రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సోనాలిక.. ఏంటనుకుంటున్నారా?
కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపించడం వల్ల దేశంలో దాదాపు చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ విధించబడింది. ఈ కారణంగా కరోనా లాక్ డౌన్ విధించిన ఈ రాష్ట్రాల్లో దాదాపు అన్ని సేవలు నిలిపివేయబడ్డాయి. ఇందులో భాగంగానే వాహన తయారీ సంస్థలు మరియు వెహికల్ షోరూమ్ మరియు సర్వీస్ సెంటర్లు కూడా మూసివేయబడ్డాయి.

కరోనా కారణంగా వెహికల్ షోరూమ్ మరియు సర్వీస్ సెంటర్లు మూసివేయబడిన కారణంగా చాలా కంపెనీలు ఇప్పటికే వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ వ్యవధిని మరింత పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రముఖ ట్రాక్టర్ తయారీ సంస్థ సోనాలిక తమ వాహనదారుల సౌకర్యార్థం ఇప్పుడు వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ వ్యవధిని పెంచినట్లు తెలిపింది.

సోనాలికా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం కంపెనీ ట్రాక్టర్ల యొక్క వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ ఇప్పుడు 2021 మే 1 నుండి జూన్ 30 వరకు పొడిగించింది. అంటే ప్రస్తుతం ఈ వ్యవధి ఏకంగా రెండు నెలలు పొడిగించినట్లు తెలుస్తోంది.

కంపెనీ వారంటీ కి సంబంధించిన సమాచారం ఇ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారులకు పంపబడుతుందని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ మహమ్మారి అధికంగా విజృంభిస్తున్న సమయంలో కస్టమర్లకి కొంత అండగా ఉండటానికి ఈ ప్రకటన జారీ చేయడం జరిగిందని కంపెనీ తెలిపింది.

కరోనా లాక్ డౌన్ సమయంలో వెహికల్ వారంటీ గురించి కస్టమర్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ అందించిన ఈ వ్యవధిలో కస్టమర్లు ఈ సర్వీస్ వినియోగించుకోవచ్చు. కావున ఈ క్లిష్ట సమయంలో వాహన వినియోగదారులు బయటకు రావాల్సిన అవసరం ఉండదు.

దీనిపై సోనాలిక గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ మాట్లాడుతూ, వారంటీ వ్యవధిని పొడిగించడానికి ప్రధాన కారణంగా, లాక్ డౌన్ దృష్టిలో ఉంచుకుని కష్టాల్లో ఉన్న రైతులకు అనుకూలంగా ఉండడానికి ఈ విధంగా ప్రకటించడం జరిగిందని అన్నారు. అంతే కాకుండా ఈ సమయంలో రైతులకు మద్దతు కూడా ఇవ్వడానికి వెనుకాడబోమని కంపెనీ తెలిపింది.

భారతదేశంలో గత సంవత్సరం వ్యాపించిన కరోనా సమయంలో కూడా కంపెనీ రైతులకు మద్దతుగా నిలిచింది. అదే విధంగా కంపెనీ ఈ సారి కూడా మద్దతుగా తన కస్టమర్ల పక్షాన నిలిచింది. ప్రైమరీ వారంటీ వ్యవధిని రెండు నెలలు పొడిగించడం ద్వారా, తమ కస్టమర్లకు చాలా అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం సోనాలిక కంపెనీ మాత్రమే కాకుండా, ప్రస్తుతం మహీంద్రా & మహీంద్రా మరియు ఐషర్ వంటి ట్రాక్టర్ కంపెనీలు కూడా తమ వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ వ్యవధిని రెండు నెలలు పొడిగించాయి. ఇటీవల సోనాలిక కంపెనీ కరోనా మహమ్మారి నివారణలో భాగంగా వైద్య ఖర్చులలో తన ఉద్యోగులకు సహాయం చేస్తోంది. అంతే కాకుండా కరోనా వల్ల మరణించిన కంపెనీ ఉద్యోగులకు ఈ సంస్థ రూ .2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది.


Click it and Unblock the Notifications








