ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్దముతున్న Oppo.. పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో కేవలం వాహన తయారీ కంపెనీలు మాత్రమే కాకుండా, ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో (Oppo) ఆటోమోటివ్ రంగంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన తయారీకి శ్రీకారం చుట్టడం వల్ల, సాధారణ కార్ కంపెనీలకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్దముతున్న Oppo.. పూర్తి వివరాలు

తాజా నివేదికల ప్రకారం, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Oppo భారతదేశం కోసం ఎలక్ట్రిక్ కారుపై పని చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ భారతీయ మార్కెట్లో 2024 వ సంవత్సరంలో ప్రారంభించబడే అవాకాశం ఉన్నట్లు తెలుస్తోంది. OPPO, Realme మరియు OnePlus వంటి బ్రాండ్‌లు BBK ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలో ఉన్నాయి.

ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్దముతున్న Oppo.. పూర్తి వివరాలు

OPPO, Realme మరియు OnePlus వంటి అనేక బ్రాండ్లు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. అంతే కాకూండా ఈ కంపెనీలు విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్ కోసం తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాయని నివేదికల ద్వారా తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్దముతున్న Oppo.. పూర్తి వివరాలు

ఎలక్ట్రిక్ కారు యొక్క ఉత్పత్తిని Oppo దేశీయ మార్కెట్లో 2024 ప్రారంభంలో ప్రారంభించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అయితే, ఈ కంపెనీలు ఇంకా తాము తయారుచేయనున్న కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను గురించి అధికారిక సమాచారం అందించలేదు. అయితే దీనికి సంబంధించిన సమాచారం త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్దముతున్న Oppo.. పూర్తి వివరాలు

సాధారణ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇది రాబోయే కాలంలో ఇతర కంపెనీలకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. భారతదేశ ఈవి తయారీ రంగం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కావున చాలా కంపెనీలు మంచి సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయడానికి ముందడుగు వేస్తున్నాయి.

ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్దముతున్న Oppo.. పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనరంగంలో బైకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, తరువాత కార్లు మరియు చివరిలో ట్రక్కులు వంటివి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ద్విచక్ర వాహన EV రంగంలో స్థాపించబడిన కంపెనీలకు అనేక స్టార్టప్‌ కంపెనీలు పెద్ద సవాలుగా నిలుస్తున్నాయి. కావున ఇవన్నీ పెద్ద ఎత్తున పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది.

ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్దముతున్న Oppo.. పూర్తి వివరాలు

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, Apple, Google, Huawei మరియు Xiaomi వంటి కంపెనీలు తమ సొంత ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడంలో వివిధ దశల్లో ఉన్నాయి. కావున రానున్న కాలంలో ఈ కంపెనీలు విఫణిలోకి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తాయి. అంతే కాకుండా AK-47 రైఫిల్ తయారీదారు కలాష్నికోవ్ కూడా ఎలక్ట్రిక్ కారు తయారీ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం.

ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్దముతున్న Oppo.. పూర్తి వివరాలు

ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనరంగంలో టెస్లా ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. అయితే టెస్లా కంపెనీకి పోటీగా కాకపోయినా ఎలక్రిక్ వాహన తయారు ప్రక్రియలో ఇతర కంపెనీలు తమ వంతు కూడా కృషి చేస్తున్నాయి. అంతే కాకూండా, మరో వైపు చైనా యొక్క EV మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద EV మార్కెట్ గా చెలామని అవుతోంది.

ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్దముతున్న Oppo.. పూర్తి వివరాలు

మొత్తానికి రాబోయే సంవత్సరాల్లో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కేవలం ఆటోమొబైల్ కంపెనీ మాత్రమే కాకుండా స్మార్ట్ ఫోన్ తయారీ దారులు కూడా ఈ రంగంలో విజృంభించే అవకాశం ఉంది. కావున రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అయితే ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులు ఎలా స్వీకరిస్తారు అనేది, ఒక ప్రశ్న.

ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్దముతున్న Oppo.. పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో ఇప్పటికే చాల వాహన తయారీ కంపెనీలు డీజిల్ వాహనాల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశాయి. ఇటీవల కాలంలో మారుతి సుజుకి కంపెనీ డీజిల్ వాహనాలను ఉత్పత్తి చేసే అవకాశం ఏ మాత్రం లేదని తెగేసి చెప్పింది. ఈ బాటలోనే చాలా కంపెనీలు నడుస్తున్నాయి. కావున రానున్న రోజుల్లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే వినియోగంలో ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.

ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్దముతున్న Oppo.. పూర్తి వివరాలు

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగింస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ఇంధన ధరలు కావచ్చు, లేదా ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి చూపుతున్న ఆసక్తి కావచ్చు. దేశంలో రోజురోజుకి అమాంతం పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య ప్రజలపైన ఎక్కువ భారం మోపుతున్నాయి. కావున ప్రస్తుతం కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలనుకునే స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా తప్పకుండా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 23, 2021, 12:40 [IST]
English summary
Smartphone company oppo plans to launch electric car in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+