శభాష్ సోనాలిక.. కరోనా సమయంలో కూడా సిబ్బందికి అండగా

భారతదేశంలో కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం మనదేశంలో కరోనా సెకండ్ వేవ్, మునుపటి కరోనా మొదటి దశకంటే కంటే కూడా వేగంగా సంక్రమిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మరి భారీ నుంచి ప్రజలను రక్షించడానికి మరియు ఈ వైరస్ యొక్క వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.

శభాష్ సోనాలిక.. కరోనా సమయంలో కూడా సిబ్బందికి అండగా

కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ వేగంగా వ్యాపించడంతో, ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ 19 బారిన పడిన వారికి ఆటో మొబైల్ కంపెనీలు కూడా చాలా వరకు సహాయం చేస్తున్నాయి. అంతే కాకుండా చాలా మంది వాహన తయారీదారులు తమ తయారీ కర్మాగారాల్లో ఉత్పత్తిని నిలిపివేశారు.

శభాష్ సోనాలిక.. కరోనా సమయంలో కూడా సిబ్బందికి అండగా

చాలా కంపెనీలు తమ సిబ్బందికి కరోనా సమయంలో సహాయం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు సోనలికా ట్రాక్టర్ కోవిడ్ 19 చికిత్స ఖర్చులు చెల్లించి దాని డీలర్లు మరియు ఉద్యోగుల సహాయానికి ముందడుగు వేసింది. 19 ఏళ్లు దాటిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని కూడా కంపెనీ హామీ ఇచ్చింది.

MOST READ:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 5 కోట్లు విరాళం ప్రకటించిన కియా మోటార్స్

శభాష్ సోనాలిక.. కరోనా సమయంలో కూడా సిబ్బందికి అండగా

సోనాలిక కంపెనీ మొదట, కోవిడ్ 19 బారిన పడిన డీలర్ మరియు సిబ్బందికి వైద్య ఖర్చుల కోసం 25,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. దీనితోపాటు డీలర్లు మరియు సిబ్బంది ఉద్యోగుల పిల్లలకు వైద్య సహాయం మరియు విద్య కోసం సంవత్సరానికి రూ. 50 వేల వరకు చెల్లిస్తున్నారు.

శభాష్ సోనాలిక.. కరోనా సమయంలో కూడా సిబ్బందికి అండగా

ఇది మాత్రమే కాకుండా కోవిడ్ 19 చికిత్స కోసం అదనంగా రూ. 25 వేలు మంజూరు చేస్తున్నారు. ఈ అన్ని సౌకర్యాలతో పాటు, ఏదైనా డీలర్ లేదా ఉద్యోగి కరోనా మహమ్మారి వల్ల మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది.

MOST READ:అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

శభాష్ సోనాలిక.. కరోనా సమయంలో కూడా సిబ్బందికి అండగా

దీని గురించి సోనలికా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ మాట్లాడుతూ, కోవిడ్ 19 సెకండ్ వేవ్ భారతదేశాన్ని కుదిపివేస్తోంది. దీని వాళ్ళ ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. అంతే కాకుండా పెరుగుతున్న రోగుల కారణంగా దేశంలో మోళిక సదుపాయాల కొరత ఏర్పడింది.

శభాష్ సోనాలిక.. కరోనా సమయంలో కూడా సిబ్బందికి అండగా

సాధారణ ప్రజలతో పాటు కరోనా మా డీలర్ మరియు మా భాగస్వాములకు, ముఖ్యంగా డీలర్ ఉద్యోగులకు చాలా ఇబ్బందిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న లేదా అకాల మరణంతో బాధపడుతున్న ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలని కంపెనీ నిర్ణయించింది.

MOST READ:లాక్‌డౌన్ రూల్స్ గాలికొదిలేసిన ముఖ్యమంత్రి కొడుకు.. ఎవరో తెలుసా..?

శభాష్ సోనాలిక.. కరోనా సమయంలో కూడా సిబ్బందికి అండగా

ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఉన్న మా సిబ్బందికి సహాయం అందించడానికి మరియు కోవిడ్ 19 వల్ల కలిగే కష్టాల సమయంలో వారికి అండగా నిలబడటానికి నిరంతరం కట్టుబడి ఉంటామని రామన్ మిట్టల్ అన్నారు. ఏది ఏమైనా కరోనా సమయంలో కంపెనీలు తమ సిబందికి అండగా నిలబడటం చాలా అవసరం, ఈ విధంగా సాయం చేస్తున్న ప్రతి సంస్థ ప్రశంసనీయం.

Most Read Articles

English summary
Sonalika Tractor Offers Financial Support To Dealers And Employees. Read in Telugu.
Story first published: Friday, May 21, 2021, 12:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X