Sonalika నుంచి కొత్త ట్రాక్టర్: ధర తక్కువ.. పర్ఫామెన్స్ ఎక్కువ

రైతు దేశానికి వెన్నెముక అన్న మాట ఒకప్పటినుంచి వింటూనే ఉన్నాము. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మొదట రైతు అభివృద్ధి చెందాలి. అప్పుడే దేశం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. అయితే ఇటీవల 'రైతు దినోత్సవాన్ని' పురస్కరించుకుని ప్రముఖ ట్రాక్టర్ తయారీ సంస్థ సోనాలిక (Sonalika) ఒక కొత్త ట్రాక్టర్ దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.

ఈ కొత్త ట్రాక్టర్ ప్రారంభ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 11.2 లక్షల వరకు ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

కొత్త ట్రాక్టర్ విడుదల చేసిన Sonalika: ధర తక్కువ.. పర్ఫామెన్స్ ఎక్కువ

సోనాలికా కంపెనీ విడుదల చేసిన ట్రాక్టర్ పేరు "సోనాలికా టైగర్ DI 75 4WD ట్రాక్టర్‌". ఇది CRDs టెక్నాలజీ కలిగి ఉండటమే కాకుండా బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. ఈ కొత్త ట్రాక్టర్ 75 బిహెచ్‌పి పవర్ మరియు 65 hp ఎకానమీని అందిస్తుంది.

కొత్త ట్రాక్టర్ విడుదల చేసిన Sonalika: ధర తక్కువ.. పర్ఫామెన్స్ ఎక్కువ

ఇది మాత్రమే కాకుండా.. సోనాలికా కంపెనీ టైగర్ DI 65 4WD ట్రాక్టర్‌ను కూడా పరిచయం చేసింది. ఇది 65 బిహెచ్‌పి పవర్ మరియు 55 hp ఎకానమీని అందించడానికి ద్వంద్వ ప్రయోజనాలతో ఆప్టిమైజ్ చేయబడింది. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త ట్రాక్టర్ విడుదల చేసిన Sonalika: ధర తక్కువ.. పర్ఫామెన్స్ ఎక్కువ

సోనాలికా టైగర్ DI 75 4WD మరియు టైగర్ DI 65 4WD లు రెండూ కూడా 4,712 సిసి CRD ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. సోనాలికా టైగర్ DI 75 4WD ట్రాక్టర్ 290 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తే, సోనాలికా టైగర్ DI 65 4WD ట్రాక్టర్ 258 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. 'స్కై స్మార్ట్' టెలిమాటిక్స్ టెక్నాలజీ సోనాలికా టైగర్ DI 75 WD మరియు టైగర్ DI 65 4WD ట్రాక్టర్‌లలో ఉపయోగించబడుతుంది. ఈ టెక్నాలజీ ఇంజిన్ ఇమ్మొబిలైజర్, లో బ్రేక్‌డౌన్ సమయానికి రియల్ టైమ్ సపోర్ట్, వెహికల్ జియో-ఫెన్సింగ్ మరియు ట్రాకింగ్ వంటి స్పెషల్ ఫీచర్స్ తో వస్తుంది.

కొత్త ట్రాక్టర్ విడుదల చేసిన Sonalika: ధర తక్కువ.. పర్ఫామెన్స్ ఎక్కువ

సోనాలికా ట్రాక్టర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ రైతుల పట్ల కంపెనీకి ఉన్న నిబద్ధత గురించి మాట్లాడుతూ.. రైతులు ప్రతిరోజూ ప్రశంసనీయమైన కృషితో ముందుకు సాగుతున్నారు. ప్రపంచ రైతు దినోత్సవం రోజు మా అత్యంత అధునాతన టైగర్ DI 75 4WD ట్రాక్టర్‌ను శక్తివంతమైన మరియు ఇంధన సామర్థ్య CRDతో విడుదల చేస్తున్నాము. ఇది ఆధునిక టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది పవర్ మరియు ఎకానమీ యొక్క జంట ప్రయోజనాలను అందిస్తుంది.

కొత్త ట్రాక్టర్ విడుదల చేసిన Sonalika: ధర తక్కువ.. పర్ఫామెన్స్ ఎక్కువ

వ్యవసాయ శ్రేయస్సును ఆర్థిక పద్ధతిలో అందించాలనే ఏకైక నమ్మకంతో నడిచే సోనాలికా ఇప్పుడు అత్యుత్తమ పనితీరుని అందించే కొత్త ట్రాక్టర్ విడుదల చేసింది. ఇది మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండి, మంచి పనితీరుని అందిస్తాయి. కావున ఇది రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

కొత్త ట్రాక్టర్ విడుదల చేసిన Sonalika: ధర తక్కువ.. పర్ఫామెన్స్ ఎక్కువ

యూరోపియన్ మరియు అమెరికన్ ఉద్గారాలకు అనుగుణంగా CRDI వంటి కొత్త సాంకేతికతను పరిచయం చేయడానికి 2016లో మేము భారతదేశంలో అగ్రగామిగా ఉన్నాము మరియు మేము భారతదేశంలో మరియు విదేశాలలో రైతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తూనే ఉంటామని కూడా ఆయన అన్నారు.

కొత్త ట్రాక్టర్ విడుదల చేసిన Sonalika: ధర తక్కువ.. పర్ఫామెన్స్ ఎక్కువ

సోనాలిక ట్రాకర్స్ ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఆధునిక వ్యవసాయాలను కూడా చాలా అద్భుతంగా పనికొస్తుంది. కావున ఇది నేటి తరం రైతులకు ఖచ్చితంగా సరిపోతుందని కూడా మేము ఆశిస్తున్నాము. ప్రస్తుతం కంపెనీ విడుదల చేసిన ఈ ట్రాక్టర్ తప్పకుండా మంచి అమ్మకాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

కొత్త ట్రాక్టర్ విడుదల చేసిన Sonalika: ధర తక్కువ.. పర్ఫామెన్స్ ఎక్కువ

సోనాలిక కంపెనీ ఇప్పటికే దేశంలో ట్రాకర్స్ అమ్మకాలలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంది. దేశంలో ఉన్న రైతులు కూడా ఈ కంపెనీ అందించే ట్రాక్టర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కావున ఇప్పటికీ మంచి ఆదరణ పొందుతూనే ఉంది. వ్యవసాయ రంగంలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న సోనాలిక తన ఉనికిని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.

Sonalika నుంచి కొత్త ట్రాక్టర్: ధర తక్కువ.. పర్ఫామెన్స్ ఎక్కువ

ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ కొత్త టైగర్ DI 75 4WD మరియు టైగర్ DI 65 4WD లు వచ్చాయి. వీటి విడుదలతో కంపెనీ యొక్క అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి సోనాలిక కంపెనీ కృషి చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, December 24, 2021, 11:02 [IST]
English summary
Sonalika tiger di 75 4wd and tiger di 65 4wd tractors launched price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+