. చాలా మంది వినియోగదారులు కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు కేవలం దాని లుక్ మరియు ఫీచర్‌లను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, ఆ కారులో లభించే సేఫ్టీ ఫీచర్లను కూడా విశ్లేషించిన తర్వాత కారును కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ధనవంతులు కొనే కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్స్, మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? : గడ్కరీ

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అన్ని కార్లలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం) మరియు ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) అనే రెండు సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరిగా ఉండాలి. అయితే, ఈ రెండు స్టాండర్డ్ ఫీచర్లు కూడా చాలా ప్రాధమికమైనవి మాత్రమే. ఆధునిక కార్లలో ఇంకా ఎన్నో రకాల సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉంటున్నాయి.

ధనవంతులు కొనే కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్స్, మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? : గడ్కరీ

ఈ నేపథ్యంలో, చిన్న కార్లలో కూడా మెరుగైన సేఫ్టీ ఫీచర్లను అందించాలని, తద్వారా రోడ్డు ప్రమాదాల్లో జరిగే ప్రాణ నష్టాన్ని నివారించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే చిన్న కార్లలో మరిన్ని సేఫ్టీ ఫీచర్లను అందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

ధనవంతులు కొనే కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్స్, మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? : గడ్కరీ

అదే సమయంలో, అధిక ఆదాయ విభాగానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేసే పెద్ద కార్లలో కార్ కంపెనీలు ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌ లను అందించడం గురించి కూడా ఆయన ఆందోళనను వ్యక్తం చేశారు. చిన్న వాహనాల విభాగంలోని అన్ని వేరియంట్లు మరియు కేటగిరీలలో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించాలని ఆయన అన్ని వాహన తయారీదారులను కోరారు.

ధనవంతులు కొనే కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్స్, మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? : గడ్కరీ

దేశంలోని పేదలు మరియు మధ్యతరగతి ప్రజలు కూడా 'తగిన రక్షణ'కి అర్హులని కేంద్ర మంత్రి అన్నారు. చిన్న కార్లలో ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌ లను అందించడం ద్వారా రోడ్డు భద్రతను నిర్ధారించడం మరియు ప్రమాదాలలో మరణాల రేటును నివారించడమే తమ ప్రధాన లక్ష్యమని గడ్కరీ అన్నారు.

ధనవంతులు కొనే కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్స్, మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? : గడ్కరీ

ధనవంతులు కొనుగోలు చేసే పెద్ద కార్లలో మాత్రమే వాహన తయారీదారులు ఆరు నుండి ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌ లను ఎందుకు అందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వాహన తయారీదారులు ధనవంతులకు ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌ లను అందిస్తుండగా, మధ్యతరగతి వినియోగదారులు ఉపయోగించే ఎకానమీ మోడల్ కార్లలో మాత్రం కార్ కంపెనీలు కేవలం రెండు లేదా మూడు ఎయిర్‌బ్యాగ్‌ లను మాత్రమే అందించడం ఎంత వరకు సరైందని ఆయన ప్రశ్నించారు.

ధనవంతులు కొనే కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్స్, మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? : గడ్కరీ

కేంద్ర మంత్రి స్టేట్‌మెంట్ ప్రకారం.. "ఎక్కువగా, దిగువ మధ్యతరగతి ప్రజలు చిన్న ఎకానమీ కార్లను కొనుగోలు చేస్తారు. అలాంటి వారి కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లు లేకపోతే మరియు ప్రమాదాలు జరిగినప్పుడు, అది మరణాలకు దారితీస్తుంది. కాబట్టి, కారు యొక్క అన్ని వేరియంట్లు మరియు విభాగాలలో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌ లను అందించాలని నేను కార్ల తయారీదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను" అని కేంద్ర మంత్రి అన్నారు.

ధనవంతులు కొనే కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్స్, మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? : గడ్కరీ

చిన్న కార్లలో అదనపు ఎయిర్‌బ్యాగ్ లను అందించడం వలన వాటి ధరను కనీసం రూ. 3,000 నుండి రూ. 4,000 వరకు మాత్రమే పెరుగుతుందని గడ్కరీ చెప్పారు. ఆటోమొబైల్ పరిశ్రమలో అధిక వాహన పన్నులు, కఠినమైన భద్రతా నిబంధనలు మరియు కాలుష్య ఉద్గార ప్రమాణాల వలన ఇప్పటికే వాహనాల ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిందని, ఫలితంగా ఉత్పత్తుల ధరలను కూడా పెంచక తప్పడం లేదని ఆటో పరిశ్రమ లేవనెత్తిన అంశాలపై గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ధనవంతులు కొనే కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్స్, మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? : గడ్కరీ

గతేడాది కఠినమైన బిఎస్6 కాలుష్య ఉద్గార నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేసిన భారత ప్రభుత్వం, ఇప్పుడు ప్రతి కారులో కూడా తప్పనిసరిగా రెండు ఎయిర్‌బ్యాగ్స్ (డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్) ఉండాలనే నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం జూన్‌లో, కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నిబంధనను ప్రవేశపెట్టింది. ప్రస్తుత కార్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌ లను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయడానికి గడువు తేదీని డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించింది.

ధనవంతులు కొనే కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్స్, మరి మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? : గడ్కరీ

వాస్తవానికి ఈ నిబంధన (రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి) 1 ఏప్రిల్ 2021 నుండే అమలు చేయాలని కేంద్రం భావించింది. అయితే, కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో, ఈ సమయాన్ని డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించబడింది. ఇప్పటి వరకూ ఎంట్రీ లెవల్ కార్లు మరియు వేరియంట్లలో కేవలం ఫ్రంట్ సైడ్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ మాత్రమే తప్పనిసరిగా ఉండాలి. అయితే, ఇకపై డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్ రెండూ కూడా తప్పనిసరిగా ఉండాలి.

Most Read Articles

English summary
Small cars should have at least six airbags across all variants nitin gadkari
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X